Celebrity Life

“సైరా” టీజర్‌లో .. టాప్ 10 ఆసక్తికర విశేషాలు ఇవే..!

Babu Koilada  |  Aug 20, 2019
“సైరా” టీజర్‌లో .. టాప్ 10 ఆసక్తికర విశేషాలు ఇవే..!

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న “సైరా” (Sye Raa) టీజర్ ఎట్టకేలకు వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ టీజర్‌కి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. స్వాతంత్య్ర  సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. ఈ సంవత్సరం అక్టోబరు 2వ తేదిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రోజు టీజర్ విడుదలైన సందర్బంగా.. మనం కూడా దీనికి సంబంధించిన టాప్ 10 ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

1. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ – ఈ టీజర్ స్టార్ట్ అవ్వగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటలు మనకు వినిపిస్తాయి. “చరిత్ర స్మరించుకుంటుంది.. ఝాన్సీ లక్ష్మీబాయి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలని. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు… ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు” అనగానే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో టీజర్ అభిమానులకు స్వాగతం పలుకుతుంది. 

2. సాయిమాధవ్ డైలాగ్స్ –  పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ పూర్తవ్వగానే.. “హూ ఈజ్ నరసింహారెడ్డి” అని అడిగే ఒక బ్రిటీషర్ గొంతు మనకు వినిపిస్తుంది. వెంటనే “సింహం లాంటోడు దొర.. అతడే మా ధైర్యం దొరా..” అని ఓ దేశభక్తుడి డైలాగ్ మనకు వినిపిస్తుంది. దీనిని బట్టి ఈ సినిమాలో సంభాషణలకు కూడా పెద్ద పీట వేశారని చెప్పవచ్చు. 

మెగాస్టార్ చిరంజీవి సరసన.. మరో హీరోయిన్ వేటలో సైరా టీం!

3. చిరంజీవి ఎంట్రీ – అలాగే ఈ టీజర్‌లో చిరంజీవి నటించిన యాక్షన్ సన్నివేశాలు కూడా హైలెట్ అనే చెప్పవచ్చు. చిత్రం మీద ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయవి. ముఖ్యంగా శత్రువులపై కత్తులు దూస్తూ.. సైన్యానికి మార్గనిర్దేశం చేసే దిశలో చెప్పే సంభాషణలు కూడా బాగున్నాయి. “రేనాటి వీరులారా.. చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి” అని హీరో పలికే డైలాగ్స్ టీజర్‌కే హైలెట్. 

4. పాత్రల పరిచయం – కేవలం క్షణాల వ్యవధిలో మనకు చూపించే అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు పాత్రల పరిచయాలు టీజర్‌ పై మరింత ఆసక్తిని పెంచాయి. 

5. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – అలాగే ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించిన జులియస్ పకియం గురించి మనం చెప్పుకోవాల్సిందే. ఒక స్వాతంత్య్ర సమరయోధుడి కథకు తగినవిధంగా.. మంచి నేపథ్య సంగీతాన్ని అందించారు. ధూమ్ 3, భజరంగీ భాయ్ జాన్, సుల్తాన్ లాంటి సినిమాలకు గతంలో జులియస్ నేపథ్య సంగీతాన్ని అందించారు.

 

 

 

6. స్టంట్స్ – అలాగే ఈ సినిమాలోని స్టంట్స్‌కు పెద్ద పీటే వేశారు దర్శకుడు. విదేశీ స్టంట్ మాస్టర్లైన లీ విట్టేకర్, జార్జ్ పావెల్‌తో పాటు మన స్టంట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్, విజయ్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు నిజంగానే ఈ చిత్రానికి అదనపు మైలేజీని తీసుకొని వచ్చాయి. 

7. రత్నవేలు ఫోటోగ్రఫీ –  అలాగే కెమెరామన్ రత్నవేలు ఫోటోగ్రఫీ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. ఒక చారిత్రక కథాంశానికి తగ్గ విధంగా ఆయన సీన్స్‌ను తెరకెక్కించారు.

‘థాంక్యూ.. రామ్ చరణ్’.. ‘సైరా’ పై సుదీప్ మదిలోని మాట..!

8. కాస్ట్యూమ్స్  –  ఈ చిత్రంలో కాస్ట్యూమ్స్ కూడా ప్రధాన పాత్ర పోషించాయని చెప్పవచ్చు. పాత్రలు ధరించిన వస్త్రాల రూపకల్పన, చిరంజీవి పాత్రకు ఆహార్యాన్ని తీర్చిద్దిన తీరు అన్నీ చాలా వినూత్నంగా, డిఫరెంట్‌గా ఉన్నాయి. అంజు మోడీ, ఉత్తరా మీనన్‌తో పాటు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల కూడా కాస్ట్యూమ్స్ డిజైన్ టీమ్‌లో సభ్యులుగా ఉండడం గమనార్హం. 

9. రజనీకాంత్, మోహన్ లాల్ వాయిస్ ఓవర్ – సైరా టీజర్ తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదలైంది. తమిళ టీజర్‌కి రజనీకాంత్ వాయిస్ ఓవర్ అందివ్వగా.. మలయాళం వెర్షన్‌కి మోహన్ లాల్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం. 

10. హిందీ టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ – ఈ సినిమా టీజర్ తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా హిందీ టీజర్‌కు కూడా విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్ రావడం విశేషం. 

మ‌ణిక‌ర్ణిక‌పై.. మెగాస్టార్ ప్రశంసల వర్షం..!

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

 

Read More From Celebrity Life