Bollywood

సల్మాన్ ఖాన్‌తో.. మెగా కోడలు ఉపాసన కొణిదెల ప్రత్యేక ఇంటర్వ్యూ..!

Sandeep Thatla  |  Jun 7, 2019
సల్మాన్ ఖాన్‌తో.. మెగా కోడలు ఉపాసన కొణిదెల ప్రత్యేక ఇంటర్వ్యూ..!

బాలీవుడ్‌లోనే కాకుండా.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే చెప్పుకోదగ్గ స్టార్ హీరోలలో సల్మాన్ ఖాన్ ఒకరు. చిత్ర ఫలితాలతో సంబంధం లేకుండా.. బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిపించే హీరో అతడు. ఇక తాజాగా ఆయన నటించిన “భారత్” చిత్రం కూడా రంజాన్ సందర్భంగా విడుదలై.. కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులని సృష్టిస్తోంది. ఇటీవలే ఆయన ప్రముఖ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ (Ram Charan) సతీమణి, అపోల్ హాస్పిటల్స్ వైస్ ఛైర్మన్ ఉపాసన కొణిదెలకు (Upasana Konidela) ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఫిట్‌నెస్ గురించి ప్రజల్లో.. ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించేందుకు అపోలో హాస్పిటల్స్ తరపున బీ పాజిటివ్ (B Positive) అనే మ్యాగజైన్‌ని ఉపాసన నడుపుతున్నారు. ఈ మ్యాగజైన్ కోసం ప్రతి నెల ఓ సెలబ్రిటీ‌తో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఆయా సెలబ్రిటీ రోజువారీ తీసుకునే ఆహారం ? తన ఫిట్‌నెస్ వెనుకున్న రహస్యాలు? ఆరోగ్యంగా ఉండడానికి వారు పాటించే పద్దతులు? వంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.

ఈ నెలకు సంబంధించి.. ఆ ఇంటర్వ్యూకి సల్మాన్ ఖాన్‌‌ని ఎంపిక చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ కోసం.. ప్రత్యేకంగా ముంబై వెళ్ళి.. ఆయనని స్వయంగా కలిసి బిపాజిటివ్ మ్యాగజైన్ కోసం ప్రశ్నలు సంధించారు ఉపాసన. ఇటీవలే ఈ ముఖాముఖికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేశారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా సల్మాన్ చెప్పిన ట్యాగ్ లైన్‌నే.. మ్యాగజైన్ కవర్ పేజీపై కూడా ప్రచురించారు – “వి స్ట్రగుల్, వి సర్వైవ్ & సస్టెయిన్” (We Struggle , We Survive & Sustain) అని సల్మాన్ చెప్పిన సూత్రాన్నే ప్రముఖంగా ప్రమోట్ చేశారు. 

 

ఈ ఇంటర్వ్యూ‌కి సంబంధించి ఉపాసన కొణిదెల (Upasana Konidela) తన ట్విట్టర్ లో స్పందిస్తూ – “థాంక్స్ Mr C, నీ సహకారం లేకుండా నేను ఈ ఇంటర్వ్యూ చేయలేకపోయేదాన్ని. నువ్వు ఇచ్చిన ధైర్యం వల్లే నేను సల్మాన్ ఖాన్‌ని ఇంటర్వ్యూ చేయగలిగాను. ఇక ఈ ఇంటర్వ్యూ ద్వారా సల్మాన్ ఖాన్‌లోని మరో కోణాన్ని చూసే అవకాశం మీకు లభిస్తుంది అని మాత్రం చెప్పగలను” అని తెలిపారు. 

సాధారణంగా సల్మాన్ ఖాన్ (Salman Khan) అంటే ఎన్నో వివాదాలకు కేంద్రబిందువుగానే చూస్తారు. అయితే ఆయన నుండి నేటి యువత నేర్చుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది – ఫిట్‌నెస్. అయిదు పదుల వయసులో కూడా ఎంతో ఫిట్‌గా ఉంటూ ఆరోగ్యం పైన పూర్తి శ్రద్ధ పెట్టడమే ఆయన సక్సెస్ సీక్రెట్. ఇదే అంశం పై ఉపాసన కూడా తమ ముఖాముఖిలో ప్రశ్నలు అడిగి ఉండచ్చు. ఈ క్రమంలో దైనందిన జీవితంలో యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎలా ఉండాలన్న అంశంపై పైన వీక్షకులకు ఒక అవగాహన ఏర్పడే అవకాశం ఉంది.

 

ఎందరో అభిమానులు సల్మాన్ ఖాన్‌ని తమ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు! ఈ ముఖాముఖిలో ఆయన చెప్పిన అంశాలను బట్టి.. తన అభిమానులు సైతం ఈ ఆరోగ్య చిట్కాలు పాటించే అవకాశం ఉంది. 

గతంలో ఉపాసన కొణిదెల “అపోలో లైఫ్ – బీ పాజిటివ్ మ్యాగజైన్” పేరుతో చేస్తున్న ఇంటర్వూలో భాగంగా నటి సమంత (Samantha) & అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాలతో (Sania Mirza) మాట్లాడారు. వారి  ఫిట్నెస్ మంత్రం ఏంటి? ఎలాంటి డైట్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు? అనే ప్రశ్నలు వారిని అడిగి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ గురించి సమగ్ర సమాచారాన్ని ప్రేక్షకులకి కూడా అందించారు. ప్రస్తుతం సల్మాన్‌తో ఉపాసన చేసిన ఇంటర్వ్యూ.. త్వరలోనే బీపాజిటివ్ మ్యాగజైన్‌లో ప్రచురితమవుతుంది. 

Featured Image: Twitter

ఇవి కూడా చదవండి

#POPxoWomenWantMore ఉపాస‌న స్టార్‌ వైఫ్ మాత్ర‌మే కాదు.. గొప్ప సేవామూర్తి కూడా..!

ఉపాసన హోస్ట్ అవతారమెత్తి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందంటే..

“చిరుత” నుండి “రంగస్థలం” వరకు.. అలుపెరగని పయనం: హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్

 

Read More From Bollywood