Entertainment

మీరు నన్ను భయపెట్టలేరు – ‘డియర్ కామ్రేడ్’లో విజయ్ దేవరకొండ

Sandeep Thatla  |  Jul 11, 2019
మీరు నన్ను భయపెట్టలేరు – ‘డియర్ కామ్రేడ్’లో విజయ్ దేవరకొండ

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అంతగా ప్రజల్లోకి అతను చొచ్చుకుపోగలిగాడు. చాలా స్వల్పకాలంలోనే హీరోలందరూ కలలు గనే స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో కెరీర్ మలుపు తిరిగాక .. గీతగోవిందం, ట్యాక్సీవాలా చిత్రాలు సాధించిన ఘనవిజయంతో చాలా గ్రాండ్‌గా 2018 ని ముగించాడు.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ కథ

ఇక ఈ ఏడాది తాజాగా ఆయన నుండి వస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్ (Dear Comrade). చెప్పాలంటే.. ఈ చిత్రం మే నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ తదితర అంశాల్లో జరిగిన జాప్యం వల్ల.. ఈ నెల అనగా జులై 26వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ (Dear Comrade Trailer) కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. మరి ఇదే ట్రైలర్ అభిమానులు పెట్టుకున్న అంచనాలను ఏ మేరకు అందుకుందనేది ఇప్పుడు చూద్దాం.

 

డియర్ కామ్రేడ్ ట్రైలర్ ఎలా ఉందంటే …

“ఒక కామ్రేడ్ పోరాడితే… అతనికి ఆ పోరాటం హాయినివ్వాలి… స్వేచ్ఛనివ్వాలి … నిన్ను చూస్తే అలా లేవు!” అంటూ ట్రైలర్‌ని ఆరంభించాడు దర్శకుడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ – బాబి అనే ఒక విద్యార్థి నాయకుడి పాత్రలో కనిపిస్తుండగా ..హీరోయిన్ రష్మిక మందాన – లల్లీ అనే రాష్ట్ర స్థాయి క్రికెట్ క్రీడాకారిణి పాత్రను పోషిస్తోంది.

ఒక విద్యార్థి నాయకుడి జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో తీసిన చిత్రంగా.. ఈ సినిమా మనకు కనబడుతోంది. 

డైనింగ్ టేబుల్ దగ్గర… విజయ్‌తో తన తండ్రి పాత్ర చెప్పే మాటలు.. కథపై మనకు ఒక క్లారిటీని అందిస్తాయి. అదే ఈ డైలాగ్ – “ఇలాంటి ధైర్యం, తెగువ మంచివే గాని… ఈ గొడవల్లో పోగొట్టుకున్నవే నిన్ను ఎక్కువగా బాధపెడతాయి.”

ఇదే డైలాగ్‌కి కొనసాగింపుగా వచ్చే మరో సంభాషణ “వచ్ఛేటప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ… వెళ్ళిపోయాక ఎందుకింత బాధ పెడుతుంది”.. ప్రేక్షకులకు కథపై ఆసక్తిని పెంపొందిస్తోంది. 

అలాగే లల్లీతో హీరో మాట్లాడుతూ “నన్ను, మీ నాన్నని, వాడిని … సొసైటీని మర్చిపో! నీకేదిష్టమో దాని గురించి ఆలోచించు. నీ ఇష్టం గురించి ఫైట్ చెయ్.. ఇలా పిరికిదానిలా ఉండకు లిల్లీ” అని చెప్పే డైలాగ్ మనకు విజయ్ పాత్ర పై ఒక స్పష్టతను తెస్తుంది. 

ఇక విజయ్ పోషించిన బాబీ పాత్ర విషయానికి వస్తే, తనకు కాలేజ్ ప్రిన్సిపాల్‌కు మధ్య జరిగే సన్నివేశం ఆసక్తిని కలిగిస్తుంది.  “నువ్వు చాలా ఇంపల్సివ్ (ముందు వెనుక ఆలోచించకుండా)” అని తను కరాకండీగా చెబుతాడు.

అలా ముందు వెనుక ఆలోచించకుండా తనదైన గమ్యానికి చేరువయ్యే దశలో.. ఓ విద్యార్థి నాయకుడు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? తన స్వభావం వల్ల ప్రేమని కోల్పోయాడా? లేదా జీవితంలో ఇంకేదైనా విలువైనది పోగొట్టుకున్నాడా అనేది సినిమాలో చూడాలి.

అవంతిక అనే బోల్డ్ & బ్యూటిఫుల్ అమ్మాయిగా.. “మన్మథుడు 2″లో రకుల్ ప్రీత్

ఇక ఈ సినిమాలో రష్మిక (Rashmika Mandanna) పాత్ర విషయానికి వస్తే, “ఈ జర్నీలో నేను నీకు తోడుగా ఉంటాను. లెట్ మీ బి యువర్ కామ్రేడ్” అంటూ చెప్పిన వాడు ఒక్కసారిగా దూరమైతే ఎలా ఉంటుందో ఆమె భావోద్వేగాలను బట్టి చెప్పేయవచ్చు. 

విజయ్ – రష్మికల జంటకి ఇప్పటికే వెండితెర పై సూపర్ హిట్ పెయిర్‌గా ముద్రపడగా.. మరోసారి ఈ చిత్రంలో వీరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకొనేలానే ఉన్నాయి.

ఈ ట్రైలర్ చూసాక… విజయ్ దేవరకొండని దర్శకుడు మరొక కొత్త కోణంలో చూపెట్టాడని ఇట్టే అర్థమవుతుంది. అదే సమయంలో ప్రేమికురాలిని కామ్రేడ్ అని పిలవడం కూడా.. చాలా కొత్తగా అనిపించింది. 

ఇక సినిమాకి ఇంకొక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఒకేసారి నాలుగు దక్షిణాది భాషలలో (తెలుగు, తమిళ, కన్నడ & మలయాళం) ఈ చిత్రం విడుదల అవుతోంది. అలాగే ఈ చిత్రంలో మలయాళ నటి శృతి రామచంద్రన్ ఒక కీలక పాత్రలో నటించడం జరిగింది. సాంకేతిక వర్గం విషయానికి వస్తే, జస్టిన్ ప్రభాకరన్ ఈ ‘డియర్ కామ్రేడ్’కి సంగీతం అందించగా.. సుజిత్ సారంగ్ ఛాయాగ్రాహకుడిగా & శ్రీజిత్ సారంగ్ ఎడిటర్‌గా పనిచేశారు.

ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్‌ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. బిగ్ బెన్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మొత్తానికి విజయ్ అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిగా సాగడం.. అలాగే అది చిత్రం పై అంచనాలను పెంచడం.. ఒకరకంగా ఈ సినిమా తప్పక హిట్ అవుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. 

 గ్రాడ్యుయేషన్ చేయకపోయినా.. సినిమాలతో కోట్లు సంపాదించేస్తున్నారు..!

Read More From Entertainment