అవంతిక అనే బోల్డ్ & బ్యూటిఫుల్ అమ్మాయిగా.. "మన్మథుడు 2"లో రకుల్ ప్రీత్

అవంతిక అనే బోల్డ్ & బ్యూటిఫుల్ అమ్మాయిగా.. "మన్మథుడు 2"లో రకుల్ ప్రీత్

తన పేరుకి ముందు యువ సామ్రాట్ ట్యాగ్ తీసేసి.. కింగ్ అని పెట్టుకున్నప్పటికి తనలో మునుపటి చార్మ్ ఏమాత్రం కూడా తగ్గలేదని తాజాగా విడుదలైన 'మన్మథుడు 2' (Manmadhudu 2) టీజర్ ద్వారా తెలియచేశాడు నాగార్జున (Nagarjuna). మరి 60 ఏళ్ళ వయసులో కూడా ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్న ఈయన పక్కన నటించాలంటే.. ఏ హీరోయిన్ కైనా కాస్త ఛాలెంజింగానే ఉంటుంది.

విక్టరీ వెంకటేష్ సరసన నటిస్తున్న రకుల్ ప్రీత్!!

అటువంటి ఒక ఛాలెంజ్‌‌ని రకుల్ ప్రీత్ చాలా ఈజీగా దాటేసినట్టు తెలుస్తోంది. ఇంతకుముందే విడుదలైన మన్మథుడు 2 టీజర్ చూస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది. దాదాపు రెండు వారాల క్రితం విడుదలైన మన్మథుడు 2 టీజర్‌లో రకుల్ ప్రీత్ కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్ ఒకింత బాధపడ్డారు. అయితే ఇప్పుడు విడుదలైన స్పెషల్ టీజర్ రకుల్ ప్రీత్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చేలా ఉంది.

ఇంతకి టీజర్ ఎలా ఉందంటే -

మన్మథుడు 2 చిత్రంలో అవంతిక (Avanthika) అనే పాత్రలో నటిస్తున్న రకుల్ ప్రీత్‌కి సంబంధించి.. విడుదలైన టీజర్‌లో దర్శకుడు రెండు షేడ్స్‌ని చూపెట్టాడు. ముందుగా U సర్టిఫికెట్ లాంటి పాత్రలో (ఇది రకుల్ ప్రీత్ చెప్పిన మాట)  కనిపించిన ఆమె.. చివరికి A సర్టిఫికెట్ షేడ్ చూపిస్తుంది. అయితే దర్శకుడు మొన్న విడుదలైన టీజర్‌లో నాగార్జున పాత్రని కూడా దాదాపు ఇలానే చూపించాడు.

దీనితో మన్మథుడు 2 చిత్రంలో నాగార్జున, రకుల్ ప్రీత్ (Rakul Preet) పాత్రలు రెండు షేడ్స్‌తో ప్రేక్షకులని అలరించనున్నాయన్నమాట. ఇక ఈ టీజర్‌లో రకుల్ ప్రీత్ ఎప్పటిలాగే అందంగా, చలాకీగా కనపడింది. ఇక బోల్డ్ షేడ్‌ని చూపించే ప్రయత్నంలో ఆమె చేత సిగరెట్ తాగించే సన్నివేశాన్ని ఇందులో పొందుపరిచారు. 

ఇక రకుల్ ప్రీత్‌ని బ్యూటిఫుల్ షేడ్‌లో చూపించడానికి - "ఆ అమ్మాయి చల్లటి గాలి లాంటిది" అనే రొమాంటిక్ డైలాగ్స్ పెట్టాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.

ఇక ఈ టీజర్‌లో రకుల్ ప్రీత్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. అదేంటంటే - "ఇప్పటివరకు U సర్టిఫికెట్ కోసం ప్రయత్నించా... ఇప్పుడు A సర్టిఫికెట్ చూపిస్తా..."

దీనికి వెన్నెల కిషోర్ సమాధానంగా - "డేంజరస్ బేబ్" అని రకుల్ ప్రీత్‌ని వర్ణిస్తాడు.

మొత్తానికి వచ్చే నెల అనగా.. ఆగష్టు 9న విడుదలకాబోయే ఈ చిత్ర పోస్ట్ - ప్రొడక్షన్ పనులు దాదాపు చివరికొచ్చేశాయి. ఇక త్వరలోనే ఈ సినిమా పాటలు, ట్రైలర్ విడుదలకాబోతున్నాయి. అలాగే ఈ మన్మథుడు 2 ప్రీ - రిలీజ్ ఈవెంట్‌ని కూడా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారట.

'ఐ ఓన్లీ మేక్ లవ్' అంటోన్న నాగార్జున .. మన్మథుడు 2 టీజర్ టాక్ మీకోసం..

తన మొదటి చిత్రం చి.ల.సౌ తోనే ఒక మంచి దర్శకుడుగా  పేరు తెచ్చుకుని.. ఆ తరువాత నాగార్జునతో మన్మథుడు 2 అవకాశం కొట్టేసిన రాహుల్ రవీంద్రన్... మరోసారి తన అదృష్టాన్ని ఈ చిత్రం ద్వారా పరీక్షించుకోబోతున్నాడు. అదే సమయంలో నాగార్జున కూడా ఈ చిత్రం పై ఎంతో నమ్మకంతో నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో నాగార్జున, రకుల్ ప్రీత్‌లతో పాటుగా సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, వెన్నెల కిషోర్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని మొదలైన వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక అతిథి పాత్రల్లో సమంత, అక్షర గౌడ & కీర్తి సురేష్‌లు తళుక్కుమని మెరవనున్నారు. ఈ మన్మథుడు 2 చిత్రానికి.. సంగీతాన్ని చైతన్ భరద్వాజ్ అందిస్తుండగా సుకుమార్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 మోషన్ పిచర్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా ..అన్నపూర్ణ స్టూడియోస్ & ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

ఆఖరుగా.. ఈ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నాగార్జున, రకుల్ ప్రీత్‌లు మనల్ని ఆకట్టుకోవాలని... మన్మథుడు మాదిరిగానే మన్మథుడు 2 కూడా మంచి విజయం సాధించాలి అని కోరుకుందాం...

స్టార్ కామెంటేటర్ హర్ష భోగ్లే‌ని ఫిదా చేసిన.. తెలుగు సినిమా "చి.ల.సౌ"