సాధారణంగా ఇతరులతో స్నేహం చేయని అమ్మాయిలు కూడా బార్‌కి (Bar) వెళ్తే సోషలైజ్ అయిపోతారట తెలుసా? అవును.. అందుకే బార్లో మనకు కలిసే అమ్మాయిలు.. అందులోనూ అక్కడి బాత్రూంలో మనకు స్నేహితులయ్యేవారు ఎంతో ప్రత్యేకం.
ఒకరినొకరు ప్రశంసించుకోవడం, ఫన్నీగా గొడవ పెట్టుకోవడం, నవ్వుకోవడం ఇలా వాళ్లు మాత్రమే ప్రత్యేకంగా చేసే కొన్ని అంశాలు ప్రతి అమ్మాయికీ వారిని ప్రత్యేకమైన స్నేహితులుగా మారుస్తాయి. ఈ అమ్మాయిల మధ్య స్నేహం గురించి అబ్బాయిలకు అస్సలు అర్థం కాదు కూడా.
మరి డ్రంక్ బాత్రూం (Bathroom) గర్ల్స్ ఎందుకు బెస్ట్ అని తెలుసుకోవాలంటే.. అసలు అమ్మాయిలు తాగిన తర్వాత బాత్రూంలో ఏం చేస్తారో తెలుసుకోవాలి. ఎప్పుడైనా మీ మూడ్ బాగాలేక బార్‌కి వెళ్లి మందు తాగాలనుకుంటే రాత్రి 11.30 తర్వాత అక్కడి బాత్రూంకి వెళ్లండి.
మీకంటూ ప్రత్యేకమైన స్నేహితులు ఏర్పడతారు. ఇంతకీ ఆ బాత్రూంలలో వాళ్లు చేసే ఫన్నీ విషయాలేంటో తెలుసా? వాళ్లు మీకెందుకు నచ్చుతారన్నానో తెలుసుకోవాలా? అయితే చదివేయండి.
1. మీ గురించి కేర్ తీసుకుంటారు.
బేబీ.. నీకు బాత్రూంకి వెళ్లేందుకు ఇబ్బంది అనిపిస్తోందా?
ఫర్వాలేదు. డోర్ కాస్త తీసిపెట్టు. నీకేం ఫర్వాలేదు.
ఇంత తాగేశావు.. రేపు పొద్దున్న హ్యాంగోవర్ రాకుండా ఉండాలంటే కొంచెం నీళ్లు ఎక్కువగా తాగాల్సిందే.
ఇలాంటి మాటలన్నీ మీరు అక్కడే వినగలరు. సాధారణంగా మన క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే మనకు సలహాలివ్వగలరు. కానీ వీళ్లు మాత్రం స్నేహం లేకపోయినా మీకు ఆప్తులైపోతారు.
2. వస్తువులు కూడా షేర్ చేసుకోవచ్చు..
వావ్.. ఈ రెడ్ లిప్ స్టిక్ ఎంత బాగుందో.. నాకు ఈ రంగంటే ఎంతో ఇష్టం.
అవునా. థ్యాంక్స్. ఇది నీ డ్రస్సుకి కూడా బాగా నప్పుతుంది. ఓసారి ప్రయత్నిస్తావా?
యెస్.
వావ్.. నువ్వు చాలా బాగున్నావు తెలుసా..
మనం సాధారణంగా ఇలాంటి మాటలు ఎక్కడైనా వింటామా? మేకప్ షేర్ చేసుకోకూడదు అని.. మహా అయితే ఆ లిప్ స్టిక్ ఎక్కడ కొన్నారో చెబుతారు. కానీ తాగిన తర్వాత మాత్రం వాళ్ల మనసు వెన్నలా మారుతుంది తెలుసా..
3. సాయానికి ముందుంటారు..
బేబీ నువ్వు వాంతి చేసుకోవాలా? సరే నీ జుట్టు వెనక్కి పట్టుకుంటా. కానివ్వు.
ఏంటి? అర్జంట్‌గా వాష్ రూంకి వెళ్లాలా? అయితే వెళ్లు.. నీ తర్వాత నేను వెళ్తాలే..
ఇలా ప్రతి విషయంలోనూ సాయం చేస్తుంటారీ అమ్మాయిలు.
4. బాధనంతా పంచుకుంటారు కూడా.
సాధారణంగా తాగేవాళ్లలో రెండు రకాలుంటారు. ఒక రకం వారు సంతోషంగా ఉంటే.. మరో రకం వారు బాధతో ఉంటారు.
తాగిన తర్వాత మన బాధను పంచుకోవడానికి ఈ బాత్రూంలో అమ్మాయిలు ఎప్పుడూ సిద్ధమే.
వినడం అంటే ఏదో అల్లాటప్పాగా వినడం కాదండోయ్.. ప్రతి అంశాన్నీ బాగా విని సలహాలు కూడా ఇస్తుంటారు. అందుకే ఈ అపరిచితులతో మాటలు ఇలా ఉంటాయి.
“అయ్యో నేను ఎక్కువగా తాగేసినట్లున్నా… ఆ కాక్ టెయిల్ తీసుకోకపోతే బాగుండేది..” దగ్గర్నుంచి మొదలయ్యే మాటలు..
“అందుకేనేమో నాకు చిన్నతనం నుంచీ ఆత్మవిశ్వాసం తక్కువ. ఎవరితోనూ తొందరగా కలిసిపోలేను. చిన్నతనంలో జరిగిన అనుభవాలు మనసులో ముద్రపడిపోతాయి కదా..” అనే దగ్గర పూర్తవుతాయి.
5. అసూయ లేని పొగడ్తలవి..
బార్లో రాత్రి తాగే అమ్మాయిలు స్నేహితులైతే వారిలాంటి వ్యక్తులు మీకు దొరకరనే చెప్పాలి. మీ విషయంలో ఎలాంటి ఇబ్బంది, అసూయ లేకుండా పొగడ్తలు అందించడం వారికే చెల్లుతుంది.
బేబీ నువ్వు డ్యాన్స్ ఫ్లోర్ పై మత్తెక్కించేలా డ్యాన్స్ చేశావు.
బేబీ ఈ డ్రస్, నీకు చాలా బాగుంది. ఇందులో నీ అందమైన కాళ్లు కనిపిస్తూ నీ లుక్‌ని మరింత పెంచుతున్నాయి.
ఇలాంటి ప్రశంసలకు అక్కడే మార్గం దొరుకుతుంది.
6. నిజాయతీగా అభిప్రాయం చెబుతారు..
ఆ అబ్బాయికి నీలాంటి గర్లఫ్రెండా? ఇంకాస్త బెటర్ వ్యక్తి దొరికేవాడేమో..
నీ ఎక్స్ మరొకరితో డేటింగ్ చేస్తే ఏంటి? అంతకంటే మంచి వ్యక్తి నీ జీవితంలోకి అడుగుపెడతాడులే. అది పట్టించుకోకు.
నువ్వు ఇంటికి తనతో వెళ్తున్నావా? కాస్త జాగ్రత్తగా ఉండు. తనని చూస్తే అంత మంచివాడిలా కనిపించట్లేదు. అంటూ నిజాయతీగా తమ అభిప్రాయంతో పాటు సలహాలు కూడా అందిస్తారు.
7. ఇలాంటివి తప్పక దొరుకుతాయి.
అత్యవసర సమయాల్లో మనకు అవసరమైన శానిటరీ న్యాప్ కిన్లు లేదా ట్యాంపూన్లు వీరి దగ్గర తప్పనిసరిగా అందుబాటులో ఉంటాయి. అడగగానే మనకు తప్పక ఇస్తారు కూడా.
8. నిమిషాల్లో స్నేహితులవుతారు..
నా బాయ్ ఫ్రెండ్ ఆరోజు నుంచి నా ఫోన్ ఎత్తడం మానేశాడు. నేను తన గర్లఫ్రెండ్‌ని, కానీ నాతో తను అలా ఎలా చేయగలడు? అది తలచుకుంటేనే నాకు ఏడుపొస్తుంది.
బేబీ.. అబ్బాయిలందరూ అలాంటివాళ్లే. నాకూ ఇలాంటిదే జరిగింది. అందుకే ఇప్పుడు అబ్బాయిలు చెప్పిన విషయాలను అస్సలు నమ్మట్లేదు. చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నా..
అవునా. నాకూ నీలాంటి స్నేహితురాలుంటే ఎంత బాగుండేదో.. మనిద్దరం ఇకపై ఫ్రెండ్స్..
అవును.. మన స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఇంకో డ్రింక్ తీసుకుందాం రా..
ఇలా నిమిషాల్లోనే మన బాధను విని అర్థం చేసుకునే మంచి స్నేహితులు మనకు దొరుకుతారు.
9. మరిన్ని పార్టీలకు ఆహ్వానం
రేపు కేఫ్ హార్ట్ రాక్‌లో ఇంకో పార్టీ ఉంది. నువ్వు, నీ స్నేహితులు అక్కడికి వచ్చేయండి.
వావ్. తప్పకుండా.. పార్టీ చేసుకుందాం..
ఇలా స్నేహితులవ్వడమే కాదు.. పార్టీలకు కూడా బాత్రూంలోనే ఆహ్వానాలు అందిపోతుంటాయి.
ఇవి కూడా చదవండి.
అమ్మాయిలూ.. వీటి గురించి అసలు బాధ పడాల్సిన అవసరమే లేదు..!
నిద్రంటే ప్రాణమైతే.. ఇలాంటి ఆలోచనలు మీకూ వస్తుంటాయి..!
ఈ భూమి మీద అసలు మహిళ లేకపోతే.. ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా?
Images : Giphy