DIY Life Hacks

“30 ఏళ్ల వయసు”.. మీలో ఎలాంటి అద్భుతమైన మార్పులు తీసుకొస్తుందో తెలుసా..?

Soujanya Gangam  |  Nov 26, 2019
“30 ఏళ్ల వయసు”.. మీలో ఎలాంటి అద్భుతమైన మార్పులు తీసుకొస్తుందో తెలుసా..?

(Why Turning 30 Is Actually Pretty Amazing)

చాలామంది తమకు 30  ఏళ్లు నిండాయంటే చాలు.. చాలా మధనపడిపోతుంటారు. “యవ్వనం (Youth) మొత్తం అయిపోయింది. ఇక జీవితంలో అన్నీ బాధ్యతలే” అంటూ బాధపడిపోతుంటారు. వయసుతో పాటు, అందానికీ ప్రాధాన్యం పెరుగుతున్న ప్రపంచంలో ఇది సహజంగా జరిగే పరిణామమే. మనం మన జీవితాన్ని అంకెలతో ముడిపెట్టుకుంటాం. “ఫలానా వయసుకల్లా సెటిల్ అయిపోవాలి. ఫలానా వయసులో ఇంత జీతాన్ని పొందాలి” అంటూ లక్ష్యాలు పెట్టుకుంటాం. ఒక వయసనేది వచ్చేలోపు ఎన్నో చేయాలని భావిస్తాం.

కానీ 30 సంవత్సరాలు (Thirities) వచ్చేస్తున్నాయంటే మాత్రం భయపడతాం. మనం సాధారణంగా ఏ ఏడాదైనా పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటాం. కానీ 30 ఏళ్లు వస్తే మాత్రం “అప్పుడే వయసైపోతోందా..?” అంటూ ఇబ్బంది పడతాం. ఎందుకంటే జీవితంలో యవ్వనాన్ని దాటి..  ముప్ఫైల్లోకి అడుగుపెట్టడమే కారణం. కాబట్టి వయసు పైబడిందని భావిస్తాం. కానీ ముప్ఫైల్లోకి అడగుపెట్టడం కూడా మంచిదే. ఎందుకంటే

1. కేవలం అర్థం చేసుకునే స్నేహితులే..

మీరు ఇరవైల్లో ఎంతోమందితో స్నేహం చేస్తూ ఉండచ్చు. కానీ ఆ స్నేహాలన్నీ ముప్ఫైల వరకూ నిలిచి ఉండవని మీకు తెలుసా? 30 సంవత్సరాలు నిండిన తర్వాత.. మీరు చాలా క్లోజ్‌గా వ్యవహరించే స్నేహితులు మాత్రమే మీతో ఉంటారు. ఇది చాలా మంచి విషయం. ఓ పెద్ద గ్యాంగ్ ఉండాలని ఇరవైల్లో అందరూ కోరుకుంటారు. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. వారితోనే స్నేహాన్ని కొనసాగించాలని భావిస్తారు. కానీ 30 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రం.. మీ మనసుకు నచ్చిన వారు మాత్రమే మీతో ఉంటారు. మీరిద్దరూ కలిసి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. కాబట్టి వారిని స్నేహితులనే బదులు.. ఒక కుటుంబంగా మీరు భావిస్తారు. 

2. అలాంటివారికి దూరమవుతారు

30 సంవత్సరాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మీరు.. మీ సమయం ఎంతో అమూల్యమైందని గుర్తు చేసుకుంటారు. మీ విలువైన సమయాన్ని అనవసరమైన వ్యక్తుల కోసం వెచ్చించి దాన్ని వృధా చేసుకోరు. మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా.. వాటితో తెలివిగా వ్యవహరించి తప్పించుకుంటారు.

3. ఆరోగ్యం పై శ్రద్ధ పెరుగుతుంది..

నమ్మినా.. నమ్మకపోయినా.. ఇది నిజం. ఇరవైల్లో ఉన్నప్పుడు ఆరోగ్య విషయంలో ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ 30 ఏళ్లు నిండాక.. అందరూ  ఎక్కువగా హెల్త్ కేర్ తీసుకుంటారు. ప్రతిరోజూ భోజనంతో పాటు.. సలాడ్ తీసుకోవడం, వ్యాయామం చేయడం, చెడు అలవాట్లను తగ్గించడం వంటివి చేస్తుంటారు. అయితే దీని అర్థం రుచికరమైన ఆహారం తీసుకోవట్లేదని కాదు.. కానీ తినే ఆహారం పట్ల శ్రద్ధ వహిస్తున్నారని అర్థం.

4. అనుభవాలు చాలా నేర్పిస్తాయి..

ఇరవైల్లోకి అడుగు పెట్టినప్పుడు.. అప్పుడప్పుడే కొత్త కొత్త స్నేహాలు, ప్రేమలు ప్రారంభమవుతాయి. బ్రేకప్ లాంటి విషయాలు ఎంతగానో బాధిస్తాయి. కానీ ముప్ఫైల్లోకి వచ్చిన తర్వాత.. మీ పాత బంధాలు, అదే బంధానికి సంబంధించి మీరు చేసిన తప్పుల గురించి మీరు ఆలోచిస్తారు. వాటి నుండి మీరు చాలా నేర్చుకుంటారు కూడా. జీవిత భాగస్వామి అంటే ఎలా ఉండాలో కూడా తెలిసిపోతుంది కాబట్టి.. అనుభవాల నుంచి చాలా నేర్చుకొని ముందుకు వెళ్తారు.

5. ఒంటరిగా కూడా ఎంజాయ్ చేస్తారు

ఎవరైనా ఇరవైల్లో ఉన్నప్పుడు “ఎంత స్టైలిష్‌గా కనిపించాలి.. ఎంత విభిన్నంగా ప్రవర్తించాలి” లాంటి విషయాలను ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు. అందుకోసం కాస్త నటించేందుకు కూడా ఇబ్బంది పడరు. కానీ ముప్ఫై సంవత్సరాలు వచ్చేసరికి మీరు మీలా ఉండడానికి ఇష్టపడతారు. అలా వ్యవహరించేందుకు మాత్రమే ఆసక్తి చూపిస్తారు. ఒంటరిగా సమయం గడుపుతూ.. మీకు నచ్చిన పని చేసేందుకు కూడా ఏమాత్రం సిగ్గుపడరు సరికదా.. ఎక్కువ సమయం పాటు అదే చేయాలనుకుంటారు.

6. పరిణితితో వ్యవహరిస్తారు..

మీకు 30 ఏళ్ల వయసు రాగానే.. మిమ్మల్ని మీరు పెద్దవారిగా భావిస్తారు. మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలన్నీ మీరే తీసుకుంటారు. మీకు నచ్చినట్లుగా మీరు జీవిస్తారు. మిమ్మల్ని మీరు నమ్మి డబ్బు, సమయానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. మన జీవితం చాలా రకాల లోపాలతో నిండి ఉంటుంది. కానీ ముందుకు సాగే కొద్దీ.. ఎంతో ఆనందం మన సొంతమవుతుంది.

7. ఆర్థికంగా కూడా ఆనందమే..

30 ఏళ్లు నిండాక మీరు ఆరోగ్యపరంగానే కాదు.. ఆర్థికంగా కూడా మంచి స్థితిలో ఉంటారు. మంచి ఉద్యోగం, జీతాన్ని పొందడంతో పాటు.. పొదుపు చేసే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఒకవేళ ఇప్పటివరకూ మీరు మీ ఆర్థిక స్థితి గురించి పట్టించుకోకపోయినా.. మీ భవిష్యత్తు గురించి ఆలోచించి ఆ నిర్ణయాలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

 

Read More From DIY Life Hacks