Humour

విడిపోయిన భార్యభర్తలను మళ్లీ కలిపిన.. టిక్ టాక్ వీడియో..!

Babu Koilada  |  Jul 3, 2019
విడిపోయిన భార్యభర్తలను మళ్లీ కలిపిన.. టిక్ టాక్ వీడియో..!

నేడు టిక్ టాక్ యాప్ (Tiktok) అందరినీ ఎంతగా ఆకర్షిస్తుందో తెలిసిన విషయమే. ఈ యాప్ ద్వారా సెలబ్రిటీలుగా మారినవారు కూడా చాలామంది ఉన్నారు. కొందరు తమ టాలెంట్ నిరూపించుకోవడం కోసం పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ.. ఆ వీడియోలను పోస్టు చేయడానికి టిక్‌టాక్‌ను వాడుకుంటే.. మరికొందరు మిమిక్రీలు, ఇమిటేషన్లు చేయడానికి కూడా టిక్‌టాక్‌ను వాడుతున్నారు. తద్వారా ఫేమస్ అవుతున్నారు. అభిమానులనూ సంపాదించుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. సినీ స్టార్లు, సెలబ్రిటీలు కూడా ఇటీవలి కాలంలో టిక్ టాక్ వాడడం ప్రారంభించారు. 

కానీ వీడియోలు పోస్ట్ చేయడానికి బాగా పనికొచ్చిన ఈ టిక్ టాక్ వల్ల కొన్ని మంచి పనులు కూడా జరుగుతున్నాయంటే నమ్ముతారా..? ఇటీవలే ఈ టిక్ టాక్ యాప్‌లో పోస్టు చేసిన ఓ వీడియో.. విడిపోయిన  భార్యా భర్తలను కలిపిందట. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన జయప్రద అనే మహిళ.. మూడు సంవత్సరాల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయిన తన భర్తను తిరిగి టిక్ టాక్ వీడియోలో చూసి ఆశ్చర్యపోయిందట. తొలుత ఈ వీడియో ఆమె బంధువు కంట్లో పడిందట. ఆయన ఆశ్చర్యపోయి జయప్రదకు వీడియో చూపించారట.

టిక్ టాక్ ( Tiktok) యాప్ బ్యాన్ అయింది.. మీమ్‌ల పండగ మొదలైంది..

ఈ వీడియో చూడగానే బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతకు ముందే ఆమె తన భర్త కనిపించడం లేదని అదే పోలీసు స్టేషనులో కంప్లైంట్ చేసింది. టిక్ టాక్ వీడియో చూసిన పోలీసులు.. అందులో నటించిన వ్యక్తిని ట్రేస్ చేయడం ప్రారంభించారు. దగ్గరలోని మిగతా పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. ఆఖరికి సదరు వ్యక్తి హోసురులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వెంటనే అక్కడికి వెళ్లి అతన్ని విల్లుపురం తీసుకొచ్చారు. తర్వాత అతని భార్యకు కబురు పెట్టి.. ఆమెను కూడా పోలీస్ స్టేషనుకి రప్పించారు. 

 

 

 

Representational Image (Twitter)

ఆ తర్వాత పోలీసులు విచారించిన మీదట.. ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. సురేష్ తన భార్య, ఇద్దరు బిడ్డలను వదిలి పెట్టి విల్లుపురం నుండి వెళ్లిపోయాడట. 2016లో ఈ ఘటన జరిగింది. అలా వెళ్లిపోయిన అతను హూసురుకి వెళ్లి అక్కడే.. ఓ ట్రాక్టర్ కంపెనీలో మెకానిక్‌గా చేరాడట. అక్కడే ఓ ట్రాన్స్‌జెండర్ ఇంట్లో నివాసముంటున్న సురేష్ ఇటీవలే టిక్ టాక్ వాడడం ప్రారంభించాడు. పలు వీడియోలు కూడా పోస్టు చేశాడు. అలాంటి ఓ వీడియో అతని బంధువు కంట్లో పడడంతో.. సదరు వ్యక్తి ఆచూకీ తెలిసింది.

టిక్ టాక్ (Tik Tok) వీడియోలతో ఆకట్టుకుంటోన్న కథానాయికలు వీరే..

సురేష్ ఇల్లు విడిచివెళ్లడానికి తన ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. తన ఆచూకీ దొరికాక కూడా.. అతను ఇంటికి తిరిగి వెళ్లనని పోలీసులు చెప్పాడట. కానీ పోలీసులు కౌన్సెలింగ్ చేసి అతనిని తన భార్యతో పంపించడం జరిగింది. ఆ మధ్యకాలంలో తమిళనాడు హైకోర్టు టిక్ టాక్‌ను బ్యాన్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టిక్ టాక్‌లో అశ్లీలకరమైన కంటెంట్ ఎక్కువగా వస్తుందని.. దీనికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే బ్యాన్ చేస్తున్నామని కోర్టు చెప్పడం గమనార్హం. అయితే ఆ తీర్పు వెలువడిన కొద్ది రోజులకు మళ్లీ బ్యాన్‌ను ఎత్తి వేశారు. 

టిక్‌టాక్‌తో ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది.. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

Read More From Humour