
(WWE Star ‘The Rock’ wishes 100-year-old fan Happy Birthday in adorable video)
డ్వేన్ జాన్సన్.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. డబ్ల్యు డబ్ల్యు ఈ (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్) తరఫున ప్రొఫెషనల్ రెజ్లింగ్ ఆడి.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న జాన్సన్‌ను అభిమానులు “రాక్” అని సంబోధిస్తూ.. అదే పేరుతో ప్రేమగా పిలుస్తుంటారు. ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా తన కెరీర్ ప్రారంభించిన రాక్.. అనుకోకుండా ప్రొఫెషనల్ రెజ్లింగ్ వైపు అడుగులు వేశాడు. అలాగే పలు హాలీవుడ్ చిత్రాలలో కూడా నటించాడు. పిల్లల నుండి పెద్దల వరకు తనకున్న అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువే.
సమంత రిటైర్‌మెంట్ పై ఫ్యాన్ ట్వీట్.. ఫన్నీ రిప్లై ఇచ్చిన హీరోయిన్..!
రాక్ తన అభిమానుల కోసం అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన పనులు కూడా చేస్తుంటారు. వారిని ఆనందింపజేయడానికి ప్రయత్నిస్తూ.. వార్తల్లోనూ నిలుస్తుంటారు. ఇటీవలే 100 ఏళ్లు నిండిన ఓ వృద్ధురాలికి.. రాక్ ఓ వీడియో పంపించారు. ఆ వీడియోలో ఆమె కోసం ప్రత్యేకంగా “హ్యాపీ బర్త్ డే” పాటను కూడా పాడారు. ఆ వృద్ధురాలి పేరు మేరీ గ్రోవర్. ఆమె అనేక సంవతర్సాలుగా రాక్‌కు అభిమానిగా ఉంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా.. రాక్ తనకు ఓ సందేశం కూడా పంపారు.
ధోనీ ఫ్యాన్ మూమెంట్: బామ్మా.. ఓ సెల్ఫీ తీసుకొందామా..?
“హ్యాపీ బర్త్‌డే మేరీ. మీరు నాకు ఓ ప్రత్యేకమైన అభిమాని. మీలాంటి అభిమాని దొరకడం నా అదృష్టం. 100వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎంతో గొప్ప జీవితం మీది. మీ జీవితం నలుగురికీ స్ఫూర్తిదాయకం. మిమ్మల్ని ఈ రోజు గుర్తుపెట్టుకొని.. ఇలా మీకోసం ఈ సందేశాన్ని పంపిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది” అని ఆ వీడియోలో పేర్కొన్నారు రాక్. ఆ సందేశంతో పాటు తానే స్వయంగా ఆ వీడియోలో.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం తన అభిమానికి రాక్ పంపిన వీడియో.. నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోని జామీ క్లింగ్‌లర్ అనే ఒకామె సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. ఇప్పుడా వార్త వైరల్ అయ్యింది. అలాగే 100 ఏళ్లు పూర్తి చేసుకున్న బామ్మ కూడా ఇప్పుడు బాగా పాపులర్ అయ్యింది. ఆవిడతో ఇంటర్వ్యూలు చేయడానికి అమెరికన్ టీవీ ఛానల్స్ ఎగబడుతున్నాయి. ఆమె ప్రస్తుతం ఫిష్ టౌన్ అనే ప్రాంతంలో నివసిస్తుందట. ఆమెను సన్నిహితులు మేయర్ ఆఫ్ ఫిష్ టౌన్ అంటూ.. ఈ బామ్మను సరదాగా ఆటపట్టిస్తుంటారట.
ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ కొట్టేసిన.. 87 ఏళ్ల క్రికెట్ అభిమాని చారులత పటేల్ ..!
ఇక రాక్ విషయానికి వస్తే.. గతంలో కూడా తన అభిమానుల కోసం తను ఇలాంటి పనులు చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే కొన్ని సంవత్సరాల క్రితమే రాక్ ప్రొఫెషనల్ రెజ్లింగ్‌కి వీడ్కోలు చెప్పాడు. తర్వాత సినిమాలలో నటించడం ప్రారంభించాడు. మమ్మీ రిటర్న్స్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ప్రెజెంట్స్ : హబ్స్ అండ్ షా, స్కార్పియన్ కింగ్, జంగిల్ క్రూయిజ్, జుమాంజీ ది నెక్స్ట్ లెవల్ లాంటి చిత్రాలు రాక్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆయన నటనకు పలుమార్లు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.
Featured Image: Twitter/ Jamie Klinger
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.