ధోనీ ఫ్యాన్ మూమెంట్: బామ్మా.. ఓ సెల్ఫీ తీసుకొందామా..?

ధోనీ ఫ్యాన్ మూమెంట్: బామ్మా.. ఓ సెల్ఫీ తీసుకొందామా..?

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి కోట్లాది మంది అభిమానులున్నారు. ధోనీ ఆటతీరుతో పాటు, అతని వ్యవహార శైలి సైతం ఆ అభిమానానికి కారణం. అవకాశం వచ్చిన ప్రతిసారి అభిమానుల హృద‌యాల‌ను దోచేస్తుంటాడు.


తన కోసం ఎదురు చూస్తున్నవారి దగ్గరికెళ్లి మరీ వారితో మాట్లాడతాడు. ఇలాంటి  ఉదాహరణలు మనం గతంలోనూ చూశాం. తన కోసం సెక్యూరిటీని దాటుకొని మైదానంలోకి వచ్చిన అభిమానికి షేక్ హ్యాండిచ్చినా.. తన కోసం ఎదురు చూస్తున్న చిన్నారి దగ్గరకు వెళ్లి ముద్దు చేసినా అది ధోనీకే చెల్లింది. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది.


ఐపీఎల్‌లో భాగంగా ఏప్రిల్ మూడో తారీఖున ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం డ్రస్సింగ్ రూంలోకి వెళ్లిన Dhoni కి తనకోసం ఓ పెద్దావిడ ఎదురుచూస్తోందనే సమాచారం భ‌ద్ర‌తా సిబ్బంది ద్వారా తెలిసింది. వెంటనే ఆమె కోసం వెనక్కి వచ్చాడు. అక్కడ ఓ పెద్దావిడ ‘ఐ యామ్ హియర్ ఓన్లీ ఫర్ ధోనీ’ అనే ప్లకార్డు పట్టుకొని తన మనవరాలితో కలసి ధోనీ కోసం ఎదురుచూస్తోంది.
 

 

 


View this post on Instagram


A series of undying Super Fandom! #WhistlePodu #Yellove #Thala 🦁


A post shared by Chennai Super Kings (@chennaiipl) on
ఆమె దగ్గరకు వెళ్లిన ధోనీ.. ఆ పెద్దావిడతో కాసేపు ముచ్చటించడంతో పాటు.. తను సంతకం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని బహుమతిగా అందించాడు. తర్వాత ఆమె ఆశీర్వాదాలు అందుకొన్నాడు. అనంతరం ఆమెతో కలసి సెల్ఫీ కూడా తీసుకొన్నాడు. ఈ అద్భుతమైన క్షణాన్ని కెమెరాలు క్లిక్ మనిపించాయి.


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఫొటోలను ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ ట్విట్టర్లో షేర్ చేసింది. ఐపీఎల్ ట్విట్టర్లోనూ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. అంతేకాదు.. అభిమానులంతా ‘ధోనీ ఈజ్ ది బెస్ట్’ అని పొగిడేస్తున్నారు. బామ్మ సైతం ధోనీని అభిమానించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించింది.
 

 

 


View this post on Instagram


There is no age limit for this superfandom! #WhistlePodu #Yellove 🦁💛


A post shared by Chennai Super Kings (@chennaiipl) on
ఇలా తన కోసం ఎదురు చూస్తున్న అభిమానులను కలుసుకోవడం ధోనీకి కొత్తేమీ కాదు. గతంలో త్రివేండ్రంలో వెస్టిండీస్‌తో మ్యాచ్ జరిగిన సమయంలో.. తన కోసం స్టేడియం బయట ఎదురు చూస్తున్న ఓ దివ్యాంగున్ని కలుసుకొని అతనితో కొంత సమయం గడిపాడు ధోనీ. కొన్ని రోజుల క్రితం ఓ చిన్నారితో మాట్లాడిన వీడియో సైతం వైరల్ అయింది. అందుకే కెప్టెన్ కూల్‌కి అభిమానులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు.


Feature Image: Chennaiipl Instagram


ఇవి కూడా చదవండి:


రానా అందించిన కానుకతో మురిసిపోతున్న జూనియర్ ఎన్టీయార్. ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చాడో?


భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ కు ఆయన కూతురికి ఏంటి సంబంధం?


తన జీవితంలో చదరంగం ఎప్పుడు భాగమైపోయిందో తెలియదంటోన్న చెస్ క్రీడాకారిణి ఎవరు?


అద్భుత‌మైన వార్త‌.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చ‌క్క‌టి మ‌గ్స్, ఫోన్ క‌వ‌ర్స్‌, కుష‌న్స్‌, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మ‌రెన్నో ఇక్క‌డ 25 శాతం డిస్కౌంట్‌తోనే ల‌భిస్తున్నాయి. POPXOFIRST అనే కూప‌న్ కోడ్‌ని ఉప‌యోగించండి. దీంతో మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.