సమంత రిటైర్‌మెంట్ పై ఫ్యాన్ ట్వీట్.. ఫన్నీ రిప్లై ఇచ్చిన హీరోయిన్..!

సమంత రిటైర్‌మెంట్ పై ఫ్యాన్ ట్వీట్.. ఫన్నీ రిప్లై ఇచ్చిన హీరోయిన్..!

సమంత నటించిన 'సూపర్ డీలక్స్' (Super Deluxe) చిత్రం ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. ఇందులో ఆమె చేసిన బోల్డ్ క్యారెక్టర్‌కి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ క్రమంలో "'సమంతా.. ఇక నువ్వు రిటైర్‌మెంట్ తీసుకుంటే బెటర్.


ఎందుకంటే సూపర్ డీలక్స్ చిత్రంతో నువ్వు లైఫ్ టైమ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేశావు" అని ఓ ఫ్యాన్ ట్వీట్ చేయడంతో అది ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఆ ట్వీట్‌కు సమంత (Samantha Ruth Prabhu) కూడా జవాబు ఇవ్వడం గమనార్హం.


"హహ.. మీ కామెంట్‌ను పొగడ్తగా తీసుకోవాలో లేదా ఇన్‌స‌ల్ట్‌గా తీసుకోవాలో అర్థం కావడం లేదు" అని ఆమె ట్వీట్ చేయడంతో ట్విటర్‌లో నవ్వులు విరబూశాయి. తమిళంలో ఇటీవలే విడుదలైన "సూపర్ డీలక్స్" చిత్రానికి మంచి ప్రశంసలు వస్తున్నాయి. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించాడు.
ఈ ట్వీట్ చేయగానే కొందరు అభిమానులు సమంతను "గాడెస్ ఆఫ్ యాక్టింగ్"గా సంబోధించారు. అలాగే ఒక అభిమాని అయితే.. ఆ కామెంట్‌ను రెండు వైపులా పదునున్న కత్తిగా పేర్కొన్నాడు. మరికొందరు సమంత జవాబును కాంప్లికేటెడ్ క్వశ్చన్‌గా పేర్కొన్నారు. ఇలా ట్విటర్‌లో రకరకాల స్పందనలు వచ్చాయి.


'సూపర్ డీలక్స్' చిత్రం చెన్నైలోనే తొలిరోజు రూ.43 లక్షలు వసూళ్లు చేసింది. తద్వారా నయనతార నటించిన "ఐరా" చిత్రానికి మంచి కాంపిటీషన్‌గా మారింది. అలాగే యూఎస్  మార్కెట్‌లో తొలిరోజే లక్ష డాలర్లకు పైగానే వసూళ్లు నమోదు చేసింది. తద్వారా పెట్టా, విశ్వాసం మొదలైన చిత్రాల సరసన నిలిచింది.'సూపర్ డీలక్స్' చిత్రంలో విజయ్ సేతుపతి హిజ్రా పాత్రలో నటించగా.. వెంబూ అనే పాత్రలో సమంత నటించింది. నటి రమ్యకృష్ణ ఈ చిత్రంలో ఓ వేశ్య పాత్రలో నటించింది. మలయాళ నటుడు ఫాజిల్ ఈ చిత్రంలో సమంతకు
జోడిగా నటించాడు.


ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వం వహించగా.. కినో వెస్ట్ డ్రీమ్ వర్క్స్ ఎంటర్‌‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పీఎస్ వినోద్, నీరవ్ షా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించారు.                                                        


ఇవి కూడా చదవండి


అత్తా కోడళ్లు ఇద్దరూ మ్యాచింగ్ మ్యాచింగ్ : సమంత ఇన్‌స్టాగ్రామ్ ఫోటో వైరల్


కెరీర్ బాటకు వివాహాలు ప్రతిబంధకాలు కావు: సమంత సినీ ప్రస్థానం


స్వచ్ఛమైన ప్రేమకు అందమైన నిర్వచనం.. చైతూ, సమంతల జంట..!