Advertisement

Celebrity Life

నాకు కాబోయే భర్త.. నాకన్నా తెలివైన వాడై ఉండాలి : కంగన రనౌత్

Babu KoiladaBabu Koilada  |  Dec 26, 2019
నాకు కాబోయే భర్త.. నాకన్నా తెలివైన వాడై ఉండాలి : కంగన రనౌత్

Advertisement

Actress Kangana Ranaut Opens up on her Wedding Plans

ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటి కంగన రనౌత్.. ఇటీవలే ఎట్టకేలకు వివాహానికి సంబంధించి తన మనసులోని మాటలను బయట పెట్టింది. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భావాలను పంచుకుంది. ప్రస్తుతం కంగన ‘పంగా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కబడ్డీ క్రీడాకారిణిగా నటిస్తున్న కంగన.. ఆ పాత్ర కోసం బాగానే శ్రమిస్తోంది. చిల్లర్ పార్టీ, దంగల్, చిచోరే లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన నితేష్ తివారీ సతీమణి అశ్వినీ అయ్యర్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.అంతకు ముందే అశ్వినీ “బరేలీ కీ బర్ఫీ” చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఆ సినిమా కోసం కంగన రనౌత్‌కి ఇచ్చే.. పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

కాగా.. ‘పంగా’  చిత్ర దర్శకురాలు అశ్వినీ అయ్యర్ పై కంగన ప్రశంసల కురిపించింది. ఆమె కోసమే తాను ‘పంగా’ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నానని..భార్యభర్తలుగా నితేష్, అశ్వినీల కెమిస్ట్రీకు తాను ఫిదా అయ్యానని.. వాళ్లను చూశాకే తనకు కూడా పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగిందని తన మనసులోని మాటను బయట పెట్టింది కంగన. కంగన గతంలో బాలీవుడ్ నటుడు హృతిక్‌తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఆ జంట విడిపోయింది. విడిపోయాక కూడా వారిద్దరూ పరస్పరం విమర్శలు చేసుకోవడం ఆ తర్వాత.. పెద్ద దుమారమే రేపింది. 

“నన్ను బ్యాన్ చేయండి” – జర్నలిస్టులని స్వయంగా కోరిన కంగనా రనౌత్

ఆ తర్వాత హృతిక్‌ వివాహం చేసుకోవడం.. అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత తన భార్యతో విడిపోవడం కూడా జరిగింది. అయితే కంగన వివాహం గురించి మాత్రం ఆ తర్వాత పెద్దగా వార్తలేవీ రాలేదు. కంగన కూడా తన చిత్రాలతో తాను బిజీ అయిపోయింది. ‘క్వీన్’ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న కంగన.. ఆ తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా తీసిన ‘మణికర్ణిక’ చిత్రంలోనూ నటించింది. అయితే ఆ చిత్ర దర్శకుడు క్రిష్.. కంగనతో విభేదాల కారణంగా ప్రాజెక్టు నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.

 

ప్రస్తుతం కంగన ‘పంగా’ చిత్రం కోసం చాలా శ్రమిస్తోంది. ఇదే క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన వివాహ ప్రసక్తిని తీసుకొచ్చింది. తనకు కాబోయే భర్త తనకంటే తెలివైన వాడూ, టాలెంట్ ఉన్నవాడు అయ్యుండాలని తను అభిప్రాయపడింది. అలాగే హిందీ చిత్ర పరిశ్రమలో కథానాయికలు ఒకప్పుడు 28, 29 ఏళ్లకే రిటైర్‌ అయ్యేవారని.. కానీ తాను అలా కాదని.. ఎవరి తలరాతనూ ఎవరూ డిసైడ్ చేయలేరని కూడా చెప్పింది కంగన. తనకు వయసు పెరిగినా.. ఇంకా ఛాలెంజింగ్‌గా నటించడానికి ప్రయత్నిస్తానని ఆమె తెలిపింది.

తన కెరీర్‌లో రెండు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న కంగన రనౌత్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగులో ప్రభాస్ సరసన ‘ఏక్ నిరంజన్’ చిత్రంలో కూడా నటించింది. అలాగే ప్రస్తుతం జయలలిత బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రంలో కూడా నటిస్తోంది కంగన. తమిళ, హిందీ, తెలుగు భాషలలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఇటీవలే కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రంలో కూడా నటించింది కంగన. 

జ‌య‌ల‌లిత క‌థ‌, నా క‌థ ఒక‌టే.. కానీ మా స్వ‌భావాలే వేరు..!

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.