ADVERTISEMENT
home / Celebrity gossip
స్నేహితురాలి పెళ్లిలో.. సమంత సందడి చూశారా?

స్నేహితురాలి పెళ్లిలో.. సమంత సందడి చూశారా?

సమంత (Samantha).. అందమంతా తనదే అన్నట్లుండే ఈ అందాల నాయిక చెన్నైలో పుట్టినా.. మన నాగచైతన్యను పెళ్లాడి తెలుగింటి అమ్మాయిగా మారిన సంగతి తెలిసిందే. ఇటు దగ్గుబాటి, అటు అక్కినేని కుటుంబాల వాళ్లతో కలిసిపోతూ కోడలిగా తన బాధ్యతలను ఎంతో చక్కగా నెరవేరుస్తుంది సమంత.

ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా.. పర్సనల్ లైఫ్ కోసం సమయాన్ని కేటాయించే సమంత వెంకీ కూతురు పెళ్లి (Wedding)లోనూ అంతా తానై హడావిడి చేస్తూ కనిపించింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను తాజాగా సమంత పోస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ సందడి చేస్తోందీ అందాల హీరోయిన్..

57343631 642439456202083 3944578726682035811 n

వెంకీ కుమార్తె పెళ్లిలో బ్యాండ్ బాజాకి బాగా డ్యాన్స్ చేస్తున్న సమంతను చైతూ వింతగా చూస్తున్న ఫొటోని పోస్ట్ చేస్తూ “నా సింపుల్ హజ్బెండ్ జీవితాంతం ప్రశాంతంగా ఉండాలనుకున్నాడు. కానీ దేవుడు మాత్రం అలా ఉండకుండా తనకి నన్ను జత చేశాడు” అని పోస్ట్ చేసింది.

ADVERTISEMENT

57009246 391985018312468 1945712387446375292 n

అంతేకాదు.. ఇదే పెళ్లిలో వెంకీతో కలిసి సమంత డ్యాన్స్ చేస్తున్న మరో ఫొటో కూడా నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

58408937 1824109987690197 7377101119334800631 n

ఈ ఫొటో కంటే ముందు వెంకీ కుటుంబంతో ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది సమంత.. దీనికి ఫుల్ ఫీల్స్ అంటూ క్యాప్షన్ పెట్టింది.

ADVERTISEMENT

58423793 1135149529979073 2015631981471175498 n

ఇద్దరు పెద్ద వయసున్న వ్యక్తులు పైన కూర్చుంటే.. వారి పక్కనే కింద కూర్చొని వారిని చూస్తూ మాట్లాడుతున్న ఫొటో పోస్ట్ చేసి “ఈ ఫొటో అంటే నాకెంతో ఇష్టం” అంటూ ఫోటోను తనకు అందించిన ఫొటోగ్రాఫర్కి ధన్యవాదాలు చెప్పింది. ఇలా వెంకీ కుమార్తె ఆశ్రిత పెళ్లి ఫొటోలతో సమంత సందడి అలా పూర్తయిందో లేదో.. వెంటనే తన స్నేహితురాలి పెళ్లికి సంబంధించిన ఫొటోలను పంచుకుందీ అందాల తార.

57511880 196355151335099 3470967343960315054 n

తన బెస్ట్ ఫ్రెండ్ లావణ్య పెళ్లిలో ఆమెతో కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది సమంత. చిన్నతనం నుంచి స్నేహితులైన ఈ ఇద్దరి మధ్య అంతా మారిపోయినా.. ఏమీ మారలేదని చెప్పుకొచ్చింది సమంత.

ADVERTISEMENT

58622833 440322393387892 8893005975404583157 n

స్నేహితురాలి పెళ్లిలో బ్రెయిడ్స్ మెయిడ్గా అందరితో పాటు.. తను కూడా నీలి రంగు మ్యాక్సీ డ్రస్ ధరించిన సమంత చక్కటి బన్‌తో తన లుక్‌కి నిండుదనం తీసుకొచ్చింది. ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటోలో తలపై పూల కిరీటం పెట్టుకుంటూ కనిపించింది సమంత. పక్కనే పెళ్లికూతురు కూడా ఉండడం విశేషం.

58409814 2028886120752061 5489589832312880022 n

పెళ్లి కూతురితో పాటు మిగిలిన బ్రెయిడ్స్ మెయిడ్స్ అయిన తన స్నేహితులు అనుష, శరణ్యలతో కలిసి దిగిన ఫొటోలను కూడా షేర్ చేసిందీ అందాల తార..

ADVERTISEMENT

57618529 484326258772402 3819340781751438576 n

ఓ ఫొటోలో తన స్నేహితురాలిని సిద్ధం చేస్తూ నవ్వుతూ కనిపించింది సమంత. స్నేహితురాలు పెళ్లి చేసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందంటూ ఈ బ్యూటీ ఫొటోను షేర్ చేసింది. తన మనసు చాలామంచిది అని చెబుతూ.. వారు తమ జీవితంలో మంచి స్నేహితురాళ్లని.. తమది మర్చిపోలేని  బంధం అని చెప్పుకొచ్చింది సమంత.

samantha-friend

సినిమాల విషయానికొస్తే ఇటీవలే మజిలీ సక్సెస్‌తో ఆనందంలో ఉన్న సమంత ప్రస్తుతం ఓ బేబీ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది . ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ దశలో ఉంది. దీంతో పాటు తమిళంలో విజయం సాధించిన 96 సినిమా తెలుగు రీమేక్‌లో శర్వానంద్ సరసన నటించనుంది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. 

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి.                 

మజిలీ సినిమాతో అబ్బాయిలందరికీ.. ఓ డ్రీమ్ వైఫ్ దొరికేసింది..!

ఈ పాత్రలను చూస్తుంటే.. ప్రపంచంలో మంచితనమంతా వీరిలోనే ఉన్నట్లుంటుంది..!

మ‌జిలీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చై-సామ్ ఆడిన ఈ గేమ్స్ చూశారా?

ADVERTISEMENT
25 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT