Advertisement

Bigg Boss

Bigg Boss Telugu 3: అలీ రెజా ఎలిమినేషన్‌తో పెద్ద షాక్ … ఇంటి సభ్యుల కంటతడి ..!

Sandeep ThatlaSandeep Thatla  |  Sep 8, 2019
Bigg Boss Telugu 3: అలీ రెజా ఎలిమినేషన్‌తో పెద్ద షాక్ … ఇంటి సభ్యుల కంటతడి ..!

Advertisement

అలీ రెజా (Ali Reza) – ఈ బిగ్ బాస్ (Bigg Boss Telugu)  సీజన్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ జెంటిల్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న వ్యక్తి. అలాగే టైటిల్ రేసులో ముందున్నాడని.. హౌస్ మేట్స్ సైతం భావించిన కంటెస్టెంట్. ఇప్పటివరకు ఏడు వారాల పాటు సాగిన నామినేషన్స్ ప్రక్రియలో.. తను తొలిసారిగా ఎలిమినేషన్ (elimination) జోన్‌లోకి రావడమే విచిత్రం. అయితే ఆ తొలి నామినేషన్‌లోనే తాను ఎలిమినేట్ కూడా అయిపోవడమనేది మరో షాక్.

అయితే అతను ఎలిమినేట్ అవుతూ, ఒక లాజిక్ చెప్పి వెళ్ళాడు. అదేంటంటే – ఈ సీజన్‌లో మొదటి సారి నామినేషన్స్‌‌లోకి వచ్చి ఎలిమినేట్ అయినవారిలో తనతో కలిపి నలుగురు ఉన్నారు అని. వారే – తమన్నా సింహాద్రి, అషు రెడ్డి, రోహిణి & అలీ రెజా. ఇది కాకతాళీయమో ఏమో కాని.. ఇలా జరగడం నిజంగా విచిత్రమే అని తను తెలిపాడు. 

Bigg Boss Telugu 3: డబుల్ ఎలిమినేషన్‌కి ప్లాన్ చేసిన బిగ్‌బాస్?

ఇక అలీ రెజా ఎలిమినేషన్ అనేది ఒకరకంగా అటు బిగ్ బాస్ ఇంటి సభ్యులకే కాకుండా.. ఇటు వీక్షకులకు సైతం ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని అనుకునే వారిలో అలీ ఒకరు. దానితో తను ఎలిమినేట్ అవుతారని ఎవరు ఊహించలేదు.

నాగార్జున ఎప్పుడైతే ఎలిమినేషన్‌లో ఉన్న ముగ్గురు సభ్యులలో ఎవరిపై లైట్ పడుతుందో.. వారు హౌస్ నుండి నిష్క్రమిస్తారని చెప్పడంతో అందరిలో ఉత్కంఠత నెలకొంది. అయితే అదే లైట్ అలీ రెజా పై పడడంతో అందరూ షాక్ తిన్నారు. చివరకి నాగార్జునే స్వయంగా అలీ రెజా ఎలిమినేట్ అయ్యాడని చెప్పే వరకూ ఎవరు నమ్మలేదు.

అలా ఊహించని విధంగా అలీ రెజా ఎలిమినేట్ అవ్వడంతో.. ఇంటి సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు.  ప్రతి ఒక్క ఇంటి సభ్యుడు కంటతడి పెట్టడం జరిగింది. ఇక ఎలిమినేట్ అయి స్టేజ్ పైకి వచ్చిన తరువాత, “నేను విన్నర్ సార్. ఎందుకంటే – నేను ఎవరైతే ఇంటి నుండి వెళ్ళిపోతే బాధపడరు అని అన్నానో.. వారు కూడా ఏడవడం చూశాను. అందరి మనసులు గెల్చుకున్నాను. కాబట్టి నేనే విన్నర్” అని చెప్పాడు.

Bigg Boss Telugu 3: ఇంటి నుండి వచ్చిన ఉత్తరాలు చదివి.. భావోద్వేగానికి గురైన హౌస్‌మేట్స్

ఇక అలీతో మాట్లాడే పరిస్థితి ఎవ్వరికి లేకపోవడంతో… ఒక ఫోన్ భూత్ ఏర్పాటు చేసి, ఒక్కొక్కరితో తను ఫోన్‌లో మాట్లాడే ఏర్పాటు చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఒకానొక సందర్భంలో బాబా భాస్కర్‌తో మాట్లాడుతూ.. అలీ రెజా తనని తాను తమాయించుకోలేక ఏడ్చేశాడు. అలాగే తనతో బిగ్‌బాస్ హౌస్‌లో బాగా సన్నిహితంగా ఉండే శివజ్యోతి, శ్రీముఖిలని ఓదార్చడమే కాకుండా.. రాహుల్ సిప్లిగంజ్ మొదలైన వారితో మనసు విప్పి మాట్లాడడం మనకి ఎపిసోడ్‌లో చూపించారు. ఆ విధంగా అలీ రెజా 50 రోజుల బిగ్ బాస్ ప్రస్థానం ముగిసింది.

ఇదిలావుండగా నిన్నటి ఎపిసోడ్‌తో “బిగ్ బాస్ సీజన్ 3”.. 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఇన్ని రోజుల ప్రయాణం గురించి ఒక వీడియో ప్లే చేయడం జరిగింది. అదే సమయంలో గత సీజన్ బిగ్ బాస్ హోస్ట్.. హీరో నాని నిన్నటి ఎపిసోడ్‌కి ముఖ్య అతిధిగా రావడం.. మరో కొసమెరుపు. ఆయన తను నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ ప్రచారం కోసం ఆ ఎపిసోడ్‌కి వచ్చారు. తన ఇంటి సభ్యులందరితోనూ సరదాగా గడిపారు. అలా నిన్నటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ పార్ట్ మినహా.. ఆద్యంతం సరదాగానే సాగింది.

మొత్తానికి “బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ ఏమైనా జరగవచ్చు” అనేదానికి సరిగ్గా సరిపోయే విధంగా.. నిన్నటి ఎలిమినేషన్ జరిగింది. ఏదేమైనప్పటికి నిన్నటి ఎలిమినేషన్ తరువాత “బిగ్ బాస్ హౌస్‌లో ఫెవరెట్ కంటెస్టెంట్స్ అంటూ ఎవరు ఉండరు. ప్రతిరోజు వారికి చాలా ముఖ్యం” అనే విషయం కచ్చితంగా అర్ధమవుతుంది. ఇక నిన్నటితో ఏడు వారాల సమయం అయిపోగా.. ఈ రోజుతో 8వ వారం మొదలుకానుంది.

ఆఖరుగా “బిగ్ బాస్ సీజన్ 3″లో దాదాపు సగం రోజులు గడిచిపోయాయి.. ఇక ఇప్పుడు ఆట రసకందాయంలో పడిందనే విషయం స్పష్టమవుతోంది. 

Bigg Boss Telugu 3: టాస్క్ సందర్భంగా.. ఇంటిసభ్యుల మధ్య గొడవలు ..!