Entertainment

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ టీజర్.. ఫ్యాన్స్ అంచనాలని అందుకుంటుందా?

Sandeep ThatlaSandeep Thatla  |  Dec 9, 2019
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ టీజర్.. ఫ్యాన్స్ అంచనాలని అందుకుంటుందా?

Allu Arjun’s “Ala Vaikuntapuram Lo” Teaser Glimpse Review

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతున్న విషయం అందరికి తెలిసిందే. గత ఆదివారం రోజున ఈ సినిమా టీజర్ విడుదల కావాల్సి ఉండగా… ఆరోజు మెగా ఫ్యామిలీ అభిమాని నూర్ మహమ్మద్ హఠాన్మరణంతో అది కాస్త వాయిదాపడింది.

‘అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిల’ ప్రేమకథ.. సినిమా కథని మరిపించేలా ఉంటుంది తెలుసా…!

ఈ ఊహించని పరిణామంతో అటు ఫ్యాన్స్.. ఇటు మెగా ఫ్యామిలీ కూడా ఒక విధమైన నిరుత్సాహానికి గురయ్యారనే చెప్పాలి. ఈ తరుణంలో నిన్న సాయంత్రం ‘అల వైకుంఠపురంలో’ టీజర్ గ్లిమ్ప్స్ ఒకటి విడుదలైంది. దీంతో టీజర్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా జోష్ వచ్చిందనే చెప్పాలి. 

ఇక నిన్న విడుదల చేసిన టీజర్  గ్లిమ్ప్స్‌లో అల్లు అర్జున్ ముఖాన్ని చూపెట్టకుండా.. ఆయన లిఫ్ట్‌లో ఆఫీస్‌కి వచ్చే సన్నివేశాన్ని మాత్రమే చూపెట్టడం జరిగింది. దీంతో ఈ టీజర్‌ ద్వారా జనాల  ఆసక్తిని ఇంకాస్త పెంచడంలో.. సినిమా యూనిట్ సఫలీకృతమైందనే చెప్పాలి.

ఇక రేపు విడుదలయ్యే టీజర్‌లో ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా ప్రకటించే వీలుంది. ఎందుకంటే ఈ ‘అల వైకుంఠపురంలో’ చిత్రం విడుదల కావడానికి.. రేపటితో సరిగ్గా ఒక నెల రోజులు మాత్రమే ఉండడంతో.. ట్రైలర్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తారనే టాక్ కూడా వినపడుతోంది. 

 

ఇక ఈ సినిమాకి సంబంధించి విడుదలైన రెండు పాటలు కూడా ప్రేక్షకుల మనసులను ఆకట్టుకున్నాయనే చెప్పాలి. ముందుగా విడుదలైన ‘సామజ వరగమనా’ అనే మెలోడీ సాంగ్ అందరినీ ఆకట్టుకోగా.. ఆ తరువాత వచ్చిన మాస్ బీట్ ‘రాములో రాములా’ అనే పాట ఇంకా పెద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇలా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచే స్థాయిలో ఈ పాటలు ఉండడంతో.. కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఇప్పటికే విశ్లేషకులు ఒక అంచనాకి వస్తున్నారు.

‘ప్రతి ప్రేమకథ కంచికి చేరదు’ అని తెలిపే.. ‘పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్‌’ల లవ్ స్టోరీ ..!

దీనితో పాటుగా ఇప్పటివరకు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ రెండు చిత్రాలు ఈ ఇద్దరి కెరీ‌ర్‌లకి కూడా బాగానే ఉపయోగపడ్డాయి. ఈ తరుణంలో అల్లు అర్జున్ & త్రివిక్రమ్‌ల కలయికలో వస్తున్న ఈ మూడవ చిత్రం హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందనే  నమ్మకమైతే అందరికీ ఉంది. మరి ఆ నమ్మకం నిజమై.. ఈ ఇద్దరి కలయిక ఒక మంచి హిట్ కలయికగా నిలిచిపోవాలని మనం కూడా కోరుకుందాం..

ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్‌లతో పాటుగా.. స్టార్ ఎట్రాక్షన్‌గా పలువురు తారలు ఉన్నారు. వారే – టబు, సుశాంత్, పూజా హెగ్డే, నివేతా పేతురాజ్. వీరు ఈ సినిమాకి కచ్చితంగా అదనపు ఆకర్షణే. మరి ఇన్ని ఆకర్షణలతో కూడిన ఈ చిత్రం 2020 సంక్రాంతికి విడుదలై.. ప్రేక్షకుల అంచనాని అందుకుంటుందా.. లేదా? అనేది ఇంకొక నెలరోజుల్లో తేలిపోనుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ‘అల వైకుంఠపురంలో’ చిత్రానికి అల్లు అరవింద్, ఎస్.రాధాక్రిష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా.. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. రాజేంద్రప్రసాద్, సముద్రఖని, సత్యరాజ్, వెన్నెల కిషోర్, నాజర్, రాహుల్ రామక్రిష్ణ, రావు రమేష్, బ్రహ్మాజీ, హర్ష వర్థన్, బ్రహ్మానందం, సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను జెమిని టివి కైవసం చేసుకోవడం విశేషం. 

‘న్యాచురల్ స్టార్ నాని – అంజన’ల.. న్యాచురల్ ప్రేమకథ మీకు తెలుసా!!