ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
అమ్మతనంలోని అనుభూతే వేరు.. నేను తల్లిని కాబోతున్నా: అమీ జాక్సన్

అమ్మతనంలోని అనుభూతే వేరు.. నేను తల్లిని కాబోతున్నా: అమీ జాక్సన్

అమీ జాక్స‌న్‌ (Amy jackson).. ఎవ‌డు చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై.. ఐ, రోబో 2.0 వంటి శంక‌ర్ భారీ చిత్రాల క‌థానాయిక‌గా పేరు తెచ్చుకున్న అందాల న‌టి. బ్రిట‌న్‌కి చెందిన ఈ తార కేవ‌లం ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లోనే కాదు.. బాలీవుడ్ చిత్రాల్లోనూ న‌టించి మంచి పేరు సంపాదించింది.

కొన్నాళ్ల క్రితం బ్రిట‌న్‌కి చెందిన వ్యాపారి జార్జ్ ప‌నాయొటోతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని.. ఆయ‌న‌తో లివ్ ఇన్ రిలేష‌న్‌షిప్ కొన‌సాగిస్తోంది అమీ. తాజాగా త‌ను త‌ల్లి కాబోతున్నాన‌న్న సంతోష‌క‌ర‌మైన విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా అంద‌రితోనూ పంచుకుందీ బ్యూటీ.

ఆదివారం నాడు (మార్చి 31) బ్రిట‌న్‌లో మాతృ దినోత్స‌వంగా జ‌రుపుకుంటారు. ఈ సంద‌ర్భంగా త‌ను త‌ల్లి కాబోతున్నాన‌న్న విష‌యాన్ని అమీ అంద‌రితోనూ పంచుకోవ‌డం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌లో గ‌ర్భం(బేబీ బంప్‌)తో ఉన్న ఫొటో పోస్ట్ చేస్తూ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. తాను త‌ల్లి కాబోతున్నాన‌న్న వార్త తెలిసిన‌ప్ప‌టి నుంచి ఈ వార్త‌ను అంద‌రితోనూ పంచుకోవ‌డానికి ఎంతో ఉత్సాహంగా వేచి చూస్తున్నా అని అమీ చెప్పడం విశేషం.

50028167 747963875576830 5208694744045180418 n

ADVERTISEMENT

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అమీ పంచుకున్న ఫోటోలో సాయంత్రం సూర్య‌కాంతిలో అమీ జాక్స‌న్‌, ఆమె బాయ్‌ఫ్రెండ్ జార్జ్ నిల‌బ‌డి ఉండ‌గా.. జార్జ్ అమీ త‌ల‌పై ముద్దు పెడుతున్నాడు.ఈ ఫొటోలో అమీ బేబీ బంప్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం విశేషం. దీన్ని పంచుకుంటూ ఈ వార్త‌ను అంద‌రితోనూ పంచుకోవ‌డానికి నేను ఎప్ప‌టినుంచో వేచి చూస్తున్నా. ఈ రోజు మాతృదినోత్స‌వం. ఇంత‌టి అద్భుత‌మైన వార్త‌ను పంచుకోవ‌డానికి ఇంత‌కంటే మంచి సంద‌ర్భం మ‌రొక‌టి ఉండ‌దేమో అనిపిస్తోంది అని చెప్పిన అమీ త‌న క‌డుపులోని బిడ్డ గురించి వెల్ల‌డిస్తూ..

ఈ ప్ర‌పంచంలో అన్నింటికంటే అంద‌రికంటే నిన్నే ఎక్కువ‌గా ప్రేమించడం ప్రారంభించాను. నీపై నా ప్రేమ ఎంతో స్వ‌చ్ఛ‌మైన‌ది. ఎందుకంటే నిన్ను ఎంతో నిజాయ‌తీగా ప్రేమిస్తున్నా. నిన్ను చూసేందుకు ఎంతగానో వేచి చూస్తున్నా.. అంటూ పోస్ట్‌చేసింది అమీ జాక్స‌న్‌. త‌న క‌డుపులోని బిడ్డ‌ను లిబ్ర‌న్‌గా ప‌రిచ‌యం చేసింది అమీ. అంటే త‌న డెలివ‌రీ సెప్టెంబ‌ర్ ఆఖ‌రిలో గానీ.. అక్టోబ‌ర్‌లో గాని ఉంటుంద‌ని భావించ‌వ‌చ్చు.

అమీ ఈ వార్త‌ను షేర్ చేయ‌గానే ప్ర‌ముఖులు.. ఆమె స్నేహితుల నుంచి శుభాకాంక్ష‌ల వెల్లువ ప్రారంభ‌మైపోయింది. న‌టి కృతీ స‌న‌న్ మొట్ట‌మొద‌ట‌గా అమీకి శుభాకాంక్ష‌లు చెబుతూ.. వావ్‌.. ఎంతో అద్భుతం. మీ ఇద్ద‌రికీ నా శుభాకాంక్ష‌లు. అమీ నిన్ను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అంటూ త‌న విషెస్ చెప్ప‌డం విశేషం. త‌న‌తో పాటు న‌టులు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ఎల్లీ అవ్ర‌మ్‌, సోఫీ చౌద‌రి, లిసా హేడెన్‌, ఆయుష్మాన్ ఖురానాల‌తో పాటు ప‌లు హాలీవుడ్ న‌టీన‌టులు కూడా అమీకి శుభాకాంక్ష‌లు వెల్ల‌డించ‌డం విశేషం.

గ‌తేడాదిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అమీ కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా తాను రిలేష‌న్‌షిప్‌లో ఉన్నాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అప్పుడు కూడా జాంబియాలో హాలిడే ఎంజాయ్ చేస్తున్న తామిద్ద‌రి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 1 జ‌న‌వ‌రి నా జీవితంలో కొత్త అడ్వెంజ‌ర్ ని ప్రారంభిస్తున్నా అని చెబుతూ.. ఐ ల‌వ్ యూ.. ప్ర‌పంచంలోనే ల‌క్కీయెస్ట్ అమ్మాయిగా న‌న్ను చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నా.. అంటూ ప్ర‌క‌టించింది అమీ.

ADVERTISEMENT

త‌ల్లిదండ్రులు కాబోతున్న అమీ, జార్జ్‌ల జంట‌కు మా శుభాకాంక్ష‌లు..

ఇవి కూడా చ‌ద‌వండి.

ప్రేమకు.. వయసు అడ్డంకి కాదు: మలైకా, అర్జున్ కపూర్‌ల పెళ్లి డేట్ ఫిక్స్..!

టాలెంట్ల పుట్ట జివా ధోనీ.. ఆరు భాష‌ల్లో ఎంత ముద్దుగా మాట్లాడుతోందో చూడండి..!

ADVERTISEMENT

గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్‌కి ప‌రిచ‌య‌మైన‌ప్పుడు.. ఈ అందాల రాశులు ఎలా ఉన్నారంటే..!

01 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT