ఈ రోజు (10 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులు ఇంకాస్త కష్టపడాలి. అలాగే ఈ రాశి వ్యక్తులకు విదేశీ ప్రయాణ యోగం కూడా ఉంది.
వృషభం (Tarus) – ఈ రోజు వ్యాపారస్తులు అపరిచితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే రుణాలు ఇచ్చే విషయం లేదా తీసుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది.
మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కాస్త మానసిక ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీ రాజకీయ ఖ్యాతి కూడా పెరుగుతుంది. వివాహితులకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.
కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కాస్త కోపాన్ని నియంత్రించుకోవాలి. అలాగే మీ భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో జాగరూకతతో వ్యవహరించండి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చట్టపరమైన వివాదాలలో మీకు ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు అనుకున్న పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
కన్య (Virgo) – ఈ రోజు మీరు కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడతారు. అలాగే తల్లిదండ్రులు లేదా అత్తమామల నుండి ఖరీదైన బహుమతులు పొందుతారు. కుటుంబం నుండి అనుకోని మద్దతు లభిస్తుంది. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.
సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?
తుల (Libra) – ఈ రోజు మీ తోబుట్టువులకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. అలాగే మీ భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చినా.. తర్వాత సర్దుకుపోతారు. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆఫీసులో సీనియర్ల నుండి మద్దతు ఉంటుంది. వాణిజ్య భాగస్వామ్యాల వల్ల లాభాలు చేకూరుతాయి.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు విద్యార్థులు చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. అలాగే నిరుద్యోగులు ప్రత్యమ్నామ రంగాల వైపు ఆసక్తి చూపిస్తారు. అలాగే ఆస్తి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీకోసం కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. అలాగే కొన్ని శుభకార్యాలలో కూడా పాలుపంచుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాలలో ఎంతో సహనంతో వ్యవహరించడం మంచిది. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.
మకరం (Capricorn) – ఈ రోజు మీరు అనుకోని చిక్కులలో పడతారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఉద్యోగస్తులు కొన్ని విషయాలలో ఓపికపట్టడం మంచిది. ఆర్థిక విషయాలలో.. మీకు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అలాగే సామాజిక గౌరవాన్ని పొందుతారు.
కుంభం (Aquarius) – ఈ రోజు మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు అంత ఆశాజకనకమైన ఫలితాలు సిద్ధించకపోవచ్చు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. రాజకీయ రంగంలోని వ్యక్తులకు కొత్త బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.
మీనం (Pisces) – ఈ రోజు మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉపాధ్యాయుల నుండి మద్దతు అందుతుంది. ఉద్యోగస్తులు పదోన్నతులు పొందుతారు. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.
ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.