ADVERTISEMENT
home / Astrology
22 నవంబరు 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

22 నవంబరు 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (22 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు అవివాహితులు పలు శుభవార్తలు వింటారు. అలాగే కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆలుమగల బంధాలు కూడా పటిష్టంగా మారతాయి. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. కొన్నిపనులను అందరి సమ్మతితో ప్రారంభించడం మంచిది. కొన్ని అవగాహన లేని ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేటప్పుడు.. నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు మీరు ప్రత్యమ్నాయ కెరీర్ లేదా రంగాల వైపు ఆసక్తి చూపించవచ్చు.  నిరుద్యోగులు అవగాహన లేకుండా… ప్రలోభపడి ఎవరికీ డబ్బు చెల్లించవద్దు.  దీని వల్ల ఆర్థిక నష్టం సంభవించడంతో పాటు.. సమయం కూడా వృధా అవుతుంది. అలాగే స్నేహితుల సహాయంతో  కొత్త ఆదాయ వనరులను సమకూర్చుకొనే దిశగా మీరు ప్రయత్నిస్తారు. అలాగే మీ మీద మీకు నమ్మకం అనేది పెరుగుతుంది. 

మిథున రాశి (Gemini) –   ఈ రోజు మీరు పలు శుభవార్తలు వింటారు. అలాగే కొత్త ఆస్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రత్యర్థులు కొన్ని విషయాలలో మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించినా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు.  వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కొన్ని విషయాలలో మీరు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం మంచిది. 

ADVERTISEMENT

కర్కాటక రాశి (Cancer) –  ఈ రోజు మీరు నిర్లక్ష్యం కారణంగా.. ఎన్నో మంచి అవకాశాలను కోల్పోతారు. నిరుద్యోగులు కూడా బద్ధకాన్ని వీడి.. కొంచెం శ్రమిస్తే అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించడం మేలు. అలాగే కొన్ని వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది.  తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి పలు శుభవార్తలు వింటారు. 

సింహ రాశి (Leo) –  ఈ రోజు మీరు కొన్ని అనుకోని వార్తలను వింటారు. మీ సన్నిహితులతో అపార్థాలు కూడా తొలిగిపోతాయి. అలాగే అక్కరకు రాని స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని విపత్కర పరిస్థితులలో సంయమనం పాటించండి. నిరుద్యోగులు ఇంకొంచెం కష్టపడితే.. ఊహించని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాగే ఈ రాశి వ్యక్తులకు ఈ రోజు సులభ ధన యోగం ఉంది. 

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే సంఘటనలు జరుగుతాయి. అలాగే కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు మీలో అసహనాన్ని కలిగించవచ్చు. ఆఫీసులో కూడా పని ఒత్తిడి ఉంటుంది. అయినా మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.  వ్యాపారస్తులకు భాగస్వామ్యం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. రాజకీయ రంగంలోని వ్యక్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

ADVERTISEMENT

తుల రాశి (Libra) – ఈ రోజు మీరు ఆస్తి సంబంధిత లావాదేవీలలో.. చురుగ్గా పాల్గొంటారు. అలాగే కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.  అదేవిధంగా పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. స్నేహితుల నుండి కూడా పలు శుభవార్తలు వింటారు. అలాగే అనుకోని బహుమతులు లభిస్తాయి. మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే సంఘటనలు కూడా జరుగుతాయి. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు అనుకోని వివాదాలు మిమ్మల్ని చుట్టు ముడతాయి.  ఇలాంటి సమయంలోనే మనో దైర్యాన్ని వీడకుండా ముందుకు వెళ్లాలి. అలాగే కుటుంబ సమస్యలను పరిష్కరించే విషయంలో.. నిదానంగా వ్యవహరించాలి. ముఖ్యంగా  కొన్ని విషయాలలో మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఏ మాత్రమూ శ్రేయస్కరం కాదు. 

ధను రాశి (Saggitarius) –  ఈ రోజు మీరు తీసుకొనే కొత్త నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తాయి. అలాగే సన్నిహితులతో ఒప్పందాలు చేసుకొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ఖర్చుల విషయంలో పొదుపు సూత్రం పాటించండి. అలాగే ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయి. మీకు సంబంధం లేని వివాదాలలో తలదూర్చకపోవడం శ్రేయస్కరం. అలాగే వాదోపవాదాలకు ఎట్టి పరిస్థితులలోనూ తావివ్వకపోవడం మంచిది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ADVERTISEMENT

మకర రాశి (Capricorn) –    ఈ రోజు మీరు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే కొత్త ఒప్పందాలను చేసుకొనేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆలుమగల సంబంధాలు కూడా పటిష్టంగా మారతాయి. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు కొంచెం కష్టపడితే.. తమకు నచ్చిన రంగాలలో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు శుభవార్తలు వింటారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా పురోగతి కనిపిస్తుంది. వ్యాపారస్తులు కొత్త ఆదాయ వనరులను సమకూర్చుకుంటారు. ఆలుమగలు తమ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా.. ఆ తర్వాత మళ్లీ సర్దుకుపోతారు.  వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకొనేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. కొన్ని విషయాలలో భాగస్వామి సలహాలు తీసుకోండి.   

మీన రాశి (Pisces) – ఈ రోజు మీరు ఒంటరితనాన్ని ఫీల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార లావాదేవీలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ చూపించండి.  కొన్ని అనుకోని సంఘటనలు మిమ్మల్ని గందరగోళానికి గురిచేయవచ్చు. ఇలాంటి సమయంలోనే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి.  మీ భాగస్వామితో కొన్ని విషయాలను దాపరికం లేకుండా చెప్పేయడం మేలు. 

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

21 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT