logo
Logo
User
home / Astrology
31 జనవరి 2020 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

31 జనవరి 2020 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (31 జనవరి, 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) –  ఈ రోజు వివాహితులు పలు శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు కూడా చేస్తారు. అలాగే ప్రేమికుల  బంధాలు కూడా పటిష్టమవుతాయి. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులు మరింత శ్రమించాల్సి ఉంది. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు ప్రేమికులకు శుభదినం. తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు క్రీడలు లేదా కళల పట్ల ఆసక్తి చూపిస్తారు. మహిళలు స్వయంఉపాధి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు ఆలుమగల మధ్య పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంది. అయినా సర్దుకుపోతారు. అలాగే కుటుంబ వివాదాలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకోవాలి. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే వ్యాపారస్తులకు పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి మంచి విషయాలను వింటారు.  విద్యార్థులు ఇంకా కష్టపడాలి. 

సింహ రాశి (Leo) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అపరిచితుల విషయంలో కాస్త అప్రమత్తతతో ఉండాలి. అయితే కొన్ని విషయాలలో సానుకూలంగా ఆలోచించడం మంచిది. వ్యాపారస్తులు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు ప్రత్యర్థుల సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. 

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కోర్టు కేసులు లేదా ఆస్తి వివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహితులు ముఖ్యమైన వేడుకలకు హాజరవుతారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ప్రేమికులు తొలుత అభిప్రాయ భేదాలు వచ్చినా.. ఆ తర్వాత సర్దుకుపోతారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

తుల రాశి (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ జీవితానికి సంబంధించి కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే పాత మిత్రులను కలుస్తారు. అదేవిధంగా అక్కరకు రాని స్నేహాలను దూరం పెట్టడం మంచిది. ప్రేమికులు కొన్ని విషయాలలో ఒకరితో ఒకరు నిజాయతీగా వ్యవహరించడం మంచిది. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు ప్రేమికుల బంధాలు మరింత పటిష్టమవుతాయి. వారు తమ జీవితానికి సంబంధించి ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అలాగే వివాహితులు దూర ప్రాంతాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. 

ధను రాశి (Saggitarius) – ఈ రోజు మీరు ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే తమ జీవితానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి. సినీ రంగంలో ప్రయత్నాలు చేసే వ్యక్తులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

మకర రాశి (Capricorn) –  ఈ రోజు నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ఉద్యోగస్తుల కెరీర్‌కు  సంబంధించి మార్పులు, చేర్పులు ఉంటాయి. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. వివాహితులు పలు శుభవార్తలు వింటారు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎంత కష్టపడినా.. ఫలితం దక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కనుక మరింత శ్రమించాలి. విద్యార్థులు ఎన్ని అపజయాలు ఎదురైనా.. ఆత్మవిశ్వాసాన్ని వీడరాదు. కొన్ని విషయాలలో తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. 

మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. విద్యార్థులు కెరీర్ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. 

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి… అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి

31 Jan 2020

Read More

read more articles like this

Read More

read more articles like this
good points logo

good points text