ADVERTISEMENT
home / Celebrity gossip
అప్పుడు డిప్రెషన్ నుండి ఎలా బయటపడ్డానో.. నాకే తెలియదు : దీపిక పదుకొణే

అప్పుడు డిప్రెషన్ నుండి ఎలా బయటపడ్డానో.. నాకే తెలియదు : దీపిక పదుకొణే

I Take Care Of Myself Without Any Guilt: Deepika Padukone On Her Battle With Depression

‘ఓం శాంతి ఓం’ చిత్రంతో బాలీవుడ్‌ తెరకు పరిచయమై.. అనతికాలంలోనే స్టార్ హోదా కైవసం చేసుకున్న నటి దీపికా పదుకొణే. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన ప్రకాష్ పదుకొణే కుమార్తె అయిన దీపిక.. లవ్ ఆజ్‌కల్, హౌస్‌ఫుల్, రేస్ 2, చెన్నై ఎక్స్‌ప్రెస్, రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ లాంటి సినిమాలతో తనకంటూ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్టైల్‌ను క్రియేట్ చేసుకుంది. గత సంవత్సరం తన చిరకాల మిత్రుడు, ప్రేమికుడు రణ్‌వీర్ సింగ్‌ను వివాహం కూడా చేసుకుంది. అయితే తాను ఎంత సక్సెస్‌ఫుల్ కెరీర్‌లో దూసుకుపోయినా సరే.. ఒకానొక సందర్భంలో పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని అంటోంది ఈ బాలీవుడ్ భామ.

అందుకే పెళ్లి చేసుకున్నాకే కలిసి ఉండాలనుకున్నాం.. : దీపికా పదుకొణె

“2014లో నాకు తెలియకుండానే నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ డిప్రెషన్ వల్ల పని చేసి ఇంటికి వచ్చాక.. నాకు తెలియకుండానే స్పృహ కోల్పోయేదాన్ని. ప్రతీ రోజు ఉదయమే ఏడుస్తూ నిద్ర లేచేదాన్ని. ఎప్పుడూ ముభావంగా ఉండేదాన్ని. ఎవరితోనూ మాట్లాడకుండా.. ఒంటరిగా ఉండాలని అనిపించేది. అలాంటి సమయంలో నన్ను చూడడానికి ముంబయి వచ్చిన నా తల్లిదండ్రులు నాకు ఓ భరోసాను ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ నేను వాళ్ల ముందు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించేదాన్ని”

ADVERTISEMENT

“కానీ వాళ్లు తిరిగి ముంబయి నుండి వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్న రోజు మాత్రం.. చాలా ఏడుపొచ్చేసింది. ఈ సారి వారికి ఏడుస్తూనే దొరికిపోయాను. వారు చాలా కంగారుపడి పోయారు. అప్పుడు అమ్మ నన్ను సముదాయించడానికి చాలా ప్రయత్నించింది. ఎవరితోనైనా ఇబ్బంది ఉంటే.. చెప్పమని బుజ్జగించి అడిగింది. నేను ఆ సమయంలో కచ్చితంగా ఓ సైకాలజిస్ట్‌ని కలవాలని తెలిపింది. నేను ఆమె చెప్పిన మాట విన్నాను. ఆ తర్వాత కొన్ని రోజులు యథావిధిగానే గడిచాయి. కానీ రణ్‌వీర్ నా జీవితంలోకి వచ్చాక.. ఎందుకో నా భయాలన్నీ తొలిగిపోయాయి”

దీపిక, సోనమ్.. వెడ్డింగ్ స్టయిల్ లో ఎవరు మేటి?

 

 

ADVERTISEMENT

“రణ్‌వీర్‌తో డేటింగ్ చేసిన రోజులను నెమరువేసుకుంటుంటే.. ఎన్నో గుర్తుకొస్తుంటాయి. నేను ఒత్తిడికి గురైనప్పుడు.. తను అందించిన తోడ్పాటును నేను ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత అతన్నే పెళ్లి చేసుకున్నాను. అది ఒక రకంగా నా జీవితాన్ని మార్చిన సంఘటన” అని తన అనుభవాలను తన బ్లాగులో పంచుకుంది దీపిక. తాను ఒకప్పుడు డిప్రెషన్‌తో చెప్పుకోలేని వేదనను అనుభవించాల్సి వచ్చిందని.. ఆ బాధ తనకు తెలుసని.. అందుకే మానసిక ఒత్తిడితో బాధపడే వారి కోసం తాను ఫౌండేషన్ ప్రారంభించి.. తన వంతు సహాయం చేస్తున్నానని తెలిపింది దీపిక.

బాలీవుడ్‌లో దీపికా రణ్‌వీర్.. మరి టాలీవుడ్‌లో..?

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. మన దేశంలో దాదాపు 57 మిలియన్ల మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. అందులో 85 శాతం వ్యక్తులకు అందాల్సిన సహాయం అందడం లేదని మరో రిపోర్టు చెబుతోంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు మాత్రమే.. ఇలా డిప్రెషన్‌తో బాధపడుతున్న వారికి ఉచితంగా కౌన్సెలింగ్‌ను అందిస్తున్నాయి. పాజిటివ్ ఆలోచనలను పెంచుకోవడం.. ఎన్ని సమస్యలు ఉన్నా ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లడం.. అలాగే మన చుట్టూ మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల.. డిప్రెషన్ నుండి బయటపడవచ్చని పలువురు నిపుణులు తెలపడం గమనార్హం. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.                                                                               

 

06 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT