ADVERTISEMENT
home / Bollywood
దీపిక అంద‌మైన‌ మైన‌పుబొమ్మ‌ను చూసి.. ర‌ణ్‌వీర్ ఏమ‌న్నాడో తెలుసా?

దీపిక అంద‌మైన‌ మైన‌పుబొమ్మ‌ను చూసి.. ర‌ణ్‌వీర్ ఏమ‌న్నాడో తెలుసా?

బాలీవుడ్ అందాల భామ‌ దీపికా పదుకొణె(Deepika padukone) లండ‌న్‌లోని మేడ‌మ్ టుస్సాడ్స్(Madame tussauds) మ్యూజియంలో త‌న మైన‌పు బొమ్మ‌ను ఆవిష్క‌రించింది. ఈ మ్యూజియంలో ఆమె బొమ్మ‌ను ఆవిష్క‌రించిన త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన అతికొద్దిమంది బాలీవుడ్ ప్ర‌ముఖుల‌లో ఒక‌రిగా మారిందీ బ్యూటీ.. ఈ కార్య‌క్ర‌మానికి దీపిక‌తో పాటు ర‌ణ్‌వీర్, వీరిద్ద‌రి త‌ల్లిదండ్రులు కూడా హాజ‌ర‌య్యారు. ఈ మైన‌పు బొమ్మ‌ను దీపిక 2018లో కేన్స్ వేడుక‌ల‌కు ధ‌రించిన‌ స‌బ్యసాచి కేప్ డ్ర‌స్‌లో సిద్ధం చేశారు.

52717603 260727294839276 6968852284971570756 n

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న దీపిక చాలా ఎక్స‌యిటింగ్‌గా, ఆనందంగా క‌నిపించింది. ఫొటోల‌తో పాటు సెల్ఫీలు, వీడియోలు కూడా తీసుకోవ‌డం విశేషం. దీపిక‌పై ప‌ట్టలేనంత ప్రేమ క‌న‌బ‌రిచే భ‌ర్త ర‌ణ్‌వీర్ సింగ్ అయితే ఈ మైన‌పు శిల్పాన్ని రెప్పవాల్చ‌కుండా చూస్తూ ఉండిపోయాడు. ఆ త‌ర్వాత త‌న మైన‌పు బొమ్మ గురించి మీడియాతో మాట్లాడి.. త‌న ఆనందాన్ని పంచుకుంది దీపిక‌. నా చిన్న‌త‌నం నుంచి నేను ఏది చేసినా.. దీని ఉద్దేశం ఏంటి? దీనివ‌ల్ల నాకు, స‌మాజానికి ఏం ప్రయోజ‌నం ఉంటుంది? అని ఆలోచించేదాన్ని.

నేనో వ్య‌క్తిగా చాలా క‌ష్ట‌ప‌డి ఈ స్థాయి వ‌ర‌కూ చేరుకున్నా. ఈ స్థాయిలో నిలిచినందుకు నేనెంతో అదృష్ట‌వంతురాలిన‌నే భావిస్తున్నా. నా సినిమాల ద్వారా అంద‌రికీ ద‌గ్గ‌రై.. వారి జీవితాల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం నాకు ద‌క్కింది. ఈ అద్భుత‌మైన అవ‌కాశం నాకు వ‌చ్చిన‌ప్పుడు కూడా నేను ఏం చేస్తున్నాను.. దీని వ‌ల్ల ప్ర‌యోజ‌న‌మేంటి? అని ఆలోచించాను.

ADVERTISEMENT

అప్పుడు నా మ‌న‌సు నాకు చెప్పింది ఇది స్టాచ్యూ ఆఫ్ ప‌ర్ప‌స్‌గా నిలుస్తుంద‌ని.. నా శిల్పాన్ని ఎవ‌రైనా చూసేందుకు వ‌చ్చిన‌ప్పుడు జీవితంలో క‌ష్ట‌ప‌డి స‌మాజంపై ప్ర‌భావం చూపేందుకు ప్ర‌య‌త్నిస్తే ఇలాంటి గౌర‌వం ద‌క్కుతుంద‌ని వారికి అర్థ‌మ‌వుతుంది. అలా న‌న్ను చూసి కొంద‌రు స్ఫూర్తి పొందినా అది నాకెంతో ఆనందాన్ని క‌లిగిస్తుంది. అందుకే ఈ మైన‌పు శిల్పం ఏర్పాటుకు ఒప్పుకున్నాను.. అంటూ వివ‌రించింది దీపిక‌.

53300160 555458698197273 3983722923461505573 n 734891

అంతేకాదు.. మైన‌పు శిల్పాన్ని ఆవిష్క‌రించిన త‌ర్వాత దీపిక‌ మాట్లాడుతూ- ఇంత‌కుముందు నేను చాలా చిన్న‌గా ఉన్న‌ప్పుడు కుటుంబంతో పాటు ఇక్క‌డికి వ‌చ్చాను. ఇప్పుడు మ‌రోసారి కుటుంబంతో పాటు ఇక్క‌డికి వ‌చ్చాను. ఇందాక మేమంతా క‌లిసి భోజ‌నం చేస్తున్న‌ప్పుడు అమ్మ చెప్పింది. చిన్న‌ప్పుడు నన్ను తీసుకొని అమ్మ ఇక్క‌డికి వ‌చ్చిన‌ప్పుడు ఏదో ఒక‌ రోజు త‌న‌ కూతురి బొమ్మ కూడా ఇందులో పెడ‌తార‌ని ఎప్పుడూ ఊహించలేద‌ని! చిన్న‌త‌నంలో నేను చూసిన మ్యూజియంలోనే స్థానం సంపాదించ‌డం నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తోంది అని వివ‌రించింది.

దీపిక మైన‌పు బొమ్మ సౌంద‌ర్యాన్ని చూసి ముగ్ధుడైన ర‌ణ్‌వీర్ దాన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చా? అని అడ‌గ‌డం దీపిక‌తో స‌హా అక్క‌డున్న వారంద‌రినీ న‌వ్వించింది. దీనికి దీపిక ఇప్పుడు నువ్వు 83 సినిమా షూటింగ్‌లో ఇక్క‌డే ఉంటావుగా.. న‌న్ను మిస్స‌యిన‌ట్లు అనిపిస్తే ఇక్క‌డికొచ్చి చూడు.. అంటూ స‌మాధాన‌మిచ్చింది. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ADVERTISEMENT

ర‌ణ్‌వీర్‌తో పాటు దీపిక బొమ్మ‌పై త‌న చెల్లెలు అనీషా కామెంట్లు కూడా అంద‌రినీ న‌వ్విస్తున్నాయి. దీపిక మైన‌పు బొమ్మ‌ను ఆవిష్క‌రించిన ఫోటోను పోస్ట్ చేస్తూ ఒక్క దీపిక ఉంటే స‌రిపోలేద‌ని.. ఇప్పుడు మ‌రో దీపిక‌నా? అంటూ పోస్ట్ చేసింది అనీషా. ఇది చూసి సెల‌బ్రిటీలే అయినా వీరిద్ద‌రు కూడా మ‌న‌లాంటి అక్కాచెల్లెళ్లు.. ఒక‌రితో ఒక‌రు చిలిపి త‌గాదాలు ఆడుకోవ‌డం వారికీ అల‌వాటేన‌ని అర్థ‌మ‌వుతోంది.

ఈ మ్యూజియంలో దీపిక కంటే ముందే చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు స్థానం సంపాదించుకున్నారు. గ‌తేడాది బాలీవుడ్ బ్యూటీ అనుష్క‌ ప్ర‌త్యేకంగా ఇంట‌రాక్టివ్ స్టాచ్యూని ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ స్టాచ్యూ చేతిలో ఉన్న ఫోన్ ద్వారా మ‌నం సెల్ఫీలు తీసుకునే వీలుంటుంది. త‌న‌తో పాటు ఐశ్వ‌ర్యారాయ్‌, క‌రీనా క‌పూర్‌, క‌త్రినా కైఫ్‌, మాధురీ దీక్షిత్‌, హృతిక్‌, స‌ల్మాన్‌, అమితాబ్‌ల‌తో పాటు మ‌న డార్లింగ్ ప్ర‌భాస్ విగ్ర‌హాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి.

బ్లాండ్ జుట్టుతో అనుష్క.. ఎలా ఉంటుందో మీకు తెలుసా?

ADVERTISEMENT

అతిలోక సుంద‌రి శ్రీదేవి.. అరుదైన చిత్రాల‌ను మీరూ చూస్తారా?

ఆరాధ్య ముద్దులొలికే ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

Images : https://www.instagram.com/madametussauds/

https://www.instagram.com/deepikapadukone/

ADVERTISEMENT
15 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT