Advertisement

Bigg Boss

Bigg Boss Telugu 3: డబుల్ ఎలిమినేషన్‌కి ప్లాన్ చేసిన బిగ్‌బాస్?

Sandeep ThatlaSandeep Thatla  |  Sep 1, 2019
Bigg Boss Telugu 3: డబుల్ ఎలిమినేషన్‌కి ప్లాన్ చేసిన బిగ్‌బాస్?

Advertisement

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో భాగంగా ఆరవ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఈ క్రమంలో బిగ్ బాస్ ఇచ్చిన స్వీట్ షాక్ అందరిని సంతోష పరిచింది. అదెలాగంటే – నామినేషన్స్‌లో ఉన్న ముగ్గురు సభ్యులలో ఏ ఒక్కరిని కూడా ఎలిమినేట్ చేయకుండా ‘నో ఎలిమినేషన్ వీక్’గా ప్రకటించడంతో.. అందరి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అసలు ఆరవ వారంలో మహేష్ విట్టా లేదా హిమజలో ఎవరో ఒకరు ఇంటి నుండి నిష్క్రమిస్తారు అని అనుకుంటుండగా… బిగ్ బాస్ మాత్రం ఈ వారాన్ని “నో ఎలిమినేషన్ వీక్”గా ప్రకటించడం విశేషం. దీనితో ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న ముగ్గురు సభ్యులు – మహేష్ విట్టా, హిమజ, పునర్నవిలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలావుండగా.. నిన్నటి ఎపిసోడ్ మొత్తం ఫన్నీగా గడిచిపోయింది. రమ్యకృష్ణ నిన్నటి షోలో ‘సీన్ చేయండి’ అనే టాస్క్‌తో మొదలుపెట్టి.. చివరికి తానే ఏకంగా హౌస్‌లోకి ప్రవేశించి  అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ‘సీన్ చేయండి’ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులని టీమ్స్‌గా విభజించారు. ఆ తర్వాత.. వారి చేత సినిమాల్లో బాగా పాపులరైన సన్నివేశాలలో నటించమని తెలిపారు.

ఈ సందర్భంగా అలీ రెజా, రవికృష్ణలు ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ నుండి ‘పూలకుండీ’ సన్నివేశం చేయగా ..వారి తరువాత బాబా భాస్కర్, శ్రీముఖిలు కలిసి చేసిన చంద్రముఖి సీన్ అందరిని బాగా ఆకట్టుకుంది. అలాగే శివజ్యోతి, మహేష్, హిమజలు రంగస్థలం చిత్రంలో సన్నివేశం నటించగా… వరుణ్ సందేశ్, వితికాలు F2 చిత్రంలోని సన్నివేశంలో నటించారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3″ షో వ్యాఖ్యాతగా రమ్యకృష్ణ

వీటన్నిటిలో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవిలు కలిసి చేసిన ‘ఖుషి’ చిత్రంలో ‘నడుము’ సన్నివేశం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సన్నివేశంలో పునర్నవి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అందరిని భలేగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ ‘సీన్ చేయండి’ టాస్క్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిందనే తెలపాలి.

ఈ టాస్క్ తరువాత హూస్‌లోకి బిగ్ బాస్ బ్లాక్ రోజెస్ పంపించారు.  నామినేషన్స్‌లో ఉన్న ముగ్గురిలో ఎవరు ఇంటి నుండి వెళ్ళాలని భావిస్తున్నారో వారికి బ్లాక్ రోజ్ ఇవ్వాలి అని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చెప్పగా… ఎక్కువ రోజెస్ మహేష్ విట్టాకి దక్కడం గమనార్హం. అలాగే హిమజ, పునర్నవిలకి కూడా  రెండు బ్లాక్ రోజెస్ రావడం జరిగింది.

అయితే చివరికి ఎలిమినేషన్ లేకపోవడంతో అందరూ సేఫ్ అయిపోయారు. ఇదే విషయాన్ని రమ్యకృష్ణ స్వయంగా హౌస్‌లోకి వచ్చి.. ఇంటి సభ్యులతో కాస్త సమయం గడిపాక చెప్పడం జరిగింది. అలాగే వారితో కలిసి డ్యాన్స్ చేయడం & బాహుబలి చిత్రం నుండి ఒక డైలాగ్ కూడా చెప్పడం జరిగింది.

ఇక ఈ వారం ఎలిమినేషన్ లేకపోవడంతో.. వచ్చే ఆదివారం రోజు డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అనే ప్రచారం జరుగుతుంది. గత సీజన్స్‌లో కూడా ఒకే వారం డబుల్ నామినేషన్స్ వేయడం జరిగింది. అందుకోసమే ఏడవ వారంలో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు అనే వాదనలు వినిపిస్తున్నది.

బిగ్‌బాస్ తెలుగు 3 : టాలెంట్ షోలో చిందేసిన హౌస్ మేట్స్

మరి ఇందులో నిజం ఎంత ఉంది? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. వచ్చే ఆదివారం ఎలిమినేషన్స్ సంబంధించి బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు జరగబోతుంది. అది ఎలా ఉండబోతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియ (Double Elimination) ఉంటే, కచ్చితంగా  హౌస్‌లో ఉన్న బలమైన కంటెస్టెంట్స్‌లో ఒకరు నిష్క్రమిస్తారు అన్నది సత్యం.

ఇక ఈరోజుకి సంబంధించి ఎపిసోడ్ ప్రోమోలో కన్ఫెషన్ రూమ్‌కి అలీ రెజా, రవికృష్ణలని పిలవడం వారికి ఏదో చూపిస్తుండడం కనిపించింది. మరి అది నామినేషన్స్‌కి సంబందించిన అంశమా లేక మరేదైనా అనేది ఈరోజు ఎపిసోడ్ పూర్తయితే తప్ప తెలియదు. మొత్తానికైతే ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ పై ఆసక్తిని పెంచగలిగారు బిగ్ బాస్.

Bigg Boss Telugu 3: మహేష్ విట్టా & హిమజ.. వీరిలో హౌస్ నుండి వెళ్ళేది ఎవరు?