బిగ్‌బాస్ తెలుగు 3 : టాలెంట్ షోలో చిందేసిన హౌస్ మేట్స్

బిగ్‌బాస్ తెలుగు 3 : టాలెంట్ షోలో చిందేసిన హౌస్ మేట్స్

"బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3"లో (Bigg Boss Telugu Season 3) నిన్నటి ఎపిసోడ్ ఆద్యంతం హుషారుగా సాగిపోయింది. అదెలాగంటే - "యాపి ఫీజ్ టాలెంట్ షో" పేరిట.. నిన్న కంటస్టంట్స్‌కు బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు తమ టాలెంట్‌ని ప్రదర్శించి.. అటు హౌస్ మేట్స్‌ని.. ఇటు వీక్షకులని ఎంటర్‌టైన్ చేశారు.

బిగ్‌బాస్ తెలుగు యాంకర్ నాగార్జున చేతిలో ఉన్న.. పండు (కోతి) బొమ్మ మీకు కావాలా?

అలాగే ఈ టాలెంట్ షోకి న్యాయమూర్తులుగా బాబా భాస్కర్, శ్రీముఖిలని ఎంపిక చేశారు. వారు ఇంటి సభ్యుల ప్రదర్శనను చూసి.. అందులో నలుగురు సభ్యులని నెక్స్ట్ రౌండ్‌కి ఎంపిక చేయవలసిందిగా బిగ్ బాస్ సూచించారు. ఇక టాలెంట్ షోలో తొలి ప్రదర్శనను పునర్నవి ఇవ్వగా.. చివరి ప్రదర్శనను వరుణ్ సందేశ్ ఇవ్వడం జరిగింది. 

 

 

ఈ టాలెంట్ షోలో తొలుత అల్లు అర్జున్ చిత్రం 'నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా'లోని 'ఇరగ ఇరగ' అనే పాటకి డ్యాన్స్ వేసి అందరికి ఝలక్ ఇచ్చింది పునర్నవి. ఆమె తరువాత ఆషు రెడ్డి కూడా తన డ్యాన్స్‌తో అందరిని అలరించడమే కాకుండా.. జడ్జిలను కూడా ఇంప్రెస్ చేసింది. వీరి తరువాత 'అవయవ దానం' పైన అవగాహన కల్పిస్తూ వితిక చేసిన యాక్ట్ కూడా చాలా బాగుంది. ఆమె తన యాక్ట్ ద్వారా అందరికి మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ తరువాత గురు చిత్రంలోని 'ఓ సక్కనోడా' పాటని పాడి.. హిమజ తనలోని సింగింగ్ టాలెంట్‌ని చూపెట్టింది.

అయితే.. ఈ టాలెంట్ షోలో శివజ్యోతి చేసిన 'అగ్గిపెట్టెలో చీర' కాన్సెప్ట్ అందరినీ కొంతవరకు కన్ఫ్యూజ్ చేసిందనే చెప్పాలి. సమాజంలో లాజిక్స్ కన్నా.. మ్యాజిక్స్‌నే జనాలు ఎక్కువగా నమ్ముతున్నారు అని చెబుతూ.. అటువంటి వాటికి దూరంగా ఉండాలని ఆమె ఒక మెసేజ్ ఇచ్చింది.

ఆ తరువాత రాహుల్ సిప్లిగంజ్ ఒక మంచి పాటతో.. తన టాలెంట్‌ని చూపెట్టడానికి వచ్చి మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోవడంతో జడ్జిలు ఆశ్చర్యపోయారు. ఇంటి సభ్యులు కూడా షాక్‌కి గురయ్యారు. ఈ క్రమంలో.. జడ్జిలు తనకు మళ్ళీ ఛాన్స్ ఇస్తూ.. షో చివరలో పాడమని తెలిపారు. ఆమె కూడా దీనికి ఒప్పుకుని.. కొద్దిసేపటి తరువాత పాడడం జరిగింది. అతను కూడా జడ్జిలను ఇంప్రెస్ చేసిన వారిలో ఉన్నారు.

ఇక ఈ టాలెంట్ షోలో కాస్త వైవిధ్యంగా చేసింది మహేష్ విట్టా. తాను ఈ  హౌస్‌లోకి వచ్చినప్పటి నుండి ఎదుర్కొన్న  ముఖ్య సంఘటనలను గురించి చెబుతూ.. వాటి వల్ల తను ఎలాంటి భావోద్వేగాలకు గురయ్యాడన్నది కూడా తెలిపాడు బిగ్ బాస్.  

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 : అలీ రెజా మోసం చేశాడని.. కంటితడి పెట్టిన బాబా భాస్కర్ ..!

ఇక ఆఖరిలో రవికృష్ణ & అలీ రెజా వేసిన బోల్డ్ డ్యాన్సులు.. ఇంటి సభ్యులతో పాటుగా షో చూస్తున్న వీక్షకులని కూడా కట్టిపడేశాయి అని చెప్పాలి. ఎందుకంటే వీరిరువురు డ్యాన్సుల ద్వారా తమ టాలెంట్‌ని చూపించడం జరిగింది. వీరిద్దరి తరువాత వరుణ్ సందేశ్ ర్యాప్ స్టైల్‌లో పాట పాడి అందరిని ఆకట్టుకున్నాడు.

దీనితో మొత్తం ఇంటి సభ్యులలో అలీ రెజా, ఆషు రెడ్డి, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్ & రవిక్రిష్ణలు న్యాయమూర్తులను ఇంప్రెస్ చేయగలిగారు. మరి ఈ అయిదుగురిలో.. తరువాత లెవెల్‌కి వెళ్లే నలుగురు ఎవరనేది ఈరోజు ఎపిసోడ్‌‌లో తెలుస్తుంది.

మరొక విషయం ఏమిటంటే.. ఈరోజు ఎపిసోడ్‌లో బాబా భాస్కర్, శ్రీముఖి కలిసి ఒక డ్యూయెట్ పెర్ఫార్మ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రోమో విడుదల కాగా... గత రెండు రోజులుగా మహేష్ విట్టా & అలీ రెజాల మధ్య సాగుతున్న వాగ్వాదం కూడా.. ఈరోజు ఎపిసోడ్‌లో కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

చూద్దాం.. ఈరోజు ఎపిసోడ్‌లో ఇంకెన్ని చిత్రాలు కనిపిస్తాయో!

బిగ్‌బాస్ తెలుగు: రాహుల్ తప్ప.. అందరూ ఆమె అన్నదమ్ములేనట..!

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.