ADVERTISEMENT
home / Life
ఈ వ‌ధువు త‌నకు కాబోయే భ‌ర్త‌కు మేక‌ప్ చేసింది.. ఎందుకంటే?

ఈ వ‌ధువు త‌నకు కాబోయే భ‌ర్త‌కు మేక‌ప్ చేసింది.. ఎందుకంటే?

ఒకప్పుడు పెళ్లి (wedding) వేడుకల్లో పీట‌లపై కూర్చునే వ‌ర‌కూ వ‌ధూవ‌రులు ఒక‌రినొక‌రు చూసుకునే వారు కాద‌ట‌. పెళ్లికి పెద్ద‌గా హ‌డావిడి కూడా ఉండేది కాదు. ఆ త‌ర్వాత ప‌రిస్థితులు మారిపోయాయి. ఇప్పుడైతే పెళ్లిని జీవితాంతం గుర్తుంచుకునే పండ‌గ‌లా చేసుకుంటున్నారు. వీలైనంత ఎక్కువ అనుభ‌వాలు మూట‌గ‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇందులో భాగ‌మే వెడ్డింగ్ వీడియోలు, ప్రీవెడ్డింగ్ షూట్స్ వంటివ‌న్నీ. అయితే వీట‌న్నింటినీ దాటుకొని వెళ్లి.. పెళ్లిని మ‌రింత ప్ర‌త్యేకంగా మార్చుకునేవారు కూడా చాలామందే ఉంటారు.

ఇందులో భాగంగానే కొంద‌రు డ్యాన్స్ వీడియోలు చేయ‌డం, మ‌రికొంద‌రు సెల‌బ్రిటీల్లా ఫోజులివ్వడం.. ఇలా రకరకాల పద్దతులను ట్రై చేస్తూ త‌మ పెళ్లిరోజును ఎంతో ప్ర‌త్యేకంగా మార్చుకుంటూ ఉంటారు. అలాంటి ప్రత్యేకతలు కోరుకున్న వ్యక్తుల్లో ఒక‌రే ఈ వ‌ధువు (Bride). అయితే వారంద‌రిలా ఈ వ‌ధువు ఏమీ వెరైటీ పద్ధతులు ఫాలో అవ్వలేదు. తాను ప్రేమించిన వ్య‌క్తిని పెళ్లాడి.. తన రోజును కాస్త విభిన్నంగా మార్చుకొని వార్త‌ల్లోకి ఎక్కింది. ఎలాగ‌నుకుంటున్నారా? త‌నేం చేసిందో.. ఎందుకు చేసిందో తెలియాలంటే త‌న క‌థ మొత్తం తెలుసుకోవాల్సిందే.

54266490 628841674219315 568948758633738616 n

ADVERTISEMENT

అనుభీ గుప్తా (ఇప్పుడు అనుభీ నిఖిల్ అగ‌ర్వాల్‌) తన పెళ్లి రోజు ఉద‌యం.. తనకు తానుగా రెడీ అవ్వడమే కాదు.. త‌న‌కు కాబోయే భ‌ర్త‌ను కూడా తన అందంగా రెడీ చేసి.. ఆ ప్ర‌త్యేక‌మైన రోజు కోసం సిద్ధం చేయడం గమనార్హం. స్వ‌త‌హాగా మేక‌ప్ ఆర్టిస్ట్ అయిన అనుభీ త‌న పెళ్లికి.. ప్ర‌త్యేకంగా మేక‌ప్ ఆర్టిస్టుల‌ను పెట్టుకోలేద‌ట‌. మేక‌ప్ ఆర్టిస్టుల‌కు ప్ర‌త్యేకంగా డ‌బ్బు దండ‌గ అని ఆలోచించింది అనుకుంటున్నారా?

కాదు.. త‌మ లుక్ ఎలా ఉండాన్న విషయంలో ఆమెకు ఒక క్లారిటీ ఉంది. అదే క్లారిటీతో త‌న మేక‌ప్ తానే వేసుకోవ‌డంతో పాటు.. కాబోయే భ‌ర్త నిఖిల్‌కి కూడా మేక‌ప్ చేసింది. సాధార‌ణంగా మ‌నం కూడా పెళ్లి రోజున ఇలా సిద్ధ‌మ‌వ్వాలి… అలా రెడీ అవ్వాలి అని అనుకుంటాం కదా. కానీ ఆఖ‌రి నిమిషం వ‌చ్చేస‌రికి.. మన లుక్‌లో మనకు తెలియకుండానే మార్పులొచ్చేస్తాయి. అయితే జీవితంలో ఒకేసారి వ‌చ్చే ఆ సంద‌ర్భంలో.. మన మ‌న‌సుకు న‌చ్చిన‌ట్లుగా త‌యార‌వ‌డం కూడా ముఖ్యమే క‌దా. అందుకే అనుభీ చేసిన ప‌నికి చాలామంది ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

అనుభీ త‌న‌కు మేక‌ప్ చేస్తున్న వీడియోని.. తాజాగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు నిఖిల్‌. ఈ వీడియో ఎంతో ప్రత్యేకంగా ఉండ‌డంతో పాటు.. అంద‌రినీ క‌ట్టిప‌డేస్తోంది. దీంతో లైక్‌లు, షేర్ల‌తో ఇది సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.

కొత్త త‌రానికి ప్ర‌తీక‌లైన నిఖిల్, అనుభీలు పెళ్లి త‌ర్వాత ఒక సరికొత్త నిర్ణయం కూడా తీసుకున్నారు. తమ పేర్లకు తమ భాగస్వామి పేరును జత చేసి.. అనుభీ నిఖిల్ అగ‌ర్వాల్‌, నిఖిల్ అనుభీ అగ‌ర్వాల్‌లుగా మారారు. రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పుర్‌లో శౌర్య్‌ఘ‌డ్ ద‌గ్గ‌ర జరిగిన వీరి డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కి సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైర‌ల్ అయ్యాయి. ఆ తర్వాత ఈ ఫొటోల‌ను తీసిన డివైన్ మంత్రా పేజ్‌లోనే కాదు.. వెడ్డింగ్‌కి సంబంధించిన ప్ర‌తి పేజ్‌లోనూ వీరి ఫొటోలు క‌న‌బ‌డ‌డం విశేషం. ఇలా డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోవాల‌నుకునేవారికి శౌర్య‌ఘ‌డ్ చాలా మంచి వేదిక అని వీరి వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు నిరూపిస్తున్నాయి.

ADVERTISEMENT

గ‌తంలోనూ ఎంతోమంది వ‌ధూవ‌రులు ర‌క‌ర‌కాల చిత్రమైన పనుల ద్వారా ఫేమ‌స్ అయ్యారు. ఓ వ‌రుడు త‌న‌కు కాబోయే భార్య కోసం ఆమెకిష్ట‌మైన.. తామిద్ద‌రినీ క‌లిపిన పాట‌ను పాడి.. నెచ్చెలి మ‌న‌సును దోచ‌డంతో పాటు పాపుల‌ర్ కూడా అయిన సంగ‌తి మ‌న‌కు తెలిసిందే..!

పాట పాడి స‌ర్‌ప్రైజ్ చేశాడు.. నెచ్చెలి మ‌న‌సు దోచేశాడు..!

ఇక సంగీత్ సంద‌ర్భంగా త‌న స్నేహితురాళ్ల‌తో క‌లిసి నృత్యం చేసి ఆక‌ట్టుకొని.. ఇంటర్నెట్ సంచ‌ల‌నంగా మారిన వ‌ధువునీ చూశాం.

ఈ వ‌ధువు స్టెప్పులేస్తే.. ప్ర‌పంచ‌మే ఫిదా అయిపోయింది..!

ADVERTISEMENT

త‌ల్లిదండ్రుల రుణం తీర్చుకోలేమంటూ అప్ప‌గింతలు కాద‌ని.. నవ్వుకుంటూ వెళ్లిన వ‌ధువు గురించి కూడా మ‌నం విన్నాం.

అమ్మానాన్న‌లను వ‌దులుకోవ‌డం న‌చ్చ‌క.. సంప్ర‌దాయాన్నే కాదన్న వధువు ..!

కానీ ఇలా త‌న‌కు కాబోయే భర్తకే మేక‌ప్ చేసి.. వార్తల్లో నిలిచిన వ‌ధువు గురించి విన‌డం బ‌హుశా ఇదే మొద‌టిసారి అవుతుందేమో..!

04 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT