Advertisement

Finance

ఈ అలవాట్లు మనకు తెలియకుండానే.. మన ఖర్చులు పెంచేస్తాయి…!

Soujanya GangamSoujanya Gangam  |  Jun 28, 2019
ఈ అలవాట్లు మనకు తెలియకుండానే.. మన ఖర్చులు పెంచేస్తాయి…!

Advertisement

కొత్తగా ఉద్యోగంలో చేరిన కొందరు యువతీ యువకులు సంపాదన తక్కువగా ఉండి.. ఖర్చులకు డబ్బు సరిపోకపోతే చాలా బాధపడతారు. కానీ తమ అలవాట్లు (Habits) ఎలా ఉన్నాయో మాత్రం గమనించరు. పైగా తమ జీతం తక్కువగా ఉందని.. తల్లిదండ్రులు ఖర్చులకు తగినంత డబ్బు (Money) ఇవ్వట్లేదని ఫిర్యాదులు చేస్తుంటారు.

కొంతమంది విషయంలో సంపాదన తక్కువగానే ఉన్నా.. ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. కాబట్టే డబ్బు ఆదా చేయరన్నది నిజం. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రోజువారీ జీవితంలో చాలామందికి ఉండే ఈ అలవాట్లు ఖర్చులు పెంచేస్తాయి. ఈ క్రమంలో మీక్కూడా ఈ అలవాట్లు ఉన్నాయేమో.. ఓసారి చెక్ చేసుకోండి. ఈ క్రమంలో ఖర్చులు తగ్గించుకునేందుకు వాటికి దూరంగా ఉండండి.

Shutterstock

బయట తినడం..

సాధారణంగా ప్రతి శుక్రవారం లేదా శనివారం మిత్రులతో బయటకు వెళ్లి.. ఎంజాయ్ చేయాలని చాలామంది అనుకుంటారు. ఇలా ప్రతీసారి స్నేహితులతో పార్టీలకు వెళ్లడం, రెస్టరెంట్లో భోజనం చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఇది మీ ఖర్చులను పెంచేస్తుంది. అలా కాకుండా.. ఇంట్లోనే చిన్నపాటి పార్టీ ఏర్పాటు చేసుకోవడమో లేదా కలిసి తినడమో చేయవచ్చు.  ఇలా చేస్తే ఖర్చు తగ్గడంతో పాటు.. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే నెలలో రెండు సార్లు బయట తింటే ..మరో రెండు సార్లు ఎవరో ఒకరి ఇంట్లో పార్టీ చేసుకోవడం బెటర్. అదేవిధంగా.. ఆఫీసులో అయితే పాట్ లక్ పార్టీ చేసుకోవడం మంచిది.

ఎక్కువ ఉత్పత్తులు వాడడం..

చర్మ పరిరక్షణ కోసం వివిధ ఉత్పత్తులు ఉపయోగించడం సరైనదే. కానీ వాటికోసం మరీ ఎక్కువ ఖర్చు చేయడం సరికాదు. లగ్జరీ ఉత్పత్తులు ఉపయోగించే ముందు.. తక్కువ ధరకు లభ్యమయ్యే బ్రాండ్లను ఉపయోగించడం మంచిది. కొన్నిసార్లు అవి కూడా లగ్జరీ ఉత్పత్తులతో సమానంగా పనిచేస్తాయి. సాధారణంగా మరీ ఖరీదైన ఉత్పత్తులుగా భావించేవి.. మనకు అవసరం లేనివై ఉండచ్చు. అందుకే రీసర్చ్ చేసి మీ చర్మతత్వానికి అనుగుణమైన ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించండి.

shutterstock

సామాన్ల లిస్టు..

మనం సూపర్ మార్కెట్‌లో సామాన్లు కొనడానికి వెళ్తున్నప్పుడు.. ముందే లిస్టు రాసుకోవడం బెటర్.  లేకపోతే మనకు అవసరం లేని పదార్థాలెన్నింటినో కొనేస్తాం. మార్కెట్లలో వస్తువులన్నీ చూడడానికి కొత్తగా కనిపిస్తాయి. కనుక అవసరమున్నా.. లేకపోయినా మనకు వాటిని కొనేయాలని అనిపిస్తుంది. కనుక ముందే లిస్టు రాసుకొని వెళ్లడం వల్ల.. అవసరమైనవి మాత్రమే కొనే వీలుంటుంది.

మరీ ఎక్కువ సబ్ స్క్రిప్షన్లు

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్.. ఇలా కనిపించే ప్రతీ సినిమా సైటుకీ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే..  మీ బ్యాంక్ బ్యాలన్స్‌కి గండి పడ్డట్లే. కనుక మీకు ఆసక్తి ఉన్న సైటుకి మాత్రమే చందాదారులుగా చేరండి. వీలుంటే మీ స్నేహితులతో కలిసి ఒక్కొక్కరూ ఒక్కో సబ్‌స్క్రిప్షన్ తీసుకొని.. అకౌంట్స్ షేర్ చేసుకోండి. అలా చేయడం వల్ల మీ ఖర్చు తగ్గుతుంది.

Shutterstock

కాఫీ

రోజూ మీకు కాఫీ తాగే అలవాటుందా? అయితే మీరు పొదుపు మంత్రాన్ని కచ్చితంగా ఫాలో అవ్వడం లేదు. కాఫీ తాగడానికి అంత ఖర్చవుతుందా? ఒక కప్పు కాఫీ తాగితే ఏమవుతుంది? అనుకుంటున్నారా? రోజూ మీ ఆఫీస్ పక్కనున్న కేఫ్ నుంచి కాఫీ తెప్పించుకొని తాగితే.. కనీసం 50 రూపాయలు ఖర్చవుతుంది. ఇలా నెల మొత్తం లెక్కించండి. అప్పుడు మీ జేబుకు రంధ్రం పడినట్లే కదా. దీని కంటే.. తాజా కాఫీని ఫ్లాస్కులో నిల్వ చేసి.. మీ వెంట తీసుకెళ్లడం మంచిది.

విద్యుత్తు కూడా. .

చాలామంది లైట్లు, ఏసీలు ఆఫ్ చేయడం తరచూ మర్చిపోతుంటారు. వీటి అవసరం లేనప్పుడు ఆఫ్ చేయడం వల్ల పర్యావరణానికే కాదు.. మీ అకౌంట్ బ్యాలన్స్‌కి కూడా మంచిది. అందుకే విద్యుత్తును వీలున్నంతగా పొదుపు చేయడం మంచిది.

Shutterstock

డబ్బు కరిగించడం..

సాధారణంగా కొవ్వు కరిగించాలన్న కోరికతో.. అనేకమంది ఖరీదైన జిమ్‌లో మెంబర్‌షిప్స్ తీసుకుంటుంటారు. పర్సనల్ ట్రైనింగ్, ఫిట్‌నెస్ క్లాసులు అంటూ చాలా డబ్బు ఖర్చు చేస్తారు. కానీ వాటికి వెళ్లేది మాత్రం చాలా తక్కువే. ఇలా చేయడం వల్ల మీరు కట్టిన డబ్బు అంతా వేస్ట్ అయిపోతుంది. మీరు ఫిట్‌నెస్‌ని మీ లైఫ్‌స్టైల్‌గా మార్చుకోవాలని భావిస్తే.. ముందు పార్క్‌లో పరుగెత్తడం, సైకిల్ తొక్కడం.. వంటివి చేయండి.  రోజూ వ్యాయామం చేయడం అలవాటయ్యాక ఆ తర్వాత జిమ్ మెంబర్‌షిప్ తీసుకోవడం మంచిది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ఇవి కూడా చదవండి. 

ఇలా చేస్తే జిమ్ అవ‌స‌రం లేకుండానే.. బ‌రువు త‌గ్గొచ్చు..

ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే.. మీరే కిచెన్ క్వీన్ ..!

ఫేషియ‌ల్ బ్లీచ్‌తో.. మెరిసే అందాన్ని సొంతం చేసుకుందాం.. ! (How To Bleach Facial Hair At Home)