ADVERTISEMENT
home / Family
మీ గారాల పట్టికి ఇలా “డాటర్స్ డే విషెస్” చెప్పి.. వారిని సంతోషపర్చండి..!

మీ గారాల పట్టికి ఇలా “డాటర్స్ డే విషెస్” చెప్పి.. వారిని సంతోషపర్చండి..!

కూతురు (Daughter) పుట్టిందంటే చాలు.. సాక్షాత్తూ లక్ష్మీ దేవి పుట్టిందని మన ఇళ్లలో ఆనందంగా ఫీలవుతుంటారు. ఎంత మంది అబ్బాయిలున్నా సరే.. ఒక్క కూతురు ఉంటే చాలు.. ఆ కళే వేరుగా ఉంటుంది. సాధారణంగా ఆడ పిల్లల కోసం.. ఓ రోజంటూ ఏర్పాటు చేసుకొని దాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజూ ఆడపిల్లలదే. వాళ్లతోనే ఆనందం.. వారి వల్లే ఇంట్లో సంతోషం.

అయితే ఆడపిల్లల ప్రాధాన్యాన్ని వివరించే ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవడం.. వారి స్థాయిని మరింత పెంచడమే అవుతుంది. వారికి తగిన గౌరవాన్ని అందించడంతో పాటు.. తనకు అందించాల్సిన ప్రేమను అందిస్తామని ప్రమాణం చేస్తూ ఈ రోజును జరుపుకుంటారు. ఈ సంవత్సరం (2019) నేషనల్ డాటర్స్ డే (Daughters day) సెప్టెంబర్ 22న రాబోతోంది. మరి ఈ సందర్భంగా.. మీ గారాల పట్టిని ఆనందపరిచే శుభాకాంక్షలు ఎలా చెప్పాలో చూద్దాం రండి..

డాటర్స్ డే ఎందుకు ప్రారంభమైంది?

ADVERTISEMENT

Shutterstock

మీ జీవితంలో కూడా ఓ కూతురు వరంలా వస్తే.. మీరూ డాటర్స్ డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. కూతుళ్ల కంటే కొడుకులకే ఎక్కువ విలువ ఇచ్చే మన దేశంలో.. ఆడపిల్లలకూ సమానమైన ప్రేమ, సంతోషం పంచాలని కోరుకుంటూ జరుపుకొనే రోజు ఇది. మీ కూతురు ఎంత విలువైన బహుమానమో తెలియజేసే రోజు ఇది. పితృస్వామ్య వ్యవస్థ కారణంగా.. మన దేశంలో స్త్రీలకు.. ముఖ్యంగా కూతుళ్లకు కొడుకులకు ఇచ్చినంత విలువ ఇవ్వరు.

స్త్రీలు కేవలం మగపిల్లలకు మాత్రమే జన్మనివ్వాలని చాలామంది కోరుకునేవారు. ఇది అమ్మాయిల్లో ఆత్మన్యూనతను పెరిగేలా చేస్తుంది. అలాగే అబ్బాయిలు చేసే పనులను వారు చేయలేరని.. చిన్నచూపు చూసేలా చేస్తుంది. అంతేకాదు.. ఇది స్త్రీల జనాభాను తగ్గించడంతో పాటు లింగ వివక్షకూ, భ్రూణ హత్యలకు కారణమైంది. ఈ సమస్య కేవలం మన దేశంలో మాత్రమే కాదు.. ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లో కూడా ఉంది.

అందుకే ఈ రోజును జరపడం ప్రారంభించాయి పలు దేశాల ప్రభుత్వాలు. ఈ సందర్భంగా కూతుళ్లు కూడా కొడుకుల కంటే తక్కువేం కాదని.. వారితో సమానమని అందరూ గుర్తించేలా చేయాలని చెబుతూ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి.

ADVERTISEMENT

కారణమేదైనా సరే.. మీ జీవితంలోకి అడుగుపెట్టిన మీ చిన్ని దేవత గురించి.. ఈ ‘డాటర్స్ డే’ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ ముద్దుల కూతురికి ఈ విషెస్ పంపించి తన ముఖంలో నవ్వులు విరబూసేలా చేయండి.

‘డాటర్స్ డే’ శుభాకాంక్షలు

Shutterstock

ADVERTISEMENT

1. నువ్వు చాలా టాలెంటెడ్‌గా, అందంగా, తెలివిగల అమ్మాయిగా ఎదగడం చూసి.. నా మనసు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతుంది. నాలో మరింత కష్టపడాలనే కోరిక కూడా పెరుగుతోంది. నువ్వు నా కూతురుగా పుట్టడం నా అదృష్టం. హ్యాపీ డాటర్స్ డే

2. నా జీవితంలో నేను కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు.. బాధలో ఉన్నప్పుడు నిన్ను చూస్తే చాలు. ఇంత అద్భుతమైన అమ్మాయి నా జీవితంలో ఉన్నప్పుడు.. నేనెందుకు బాధపడాలి అనిపిస్తుంది. లవ్ యూ నా బంగారు తల్లీ. హ్యాపీ డాటర్స్ డే..

3. నీకు ఎప్పుడు ఏది అవసరమైనా.. ఏ సమస్య వచ్చినా.. నేను ఒక్క కాల్ దూరంలో ఉంటానని గుర్తుంచుకో. ఆ సమస్య ఎంత చిన్నదో, ఎంత పెద్దదో నేను పట్టించుకోను. నీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. నీకు సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడూ నేను నీకు తోడుంటా. హ్యాపీ డాటర్స్ డే..

4. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నీ పై నా ప్రేమ పెరుగుతోందే తప్ప తగ్గదు. మన మధ్య ఎప్పటికీ విడదీయలేని బంధం ఉంది. దీని గురించి కేవలం తల్లీకూతుళ్లకే అర్థమవుతుంది. హ్యాపీ డాటర్స్ డే తల్లి.. ఎప్పటికీ నిన్ను ప్రేమించే మీ అమ్మ.

ADVERTISEMENT

5. జీవితంలో నీకు ఎన్నో అడ్డంకులు ఎదురుకావచ్చు. కొన్ని సందేహాలకు అస్సలు సమాధానాలే దొరకవు. నీ మనసు కూడా గాయపడుతుంది. ఇంకా చాలా కష్టాలు సంభవిస్తాయి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో.. ఈ కష్టాలన్నింటిలోనూ నేను నీకు తోడుగా ఉంటాను. ఎందుకంటే నువ్వు నా ముద్దుల కూతురివి కాబట్టి.. హ్యాపీ డాటర్స్ డే..

6. నేను నిన్ను రోజురోజుకీ మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నా. నువ్వు నా కూతురువి అని మాత్రమే కాదు.. నీకున్న మంచి మనసు, ధైర్యంగా నిలబడే తత్వం నాకెంతో ఇష్టం. ఇలా నన్నెప్పుడూ గర్వించేలా చేయి నా బంగారు తల్లి. హ్యాపీ డాటర్స్ డే.

7. నువ్వు ఇప్పుడు చాలా పెద్దదానివి అయిపోయావు. కానీ నాకు మాత్రం నువ్వెప్పుడూ చిన్నపిల్లవే. కానీ అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా. నీపై నాకున్న ప్రేమ రోజు రోజుకీ మరింత బలంగా, మరింత ఎక్కువగా తయారవుతూ వస్తోంది. హ్యాపీ డాటర్స్ డే కన్నా.

8. నేను మంచి తల్లిగా ఉండేందుకు నువ్వు నన్నెప్పుడూ ప్రోత్సహిస్తావు. మనం తరచూ కలవకపోయినా సరే.. మన ప్రేమ మాత్రం మన మనసుల్లోంచి ఎప్పుడూ తరిగిపోదు. అది ఎల్లప్పుడూ మనల్ని కలిపే ఉంచుతుంది. హ్యాపీ డాటర్స్ డే..

ADVERTISEMENT

9. ఒక తల్లి లేదా తండ్రి తన బిడ్డను ఎంతగా ప్రేమించగలరో తెలియాలంటే.. నువ్వు ఓ తల్లివి కావాల్సిందే. లవ్ యూ సో మచ్ స్వీట్ హార్ట్. హ్యాపీ డాటర్స్ డే.

10.బాధల్లో ఉన్న రోజుల్లో.. నువ్వే నాకు ధైర్యమై నిలిచావు. సంతోషంలో తోడుండి దాన్ని రెట్టింపు చేశావు. అంత అద్భుతమైన కూతురిగా ఉన్నందుకు.. నీకు ధన్యవాదాలు. లవ్ యూ రా.. హ్యాపీ డాటర్స్ డే.

 

ఇంతే అద్భుతంగా మీ ప్రియమైన వారికీ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పండి.

ADVERTISEMENT

వాట్సాప్ స్టేటస్ కోసం "ఐ లవ్ మై డాటర్" కోట్స్

shutterstock

కేవలం మీ కూతురికి శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమే కాదు.. మీరు మీ గారాల పట్టిని ఎంతగా ప్రేమిస్తున్నారో అందరికీ తెలియడం కోసం.. వాట్సాప్ స్టేటస్ పెట్టే అలవాటు ఉందా? అయితే మీ వాట్సాప్ స్టేటస్ కోసం మీ కూతురిని ..ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పే ఈ కొటేషన్లు ఓసారి చూడండి.

ADVERTISEMENT

1. నా ప్రియమైన ముద్దుల పాపకి.. నువ్వు నా ప్రార్థనలకు దేవుడిచ్చిన ఫలితం. నా కోరికలన్నింటికీ రూపం వస్తే అది నువ్వే. నువ్వు పెద్దయ్యాక కూడా.. ఇలాగే అందరి జీవితాల్లో ఓ అద్బుతంగా నిలవాలని దేవుడిని కోరుకుంటున్నా. ఎందుకంటే నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా.

2. నా కళ్లకు నువ్వెప్పుడూ చిన్నపిల్లవే.. నా చిట్టితల్లీ. అంత త్వరగా పెరిగి నాకు దూరమవ్వకు. ఎందుకంటే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా.

3. రోజులు గడుస్తున్నకొద్దీ నువ్వు చాలా అందంగా తయారవుతున్నావు. కేవలం బాహ్యరూపంలోనే కాదు.. మనసునీ అందంగా మార్చుకుంటున్నావు.. నీ బంగారు మనసు నిన్ను అందరూ ఇష్టపడేలా చేస్తుంది. నేనైతే నిన్ను నా కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా.

4.నీ తల్లినైనందుకు నేను ఎంతో గర్విస్తున్నా. మనిద్దరి మధ్య ఉన్న బంధం పర్ఫెక్ట్ కాదు. కానీ మన మధ్య ఉన్న ప్రేమ మాత్రం ఎంతో బలమైనది, నిజమైనది. ఐ లవ్ యూ మై స్వీటీ..

ADVERTISEMENT

5. నువ్వు జీవితంలో ఎక్కడికి వెళ్లాలనుకున్నా.. ఏం చేస్తున్నా.. నేను మాత్రం నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా. ఎందుకంటే నువ్వు నా కూతురివి కాబట్టి. 

6. నిన్ను మొదటిసారి చూసిన క్షణంలోనే.. నా మనసును నువ్వు లాగేసుకున్నావు. అప్పటి నుంచి ఇప్పటివరకూ నేను నిన్ను ప్రేమించడం ఎప్పుడూ మానేయలేదు. ఐ లవ్యూ డియర్.

7. జీవితంలో మంచి సందర్భాలు, చెడు సందర్బాలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి కష్టం మనకు ఎంతో కొంత నేర్పిస్తుంది. నీ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులన్నింటినీ నువ్వు ఆనందంగా ఎదుర్కొంటావని నేను నమ్ముతున్నా. ఐ లవ్యూ మై స్వీట్ హార్ట్.

8. నా జీవితంలో నాకు జరిగిన అద్బుతం నువ్వే. నువ్వు పుట్టే వరకూ.. నేను ఒక వ్యక్తిని ఇంతగా ప్రేమిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. నువ్వెప్పుడూ నా మనసులోనే ఉంటావు. ఐ లవ్ యూ చిట్టి తల్లి.

ADVERTISEMENT

9. నేను నీ గురించి కంగారు పడడాన్ని.. నువ్వు ఎప్పుడూ ఆపలేవు. ఎందుకంటే పిల్లల గురించి కంగారు పడడం ప్రతి అమ్మకు దేవుడిచ్చిన ఓ ఫీలింగ్. పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తూ.. వారి గురించి కంగారు పడతారు అమ్మలు. నేనూ అంతే.. నిన్ను ప్రపంచం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా.. లవ్ యూ.

10. నా కూతురు ఎంతో అద్బుతమైన అమ్మాయి. తనకు తల్లి అయినందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని. నేను తనని ఎంతగానో ప్రేమిస్తున్నా.

11. తన నవ్వంటే నాకెంతో ఇష్టం. తను నన్ను కౌగిలించుకుంటే ఇంకా ఇష్టం. తన మనసంటే మరెంతో ఇష్టం. అన్నింటికంటే ఎక్కువగా నా కూతురును అమ్మా అని పిలిచే పిలుపంటే నాకు ఎంతో ఎంతో ఇష్టం. లవ్యూ బేబీ.

12. నా చిట్టి తల్లీ ఐ లవ్ యూ. ఒక కూతురు ఎలా ఉండాలి అన్నదానికి ఓ ఉదాహరణ నువ్వు. ప్రేమ, సేవా గుణం, అందం, నిజాయతీ, తెలివితేటలు, అమాయకత్వం వంటి గుణాలున్న స్వతంత్రమైన అమ్మాయివి నువ్వు. తల్లిదండ్రులు తమ ముద్దుల కూతురు ఎలా ఉండాలని భావిస్తారో.. దానికి ప్రతిరూపం నువ్వు.

ADVERTISEMENT

13. నాకో అమ్మాయి తెలుసు. తను నా జీవితంలో రంగులు నింపుతుంది. తనెవరో కాదు.. నా కూతురు. లవ్ యూ బంగారు తల్లి.

14. నా జీవితంలో ఏదైనా అద్భుతం జరిగితే బాగుంటుందని అనిపిస్తే.. వెంటనే నా కూతురి కళ్లలోకి చూస్తాను. అప్పుడు నా జీవితంలో అద్భుతమనేది ఇప్పటికే జరిగిందని అనిపిస్తుంది. 

15. నా చిన్నారి.. నేను ఎప్పుడు నీకు ‘ఐ లవ్ యూ’ చెప్పినా అదేదో అలవాటు ప్రకారం చెబుతానని మాత్రం అనుకోకు. ఎందుకంటే అది నేను నీకు ఒక విషయం గుర్తు చేసేందుకు చెబుతుంటా. అది మరింకేదో కాదు.. నువ్వు నా జీవితంలో దొరికిన అద్బుతానివి. అందుకే నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను.

ఆడ‌పిల్ల‌లంటే ఎప్పుడూ ప్ర‌త్యేక‌మే..! ఎందుకో మీకు తెలుసా??

ADVERTISEMENT

తల్లీకూతుళ్ల బంధం గురించి కోట్స్

shutterstock

1. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ అంత గొప్పది మరొకటి లేదు. కూతురి మనసు కంటే అద్భుతమైనది మరొకటి లేదు.

ADVERTISEMENT

2. కూతురంటే తల్లితో పాటు నవ్వులను పంచుకునేది.. కలలను పంచుకునేది.. తన మనసుతోనే ప్రేమను కూడా పంచుకునేదని అర్థం.

3. కూతురంటే తల్లి కడుపున పుట్టిన ఓ బుజ్జాయి.. చిన్నతనంలో తనకు తోడుగా నిలుస్తూ పెద్దయ్యాక తనకు స్నేహితురాలిగా మారుతుంది.

4. తల్లి అంటే కూతురికి మహారాణి కంటే ఎక్కువ.

5. దేవుడు ఒకరికి కూతురిని  ప్రసాదించాడంటే.. వారి కోసం జీవితాంతం ఓ  స్నేహితురాలిని పంపిస్తున్నానని చెప్పడమే..

ADVERTISEMENT

6. తల్లీకూతుళ్ల మధ్య ఉద్భవించే అద్బుతమైన ప్రేమను చాటిచెప్పేందుకు.. ఏ భాషలో అయినా సరే మాటలు సరిపోవు.

7. ఏ తల్లీకూతుళ్లు దూరంగా జీవించలేరు. వారిద్దరి మధ్యా శారీరకంగా ఎంత దూరం ఉన్నా.. మానసికంగా మాత్రం అస్సలు ఉండదు.

8. అప్పుడప్పుడూ దేవదూతలు కూతుళ్ల రూపంలో మన జీవితంలోకి అడుగుపెడతారు. మన జీవితాన్ని ఆనందంలో ముంచెత్తుతారు.

9. ఒక తల్లికి దక్కే అద్భుతమైన సంపద తన కూతురు మాత్రమే. అది బంగారం, వజ్రాల కంటే విలువైనది.

ADVERTISEMENT

10. ఏ తల్లీ తన పిల్లలు తన అడుగుజాడల్లో ముందుకెళ్లాలని కోరుకోదు. ఎందుకంటే వాళ్లు జీవితంలో తన కంటే చాలా ముందుకు వెళ్లాలని ప్రతి తల్లి కలలు కంటుంది కాబట్టి.

11. కొన్ని సార్లు చిన్న చిన్న విషయాలే మనసులో పెద్ద ముద్రను వేసుకుంటాయి. అలాంటి ఓ చిన్న పాపగా నా జీవితంలోకి అడుగుపెట్టి.. పెద్ద ముద్ర వేసింది నా కూతురు.

12. నా జీవితంలో దేవుడు నాకు అతి పెద్ద వరాన్ని అందించాడు. దానికి నేను రోజూ ధన్యవాదాలు చెప్పుకుంటా. ఆ వరాల మూట నన్ను ‘అమ్మా’ అని పిలుస్తుంది.

13. ఏదో ఒక రోజు నా జీవితంలోని పేజీలు మొత్తం పూర్తవుతాయి. కానీ అందులో నేను గుర్తుంచుకునే అతి ముఖ్యమైన పేజీలు, అందమైన చాప్టర్లు కేవలం నా కూతురితో గడిపిన క్షణాలే..

ADVERTISEMENT

14. ఈ ప్రపంచంలో ఒక అమ్మాయి భయాలను, బాధలను సంతోషంగా మార్చగలిగే శక్తి ఉన్న వ్యక్తి.. కేవలం తన తల్లి మాత్రమే.

15. కూతురంటే గతాన్ని గుర్తుచేసే ఓ తియ్యటి గుర్తు. అలాగే భవిష్యత్తుపై మనం పెంచుకునే ఆశ, నమ్మకం.

#ToMaaWithLove మీ అమ్మ కూడా.. ఈ డైలాగ్స్ తప్పనిసరిగా చెప్పే ఉంటారు కదా..!

ADVERTISEMENT

తండ్రీకూతుళ్ల బంధం గురించి కొటేషన్స్

Shutterstock

1. ఒక అమ్మాయిని తను పెళ్లాడబోయే వ్యక్తి రాణిలా చూసుకుంటాడో లేదో తెలీదు కానీ.. ప్రతి తండ్రి తన కూతురిని మాత్రం రాకుమారిలాగే చూసుకుంటాడు.

2. తండ్రి ముద్దుల కూతురుగా ఉండడం అంటే.. జీవితాంతం తన గురించి పోరాడే ఓ ఆయుధాన్ని కలిగి ఉండడమనే అర్థం.

ADVERTISEMENT

3. ఒక కూతురికి తన తండ్రి పేరంటే.. ప్రేమకు మారుపేరు లాంటిది.

4. ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని.. ఏ అబ్బాయి కూడా తన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించలేడు.

5. ఒక తండ్రి తన కూతురి చేయి పట్టి నడిపించినప్పుడు.. తన వెనుకే ఉండి సొంతంగా నడవమని ధైర్యం చెబుతుంటాడు.

6. అమ్మాయిగా పుట్టడం అంటే చాలామందికి ఇష్టం. ఎందుకంటే అమ్మాయిలు నాన్నల ముద్దుల బిడ్డలు కాబట్టి.

ADVERTISEMENT

7. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ప్రేమకు దూరం తెలీదు. ఎంత దూరమైనా.. అది వారికి దగ్గరగానే అనిపిస్తుంది.

8. ప్రతి అమ్మాయి తనని తన తండ్రిలా ప్రేమించే వ్యక్తి.. భర్తగా రావాలని కోరుకుంటుంది. అలా దొరికిన అమ్మాయి అదృష్టవంతురాలే అవుతుంది.

9. ప్రతి సక్సెస్ ఫుల్ అమ్మాయి వెనుక.. తనని ఎంతగానో నమ్మిన అద్భుతమైన తండ్రి ఉంటాడు.

10. ఓ అమ్మాయి నా మనసును దోచేసింది. నన్ను రోజూ తనతో ప్రేమలో పడేలా చేసుకుంటుంది. తనెవరో కాదు.. నా కూతురు.

ADVERTISEMENT

11. ఓ అద్భుతమైన తండ్రి తన కూతురికి కలలు కనడం నేర్పిస్తాడు. తన వల్లే ఆమె తన భవిష్యత్తు గురించి కలలు కనగలిగే స్థాయి చేరుకుంటుంది.

12. నా కూతురు నేను జీవితంలో సాధించిన అతి పెద్ద విజయం. తను నా జీవితంలోకి అడుగు పెట్టిన చిన్ని దేవత. తను అడుగుపెట్టిన తర్వాత.. నా జీవితం ఎంతో మారిపోయింది.

13. నాకు కూతురు పుడితే.. నేను తనని ప్రేమిస్తానని వూహించాను. కానీ మరీ ఇంతలా ప్రేమిస్తానని మాత్రం నేను ఎప్పుడూ వూహించలేదు. నా కూతురు ఎల్లప్పుడూ నాకు తోడుగా నిలుస్తుంది. అందుకు నేనెంతో అదృష్టవంతుడిని.

14. నా కూతురే నాకు అతి పెద్ద స్పూర్తి ప్రదాత. తనకు అన్నీ అందించాలన్న కోరికే నాకు జీవితంలో ముందుకెళ్లే ధైర్యాన్ని అందిస్తుంది.

ADVERTISEMENT

15. నేను నా కూతురి కోసమే జీవిస్తున్నా. నా జీవితంలోని ప్రతి నిర్ణయం నేను తన కోసమే తీసుకుంటున్నా. తను అద్బుతం. అలాంటి అద్భుతమైన జీవితాన్ని అందించాలన్నదే నా కోరిక.

నాన్న ప్రేమలో మాధుర్యాన్ని తెలుసుకోవాలంటే.. ఈ ఛాయాచిత్రాలు చూడాల్సిందే

మీ కూతురికి మీరు చేసే ప్రమాణాల మెసేజ్‌లు

ADVERTISEMENT

Shutterstock

కేవలం విషెస్ చెప్పి ఊరుకోవడమే కాదు.. తన జీవితంలో తాను అనుకున్నది సాధించేలా చేస్తానని.. అన్ని వేళలా తోడుంటానని.. మీ కూతురికి ప్రమాణాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి, ఈ ప్రమాణాల్లో మీ కూతురికి ప్రస్తుతం అత్యంత అవసరమైనది ఏదో గుర్తించి వాటిని తనకు మెసేజ్ చేయండి. ఆనందంగా ఫీలవుతుంది.

1. ఈరోజు నేను నీకు ప్రమాణం చేస్తున్నా. నీ ఫీలింగ్స్‌కి ఎప్పుడూ విలువనిస్తాను.

2. నేను కోపంలో ఉన్నప్పుడు నిన్ను ఏమీ అనకుండా.. నీతో మాట్లాడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తా. తద్వారా మన బంధం పాడవకుండా చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నా.

ADVERTISEMENT

3. నీకోసం ఎన్ని వీలైతే అన్ని త్యాగాలు చేయడానికి.. ఎప్పుడూ సిద్దంగా ఉంటానని నేను ప్రమాణం చేస్తున్నా.

4. నిన్ను చూసుకోవడానికి నేను జీవించి ఉండాలి కాబట్టి.. నా గురించి నేను శ్రద్ధ తీసుకుంటానని నీకు ప్రమాణం చేస్తున్నా

5. నీకు ప్రమాణం చేస్తున్నా. నీకెలాగు తెలుసు కదా అని.. ఎప్పుడూ నీకు “ఐ లవ్ యూ” చెప్పడం మానేయను.

6. నీకు ప్రమాణం చేస్తున్నా.. ఎప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నా పూర్తి శ్రద్ధతో వింటాను. మన బంధాన్ని మరింత దగ్గర చేయడానికి నాకు వీలైన పనులన్నీ చేస్తానని మాటిస్తున్నా.

ADVERTISEMENT

7. నీకు ప్రమాణం చేస్తున్నా. నిన్ను నాలా ప్రేమించే వ్యక్తి దొరికినప్పుడు.. ఆ వ్యక్తి నిన్ను జీవితాంతం ప్రేమిస్తాడని నమ్మకం కుదిరినప్పుడు.. నీ ప్రేమకు నేను అడ్డు చెప్పను.

8. నిన్ను ఏ విషయంలోనూ తక్కువ చేసి చూడనని.. అన్ని సందర్భాల్లోనూ తోడు నిలుస్తానని ప్రమాణం చేస్తున్నా.

9. నీ విషయంలో బెస్ట్ మామ్ డాడ్‌గా ఉంటానని ప్రమాణం చేస్తున్నా.

10. నువ్వేదైనా తప్పు చేస్తే.. తప్పొప్పుల గురించి నీకు వివరించి చెప్పి.. దానికి సంబంధించిన శిక్ష కూడా వేస్తాను. సరైన విషయంలో నీకు తోడుంటానని ప్రమాణం చేస్తున్నా.

ADVERTISEMENT

11. నీ జీవితంలో అద్భుతమైన అన్ని క్షణాల్లో.. నేను నీకు తోడుగా నిలిచి.. నిన్ను చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తానని ప్రమాణం చేస్తున్నా.

12. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఓ ఫ్రెండ్‌లా మారి.. నీ కష్టాన్ని మొత్తం విని.. నీకు సరైన సలహా అందిస్తానని కూడా మాటిస్తున్నా.

13. నీకు జీవితంలో అన్నీ బెస్ట్‌వి అందించేందుకు.. సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడతానని ప్రమాణం చేస్తున్నా.

14. నేను జీవించి ఉన్నంత వరకూ… జీవితంలోని ఏ సందర్భంలోనూ.. నిన్ను ఒంటరిగా ఉండనివ్వనని ప్రమాణం చేస్తున్నా.

ADVERTISEMENT

15. నీలోని టాలెంట్స్‌ని గుర్తించి.. నీకు నచ్చిన రంగంలో రాణించేందుకు నిన్ను ప్రోత్సహిస్తానని.. ఆ విషయంలో ఎలాంటి ఇబ్బందీ పెట్టనని నీకు ప్రమాణం చేస్తున్నా.

పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇంత అద్భుతంగా చెప్పండి
Mothers Day Poem in Hindi from Daughter
Mothers Day Wishes in Hindi
Happy Mothers Day Quotes in Hindi

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

02 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT