ADVERTISEMENT
home / Celebrity Weddings
కొత్త సంవత్సరం..  కొత్త జీవితం ( హార్దిక్ ప్రేమ ముచ్చట్లు)

కొత్త సంవత్సరం.. కొత్త జీవితం ( హార్దిక్ ప్రేమ ముచ్చట్లు)

Hardik Pandya Announces Engagement To Natasa Stankovic

హార్థిక్ పాండ్యా.. భారత క్రికెట్ జట్టులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ కలిగిన యువ క్రికెటర్. 26 సంవత్సరాల పాండ్యా భారత జట్టు తరఫున ఆడడం ప్రారంభించి మూడేళ్లే అయినా.. మంచి ప్రదర్శనతో అందరి మెప్పునూ పొందాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి జట్టు గెలుపులో ప్రముఖ పాత్ర కూడా పోషించాడు. ఇప్పుడీ యువ క్రికెటర్ ఓ ఇంటివాడు కానున్నాడు. సెర్బియన్ నటి నటాసా స్టాంకోవిక్‌‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు . కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా చుట్టూ నీళ్లు ఉన్న ఓ బోట్‌లో.. తన నెచ్చెలిని హార్థిక్ ప్రపోజ్ చేయడం విశేషం. ఈ ఫొటోలతో పాటు వీడియోలను హార్థిక్, నటాసాలు ఇద్దరూ.. తమ ఇన్‌స్టా‌గ్రామ్ అకౌంట్ల ద్వారా పంచుకున్నారు.

సెర్బియాకి చెందిన నటాసా 2013 లో ‘సత్యాగ్రహ’ అనే బాలీవుడ్ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. అప్పటి నుంచి కేవలం హిందీలోనే కాదు.. తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తోంది. ‘బిగ్ బాస్ 8’ లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న నటాసా.. ఆ తర్వాత ‘నచ్ బల్లియే సీజన్ 9’లో కూడా పాల్గొంది. గత కొన్ని నెలలుగా వీరి ప్రేమకు సంబంధించిన వార్తలు వస్తున్నా.. ఎవ్వరూ దీనిపై స్పందించలేదు. అయితే వీరిద్దరూ కలిసున్న ఫొటోలను పోస్ట్ చేయడం వంటివి.. వీరి బంధం గురించి అందరికీ ఓ క్లారిటీని ఇచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్‌మెంట్ వీడియోలతో కొత్త ఏడాదిలో అందరికీ సర్‌ప్రైజ్ అందించారు.

ADVERTISEMENT

పాట పాడి స‌ర్‌ప్రైజ్ చేశాడు.. నెచ్చెలి మ‌న‌సు దోచేశాడు..!

తమ ఎంగేజ్ మెంట్ చిత్రాలను పోస్ట్ చేస్తూ ‘మే తేరా.. తు మేరీ.. జానే సారా హిందుస్థాన్ (నేను నీ వాడిని.. నువ్వు నా దానివి.. ఈ విషయం దేశమంతటికీ తెలుసు).. ఎంగేజ్డ్’ అంటూ ఓ క్యాప్షన్ రాసుకొచ్చాడు హార్థిక్. నటాసా కూడా తమ ఎంగేజ్ మెంట్ ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ ‘ఫరెవర్ యెస్ (ఎప్పటికీ అవునే సమాధానం) ‘ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

ఈ వీడియోలను తమ స్టేటస్‌లో భాగంగా షేర్ చేసుకున్నారు ఇద్దరూ. చుట్టూ సముద్రం మధ్యలో బోట్.. స్నేహితులతో ట్రిప్.. సంగీతకారులు పాట పాడుతూ మూడ్‌ని అద్భుతంగా మార్చుతున్న ఆ సమయంలో.. హార్థిక్ నటాసాకి ప్రపోజ్ చేశాడు. దానికి వెంటనే నటాసా ఆనందంగా సరేనని చెప్పడం.. ఆ తర్వాత వీరిద్దరూ బాక్స్‌లో ఉన్న రింగ్ ఆకారంలో ఉన్న కేక్‌ని కట్ చేయడం జరిగింది. ఈ కేక్ పై కూడా ‘హెచ్ పీ లవ్స్ నాట్స్ (హార్థిక్ పాండ్యా లవ్స్ నటాసా) ‘ అంటూ రాసి ఉంది. అంతకుముందు డిసెంబరు 31 రోజు రాత్రి పార్టీలో పాల్గొంటున్న ఫొటో పోస్ట్ చేసిన హార్థిక్ స్టార్టింగ్ ‘న్యూ ఇయర్ విత్ మై ఫైర్ వర్క్ (ఈ కొత్త సంవత్సరాన్ని నా ఫైర్ వర్క్ తో ప్రారంభిస్తున్నా)’ అంటూ పోస్ట్ చేశారు.

పెళ్లికి సిద్ధమైన మరో నటి.. ఎంగేజ్ మెంట్‌తో అందరికీ సర్ ప్రైజ్..!

ADVERTISEMENT

ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే అభిమానులు, సెలబ్రిటీలు వీరిద్దరికీ శుభాకాంక్షల వర్షం కురిపించారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ స్పందిస్తూ ‘కంగ్రాచ్యులేషన్స్ హెచ్.. ఇదో అద్బుతమైన సర్ ప్రైజ్. మీ ఇద్దరి జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటున్నా’ అని కామెంట్ చేశాడు.

వీరితో పాటు అథియా శెట్టి, సాక్షి ధోని, కెఎల్ రాహుల్, అదా శర్మ, ప్రియమణి తదితరులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వెన్నెముక గాయంతో క్రికెట్‌కి దూరంగా ఉన్న హార్థిక్.. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో పాల్గొనలేదు. 2018లో హార్థిక్ పాండ్యా అన్న క్రునాల్ పాండ్యా కూడా.. పంకురీ శర్మ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కూడా ప్రపోజ్ చేసిన సమయంలో అదే బోట్‌లో ఉండడం విశేషం.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

02 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT
good points logo

good points text