ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
“ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి.. నెలరోజులు చాలు” – నటి ‘రాశి’ ఆసక్తికర లవ్ స్టోరీ ..!

“ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి.. నెలరోజులు చాలు” – నటి ‘రాశి’ ఆసక్తికర లవ్ స్టోరీ ..!

Interesting facts related to Tollywood Actress Raashi’s Love Story

బాలనటులుగా తెలుగు చిత్రసీమకు పరిచయమై.. తరువాత కథానాయికలుగా మారి స్టార్ స్టేటస్ అందుకున్న ఎందరో తారలు మన టాలీవుడ్‌లో ఉన్నారు. ఆ జాబితాలో నటి రాశి కూడా ఒకరు. కథానాయికగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాక.. అనతికాలంలోనే ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించడమే కాకుండా.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని కూడా సంపాదించుకోగలిగారామె. 

ట్విట్టర్ లో కలిశారు.. జీవితంలో ఒక్కటయ్యారు.. రాహుల్ – చిన్మయి ల అందమైన ప్రేమ కథ..

అంతటి స్టార్ హీరోయిన్ మరి ఎవరిని పెళ్లి చేసుకుంటుందా..? అనే ఆలోచన ఆరోజుల్లో చాలామందిలో ఉండేది. అయితే ఆ ఆలోచనను పటాపంచలు చేస్తూ.. రాశి తన పెళ్లికి సంబంధించిన తంతుని కేవలం ఒక నెల రోజుల్లోనే ముగించేసిందట. ఈ విషయం  తెలిసి ఎంతోమంది షాక్ అయ్యారట. 

ADVERTISEMENT

ఆ వివరాల్లోకి వెళితే, 2003లో “ఒక పెళ్ళాం ముద్దు – రెండో పెళ్ళాం వద్దు” అనే చిత్రంలో నటిస్తుండగా.. శ్రీనివాస్ అనే అసోసియేట్ డైరెక్టర్‌తో రాశికి పరిచయమైంది. కానీ పరిచయ కార్యక్రమం కాస్త భిన్నంగా జరిగింది. 

అదెలాగంటే – సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో శ్రీనివాస్‌ని కొంతకాలం గమనించిన రాశి.. అతన్ని ఎలాగైనా ఏడిపించాలని భావించి.. తన సహాయకురాలితో కలిసి ఓ ప్లాన్ వేసిందట. ఆ ప్లాన్ ప్రకారం, రాశి సహాయకురాలు తొలుత శ్రీనివాస్‌ వద్దకు వెళ్లి “మీ గురించి నాకు రాశి మేడమ్ ఓ మాట చెప్పారు” అని చెప్పిందట. అయితే ఆమె ఏం చెప్పిందో మాత్రం చెప్పలేదు. దాంతో శ్రీనివాస్ కంగారు పడుతూ అదేంటో చెప్పమని అడిగారట. కానీ తాను చెప్పనని.. ఆ విషయం ఏంటో రాశినే అడగమని చెప్పి ఆమె వెళ్లిపోయిందట. 

దాంతో ఆయన చేసేదేమీ లేక రాశి దగ్గరికి వచ్చి – “మేడమ్.. మీరు ఏదో నా గురించి చెప్పారట కదా, అదేంటి?” అని అడిగితే.. ఆమె నవ్వుతూ “ఓహ్ అదా!! నేను సాయంత్రం నీకు ఫోన్ చేసి చెప్తానులే” అని చెప్పి వెళ్లిపోయిందట.

అంత గొప్ప హీరోయిన్ ఏం చెపుతుందో తెలుసుకుందామని ఎదురు చూస్తున్న శ్రీనివాస్‌కి రాత్రి రాశి ఫోన్ చేసి – “ఏం లేదండి! మీరు బాగా కష్టపడుతున్నారు, కచ్చితంగా మీరు మంచి డైరెక్టర్ అవుతారు” అని చెప్పిందట.

ADVERTISEMENT

ఆ రోజు నుండి వీరిద్దరి మధ్య రోజూ ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. క్రమేపి షూటింగ్ నడుస్తున్న కొద్దీ ఈ ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అలా ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక కూడా వీరి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉండేది.

తర్వాత అదే స్నేహం..  వారిరువురు తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకునే వరకు వచ్చిందట.  ఈ క్రమంలో ఒకరోజు ఉన్నట్టుండి – “మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా” అని శ్రీనివాస్‌ను రాశి అడిగిందట.

ప్రేమలో ఉన్నా.. పెళ్లికి రోజా – సెల్వమణి పదకొండేళ్లు ఎందుకు ఆగారో తెలుసా?

అనుకోని ఈ ప్రపోజల్‌కి ఏమి చెప్పాలో పాలుపోని శ్రీనివాస్.. ఆ తర్వాత.. తనకు కూడా మనసులో ఆమె అంటే ఇష్టం ఉండడంతో… ఆ ప్రపోజల్ షాక్ నుండి తేరుకుని – “చేసుకుంటాను” అని బదులు ఇచ్చాడట.

ADVERTISEMENT

మార్చ్ 23, 2004 తేదిన ఈ సంఘటన జరిగింది.. ఇక తన పెళ్లికి సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని తన తల్లి, అన్నయ్యతో రాశి చెప్పగా.. వారి నుండి తొలుత వ్యతిరేకత వచ్చిందట. అయితే రాశి మాత్రం “నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అని చెబుతున్నాను.. చేసుకోవాలా అని మిమ్మల్ని అనుమతి అడగడం లేదు” అని ఖరాకండిగా చెప్పేయడంతో.. వారి ఇంటిసభ్యులు పెళ్లికి పచ్చ జెండా ఊపేశారట.

ఇక ఈ పెళ్లి ప్రస్తావన, శ్రీనివాస్ కుటుంబానికి కూడా ఒక విధమైన షాక్ వంటిదే కావడంతో.. వారికి కూడా ఏం చేయాలో తొలుత పాలుపోలేదట. అయితే ఇద్దరు పరస్పరం ఇష్టపడ్డారు కాబట్టి వెంటనే “పెళ్లి చేసేద్దాం” అని ఒక నిర్ణయానికి రావడంతో.. ఏప్రిల్ 23, 2004 తేదిన రాశి – శ్రీనివాస్ పెళ్లి జరిగిందట. ఇదండీ.. అందాల ‘రాశి’ అందమైన ప్రేమకథ.

చిత్రమేంటంటే.. పెళ్లి ప్రస్తావన తెచ్చిన 30 రోజుల్లోనే రాశి పెళ్లి కావడంతో.. ఫిల్మ్ నగర్‌లో అప్పట్లో ఆ వార్త బాగానే హల్చల్ చేసింది. ప్రస్తుతం శ్రీనివాస్, రాశి దంపతులకు ఒక పాప. ఇటీవలే రాశి మరలా సినిమాలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. దాంతో ఆమెకి పలు ఆఫర్స్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. 

ఏదేమైనా.. రాశి తన పెళ్లి నిర్ణయం కేవలం 30 రోజుల్లో తీసుకున్నప్పటికి కూడా.. తన 15 ఏళ్ళ సంసారం జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. తన భర్తతో హాయిగా ఉన్నాననే చెబుతోందామె. ఇలాగే ఈ దంపతులు రాబోయే రోజుల్లో కూడా సంతోషంగా ఉండాలని కోరుకుందాం.

ADVERTISEMENT

కొసమెరుపు – రామ్ చరణ్ & సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన “రంగస్థలం” చిత్రంలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్రకి ముందుగా రాశినే ఎంపిక చేశారట. అయితే ఆ పాత్ర నచ్చినప్పటికి, ఆ ఆహార్యం తనకి నప్పదని చెప్పి ఆమె తిరస్కరించడం జరిగిందట. ఈ విషయం చాలామందికి తెలియదు.

‘ప్రతి ప్రేమకథ కంచికి చేరదు’ అని తెలిపే.. ‘పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్‌’ల లవ్ స్టోరీ ..!

 

12 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT