ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
జీవిత – రాజశేఖర్ లవ్ స్టోరీ తెలుసుకుంటే క్రేజీ  అనాల్సిందే

జీవిత – రాజశేఖర్ లవ్ స్టోరీ తెలుసుకుంటే క్రేజీ అనాల్సిందే

కొన్ని జంట పదాలు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా ఫేమస్.. పరుచూరి బ్రదర్స్, రామ్-లక్ష్మణ్, రాజ్-కోటి. ఈ మూడు సందర్భాల్లోనూ ఇద్దరు అన్నదమ్ములు లేదా స్నేహితులు కలిసి పనిచేయడం వల్ల వీరి పేర్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే ఇటువంటి జంట పదాలుగా తెలుగు పరిశ్రమలో ఇద్దరి భార్యాభర్తల పేర్లు ఎప్పటికీ పాపులరే. ఆ జంటే జీవిత- రాజశేఖర్ ( jeevitha – rajasekhar)

దర్శక ధీరుడు రాజమౌళి – రమా రాజమౌళిల ఆదర్శ ప్రేమకథ మీకు తెలుసా?

ఏ ముహూర్తంలో అయితే వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారో కాని.. ఈ ఇద్దరు కలిసి కనపడని సందర్భాలు బహు అరుదు అని చెప్పవచ్చు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసి వెళ్లడం ఈ జంట ప్రత్యేకత. తన వెంట జీవిత లేకపోతే ఏమి తోచదు అంటారు హీరో రాజశేఖర్. తెలుగు భాషతో ఆయనకున్న ఇబ్బంది కారణంగా ఆయనకి వాయిస్ గా జీవిత మారిపోయారు.

అసలు వీరిద్దరి మధ్యలో ప్రేమ ఎలా పుట్టింది? ఎక్కడ పుట్టింది? అసలు వీరి ప్రేమ కథ (love story) గురించి తెలుసుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వృత్తిపరంగా డాక్టర్ అయిన రాజశేఖర్ .. నటన పట్ల ఉన్న ఆసక్తితో హీరోగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. అయితే ఆయన హీరో అవ్వడం ఏమాత్రం కూడా ఇష్టం లేని ఆయన తల్లిదండ్రులు తాము చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే షరతు విధించి మరి ఆయనని సినీ రంగంలోకి పంపించారు. కాని ఆయన జీవితతో ప్రేమలో పడడం ద్వారా ఆ మాట తప్పాల్సి వచ్చింది.

ADVERTISEMENT

ఇక రాజశేఖర్, జీవితల పరిచయం ఒక తమిళ సినిమా సెట్స్ లో జరిగింది. అయితే ఆ చిత్రంలో తన పాత్ర నచ్చక రాజశేఖర్.. మధ్యలోనే సినిమా నుండి బయటకి రావడం జరిగింది. అలా ఈ ఇద్దరు తొలిసారి కలిసి నటించే అవకాశం తప్పిపోగా.. ఆ పరిచయం మాత్రం ఆ తర్వాత కొనసాగింది. తరువాత జీవిత తెలుగు చిత్రసీమలోకి తలంబ్రాలు చిత్రం ద్వారా అడుగుపెట్టడం జరిగింది. ఆ చిత్రంలో రాజశేఖర్ యాంటీ హీరో పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో వీరి పరిచయం స్నేహంగా మారింది. ఆ సినిమా షూటింగ్ అయిపోయే సరికి రాజశేఖర్ అంటే జీవితకి ప్రేమ కలిగింది.

 

అయితే అప్పటికే తాను ఏ హీరోయిన్ ని కూడా పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని తమ ఇంట్లో చెప్పడం వల్ల రాజశేఖర్ ఈ బంధం గురించి ఆలోచించడానికి ఇష్టపడలేదు.. రాజశేఖర్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే నటి శ్రీదేవి తో పెళ్లి సంబంధం వస్తే, హీరోయిన్ తో పెళ్లి ఇష్టం లేక సంబంధం వదులుకున్నారట ఆయన తల్లిదండ్రులు. అయితే ఇదంతా తెలిసినా కూడా రాజశేఖర్ పట్ల ఏర్పడిన ప్రేమని జీవిత వదులుకోదల్చుకోలేదు.

ADVERTISEMENT

క్రమంగా ఈ విషయం జీవిత ఇంటిలో తెలియడంతో.. రాజశేఖర్ నిన్ను పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో లేడని తెలిసి కూడా నువ్వు అతన్ని ఎందుకు ఇష్టపడుతున్నావు అంటూ ఆమె కుటుంబ సభ్యులు తనని నిలదీశారట. దీనికి జీవిత తాను జీవితాంతం ఒంటరిగా ఉండిపోతాను కాని రాజశేఖర్ ని తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోను అని ఖరాఖండిగా చెప్పేశారట. ఇక మరోవైపు జీవిత అంటే ఇష్టం, ప్రేమ ఉన్నప్పటికి తన తల్లి మాట కాదనలేక పెళ్లి సంబంధాలు కూడా చూశారట రాజశేఖర్.

‘అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిల’ ప్రేమకథ.. సినిమా కథని మరిపించేలా ఉంటుంది తెలుసా…!

 

ADVERTISEMENT

విధి ఒకలా తలిస్తే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు అన్నట్టుగా.. రాజశేఖర్ కి పెళ్లి సంబంధాలు కుదరలేదు. ఇక జీవిత-రాజశేఖర్ లు మాత్రం తమ ప్రేమని కొనసాగిస్తూనే ఉన్నారు. వీరి ప్రేమ ఎంతవరకు వెళ్లిందంటే సినిమా షూటింగ్ అయిపోయాక ఇద్దరు కలిసే ఒకే రూమ్ లో ఉండడం.. ఎక్కడికెళ్లినా కలిసి వెళ్లడం.. ఇలా దాదాపు సహజీవనం చేశారట. ఇదే విషయాన్ని జీవిత ఒక ఇంటర్వ్యూ లో చెబుతూ – ఇప్పుడు చాలామంది మేము చాలా మోడ్రన్.. ప్రేమించుకునేటప్పుడు ఇలా చేశాం.. అలా చేశాం అని చెబుతుంటారు కదా.. అవన్ని మేము దాదాపు 25 ఏళ్ళ క్రితమే అవన్నీ చేశామని చెప్పుకొచ్చారు..

వీరి ప్రేమ బంధం క్రమంగా బాగా బలపడిపోయింది.. వీరిద్దరూ కలిసి నటిస్తున్న మగాడు చిత్రం షూటింగ్ సమయంలో రాజశేఖర్ కి యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో రాజశేఖర్ పక్కనే ఉంటూ జీవిత అన్ని సపర్యలు చేసింది. ఇది చూసిన రాజశేఖర్ తల్లి ఆ తరువాత కొన్ని రోజులకి వీరి ప్రేమని అంగీకరించడంతో 1991 చెన్నైలో వీరి వివాహం జరిగింది.

వీరిరువురికి ఇద్దరు అమ్మాయిలు – శివాని & శివాత్మిక. ప్రస్తుతం శివాని మెడిసిన్ చేస్తుండగా.. ఈ ఏడాదే దొరసాని చిత్రం ద్వారా శివాత్మిక నటిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైంది. భవిష్యత్తులో ఈ ఇద్దరూ కూడా యాక్టింగ్ నే  తమ కెరీర్ ని ఎంచుకున్నట్టుగా వారు ప్రకటించడం జరిగింది. ఆఖరుగా జీవిత, రాజశేఖర్ అనేవి రెండు వేరే పేర్లే అయినప్పటికి వీరి మధ్య ఉన్న అనుబంధం, ఆప్యాయత ఆ రెంటిని జంట పేర్లుగా చేసేశాయి. వీరి ప్రేమకథ చదివాక నిజంగా వీరిది అప్పట్లో బోల్డ్, క్రేజీ లవ్ స్టోరీ అనాల్సిందే కదా.

‘అమల – నాగార్జునల’ ప్రేమకథ ఎంత ఆసక్తిగా ఉంటుందో.. అంతే స్ఫూర్తినీ నింపుతుంది..!

ADVERTISEMENT

 

14 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT