logo
Logo
User
home / వినోదం
మెగాస్టార్ చిరంజీవి “సైరా నరసింహా రెడ్డి” మేకింగ్ వీడియోలో.. హైలైట్స్ ఇవే..!

మెగాస్టార్ చిరంజీవి “సైరా నరసింహా రెడ్డి” మేకింగ్ వీడియోలో.. హైలైట్స్ ఇవే..!

మెగా అభిమానులు.. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వీరాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న “సైరా నరసింహా రెడ్డి” (Sye Raa Narasimha Reddy) సినిమా మేకింగ్ వీడియో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. అలా విడుదలైన వీడియోలో సైరా సినిమాకి సంబంధించి.. కీలక సన్నివేశాలైన కోట ముట్టడి & బ్రిటిష్ సేనలతో యుద్ధం వంటి మేకింగ్ క్లిప్స్ ఉన్నాయి.

మీరు కూడా ఇక్కడ ఆ మేకింగ్ వీడియో చూడవచ్చు…

అలాగే ఈ చిత్రంలో.. యాక్షన్‌కి చాలా ప్రాధాన్యత ఉండడం వల్ల.. హాలీవుడ్‌లో ప్రముఖ స్టంట్ డైరెక్టర్స్  లీ విట్కార్ & గ్రెగ్ పావెల్‌లను ప్రత్యేకంగా ఈ చిత్రం కోసం పిలిపించడం జరిగింది. వీరిలో లీ విట్కార్ .. గతంలో బాహుబలి చిత్రానికి కూడా పనిచేశారు.

మెగాస్టార్ చిరంజీవి సరసన.. మరో హీరోయిన్ వేటలో సైరా టీం!

ఇక ఈ మేకింగ్ వీడియోలో… “సైరా నరసింహా రెడ్డి” చిత్రం కోసం వేసిన భారీ సెట్స్ , వందల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్ట్స్ , సినిమాలో ఉపయోగించిన కత్తులు, బరిసెలు, వాటి డిజైన్లు చూడచ్చు. అదే సమయంలో ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషించిన వ్యక్తుల లుక్స్ కూడా ఇందులో చూపెట్టడం జరిగింది.

సైరా చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు.. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, నయనతార, రవి కిషన్, తమన్నా & నిహారిక కొణిదెల మొదలైన వారు నటించిన సంగతి తెలిసిందే. వీరు ఈ సినిమాలో.. మనకి ఏ లుక్స్‌లో కనిపిస్తారన్నది ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. 

 

ఇక ఈ వీడియోలో చిరంజీవి గుర్రపు స్వారీతో పాటు.. యాక్షన్స్ సన్నివేశాలలో నటించిన షాట్స్ మనకి కనిపించాయి. అయితే అభిమానులు మాత్రం  ఈ వీడియోలో.. చిరంజీవి నుండి ఏదైనా ఒక డైలాగ్‌ని ఆశించారు. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం.. త్వరలో విడుదల కాబోయే టీజర్‌లో.. ఓ పవర్ ఫుల్ డైలాగ్‌ని మనం చిరంజీవి నుండి కోరుకోవచ్చని తెలుస్తుంది.

అలాగే ఈ సినిమాని హిందీలో విడుదల చేసేందుకు.. ప్రముఖ నిర్మాత-దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ముందుకి రావడం జరిగింది. ఈరోజు హిందీ వెర్షన్‌లో కూడా మేకింగ్ వీడియోని విడుదల చేయడం జరిగింది. అంత పెద్ద దర్శకుడు ఈ సైరా” చిత్రాన్ని.. హిందీలో విడుదల చేయడానికి ముందుకు రావడం కూడా.. ఒక విధంగా ఈ చిత్రానికి కలిసొచ్చే అంశమే.

“సైరా” చిత్రంలో.. కథను మలుపు తిప్పే నిహారిక కొణిదెల?!

 

ఇక ఈ మేకింగ్ వీడియోలో ‘సైరా నరసింహా రెడ్డి’  టీజర్ ఎప్పుడు విడుదల అవుతుందో కూడా స్పష్టం చేశారు. వచ్చే 20వ తారీఖు అనగా.. వచ్చే మంగళవారం రోజున సైరా నరసింహా రెడ్డి టీజర్ మన ముందుకి రాబోతుంది. ఈ టీజర్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఒకరకంగా ఇది ఈ సినిమాకి సంబంధించి కీలక సమాచారం. 

అలాగే ఈ సమాచారాన్ని బట్టి.. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో సైరా నరసింహా రెడ్డి ప్రేక్షకుల ముందుకి తప్పక వస్తుంది అని అందరూ అంచనా వేస్తున్నారు. ఇక ఉదయం నుండి ఒక వార్త ఫిలిం నగర్ మొత్తం చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సైరా నరసింహా రెడ్డి చిత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారని, అలాగే టీజర్, ట్రైలర్స్‌లో కూడా ఆయన గొంతుని మనం వినవచ్చు అని. అయితే ఇందులో వాస్తవమెంత అనేది వచ్చే మంగళవారం రోజు తేలిపోతుంది.

మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించను అని తేల్చి చెప్పినా… ఈ సినిమాకి వాయిస్ ఇవ్వాలనుకోవడం నిజంగా విశేషమే. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఆఖరుగా… సైరా నరసింహా రెడ్డి మేకింగ్ వీడియో మెగా అభిమానుల్లో కచ్చితంగా ఆనందాన్ని నింపింది.

దక్షిణాది చిత్రపరిశ్రమ పై కన్నేసిన అమితాబ్ & అభిషేక్

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

14 Aug 2019

Read More

read more articles like this
good points logo

good points text