ADVERTISEMENT
home / Bigg Boss
నిన్న ‘రాహుల్ సిప్లిగంజ్’ది ఫేక్ ఎలిమినేషన్ అయితే.. మరి ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

నిన్న ‘రాహుల్ సిప్లిగంజ్’ది ఫేక్ ఎలిమినేషన్ అయితే.. మరి ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

(Rahul Sipligunj Elimination is Fake in Bigg Boss and Mahesh & Himaja are in Trouble)

‘బిగ్ బాస్ సీజన్ 3’లో భాగంగా నిన్నటి ఎపిసోడ్‌లో షో చూస్తున్న వీక్షకులతో పాటుగా.. కంటెస్టెంట్ అయిన రాహుల్ సిప్లిగంజ్ కూడా షాక్ అవ్వడం జరిగింది. ఎలిమినేట్ అయ్యాడు అంటూ.. రాహుల్ సిప్లిగంజ్‌ని బిగ్ బాస్ ఇంటి నుండి స్టేజ్ పైకి తీసుకువచ్చారు.  ఆ తర్వాత అతనితో ఇంట్లోని వాళ్ళందరికీ మార్కులు కూడా వేయించారు. అలాగే ఇంట్లోని వారి పై రాహుల్ సిప్లిగంజ్ అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నారు.

ఇన్ని చేసాక.. “నువ్వు ఎలిమినేట్ కాలేదు.. నీ ఎలిమినేషన్ ఫేక్” అంటూ చెప్పడంతో.. ఒక్కసారిగా ఏమి మాట్లాడాలో తెలియక స్టన్ అయిపోయాడు రాహుల్. ఇక వెంటనే ‘హూస్‌‌లోకి వెళ్లి ఎంజాయ్ చెయ్’ అంటూ నాగార్జున మరలా అతన్ని లోపలికి పంపించారు. దానితో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 3’లో ఒక పెద్ద ట్విస్ట్‌కి అంకురార్పణ జరిగిందని చెప్పొచ్చు.‌

Bigg Boss Telugu 3: హిమజ చేసిన పొరపాటుకు.. మహేష్ విట్టా బలయ్యాడు..!

ADVERTISEMENT

ఈ ఎలిమినేషన్‌కి ముందుగా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సభ్యులతో.. నాగార్జున ఈవారం రోజులలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నామినేషన్స్ ప్రక్రియలో ఒకరికోసం మరొకరు త్యాగం చేసుకోవడమనే దాని పై అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

మరీ ముఖ్యంగా మహేష్ విట్టా విషయంలో హిమజ కావాలనే అలా చేసిందా? అనే అంశం పై ఆమెని నాగార్జున ప్రశ్నించారు. అయితే అది కేవలం పొరపాటు వల్లే జరిగిందంటూ.. ఆమె సమాధానం చెప్పడం జరిగింది.

ఇక సరదాగా కాకరకాయ జ్యుస్ గురించి రాహుల్‌ని నాగార్జున అడగడంతో.. షోలో అందరూ నవ్వుకున్నారు.  ‘నీకోసం అంతలా చేస్తే.. కనీసం ఇప్పటికైనా అతని ఫ్రెండ్ షిప్‌ని అర్ధం చేసుకోమంటూ’ పునర్నవిపై సెటైర్లు వేశారు నాగ్.

అలాగే మొన్న ఇంటిసభ్యులని కలవడానికి వారి కుటుంబసభ్యులు వచ్చినా.. వారిని అందరూ కలవలేకపోయిన సంగతి తెలిసిందే. దీంతో వారి ఫోటోలని ముందు పెట్టి.. వారితో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. అప్పుడు వితిక, రవికృష్ణలు కాకుండా.. మిగతా ఇంటి సభ్యులు తమ మనసులో మాటలను తమ కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. 

ADVERTISEMENT

మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకి డబల్ ఎలిమినేషన్ అని చెప్పి.. రాహుల్ సిప్లిగంజ్‌ని బయటకి రప్పించారు. ఆ తర్వాత మరలా ఎవ్వరికీ తెలియకుండా.. లోపలికి పంపించేందుకు బిగ్ బాస్ కొత్త ప్లాన్ వేశారు. ఇదిలావుండగా.. ఈ రోజు ఎపిసోడ్‌లో నామినేషన్స్‌లో భాగంగా.. మహేష్ విట్టా & హిమజలలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు.

మరి ఇప్పుడు ఆ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది.. ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మహేష్ గనుక ఎలిమినేట్ అయితే.. బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న అతని స్థానంలో మరొకరు వస్తారు. ఇక హిమజ ఎలిమినేట్ అయితే.. ఇంటిలో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరు వెళ్ళిపోయినట్టే అవుతుంది.

Bigg Boss Telugu 3 : కుటుంబ సభ్యులని చూసి.. కంటతడి పెట్టిన హౌస్ మేట్స్

ఇక ఈ ఎపిసోడ్‌కి స్పెషల్ గెస్ట్‌గా వరుణ్ తేజ్ రావడం జరిగింది. ఆయన చేసిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’ మొన్న విడుదలై హిట్ టాక్‌తో నడుస్తోంది. ఈ తరుణంలో ఆయన స్పెషల్ గెస్ట్‌గా వచ్చి ఇంటి సభ్యులతో సందడి చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రోమోని ఇప్పటికే విడుదల చేశారు. ఆ ప్రోమోలో వరుణ్ సందేశ్‌కి ఇంట్లోని శ్రీముఖి, హిమజ, పునర్నవిలతో లవ్ ప్రపోజల్ టాస్క్ పెట్టి.. అందులో నుండి ఫన్ క్రియేట్ చేసినట్టుగా అర్ధమవుతోంది. మొత్తానికి ఈ రోజు సండే ఎపిసోడ్.. చాలా సరదాగా గడిచిపోతుందనే అనుకోవచ్చు.

ADVERTISEMENT

చివరగా నిన్నటి ఎలిమినేషన్‌లా కాకుండా.. ఈ రోజు మహేష్ విట్టా, హిమజలలో ఒకరు తప్పక బిగ్ బాస్ హౌస్ నుండి నిష్క్రమించబోతున్నారనేది  స్పష్టంగా తెలుస్తోంది. 

Bigg Boss Telugu 3 : హౌస్ మేట్స్ కోసం.. వారి కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం ..!

22 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT