Bigg Boss Telugu 3 : కుటుంబ సభ్యులని చూసి.. కంటతడి పెట్టిన హౌస్ మేట్స్

Bigg Boss Telugu 3 : కుటుంబ సభ్యులని చూసి.. కంటతడి పెట్టిన హౌస్ మేట్స్

(Bigg Boss Housemates becomes emotional after meeting their Family members)

బిగ్ బాస్ తెలుగు 'సీజన్ 3'లో భాగంగా.. ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో  హౌస్‌మేట్స్‌కు తమ కుటుంబ సభ్యులను కలిసే అరుదైన అవకాశం లభించబోతుంది. అయితే ఆ కుటుంబసభ్యులకి కూడా.. బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ టాస్క్ పూర్తి చేస్తేనే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వారిని కలిసేందుకు అనుమతిస్తారని కూడా అవగతమవుతోంది. 

Bigg Boss Telugu 3: హిమజ చేసిన పొరపాటుకు.. మహేష్ విట్టా బలయ్యాడు..!

ఇప్పటికే ప్రసారమయిన ప్రోమోలో.. తమ కుటుంబ సభ్యులను చూస్తూ.. బిగ్‌బాస్ ఇంటి సభ్యులు ఎమోషనల్‌గా ఫీలవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సుమారు 60 రోజుల తరువాత.. కంటెస్టెంట్స్ తమ ప్రియమైన కుటుంబ సభ్యులను చూడడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరి బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కి వారి కుటుంబ సభ్యులని కలిసే అవకాశం ఇస్తారా? లేదా? అనేది ఈ రోజు ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో శివజ్యోతి.. బాబా భాస్కర్‌ల మధ్య తలెత్తిన మనస్పర్ధలని వారిరువురు మాట్లాడుకుని పరిష్కరించుకోవడం జరిగింది. దానితో ఈ ఇద్దరు మళ్ళీ మునుపటిలాగే కలిసిపోయారు. అదే సమయంలో బిగ్ బాస్ 'కాలేజ్ టాస్క్ లెవెల్ 2'లో భాగంగా..  వరుణ్ సందేశ్ లెక్చరర్ హోదాలో స్టూడెంట్స్‌కి పరీక్ష నిర్వహించగా, మరో లెక్చరర్ వితిక ఒక్కొక్క స్టూడెంట్‌ని పిలిచి గాసిప్ అంటే ఏమిటి? గాసిప్‌ని సృష్టించడం ఎలా? వంటి ప్రశ్నలు అడగడంతో ఆ టాస్క్ సరదాగా సాగింది. స్టూడెంట్స్ రోల్ పోషించిన హౌస్ మేట్స్ కూడా  సరదాగా సమాధానాలు చెప్పారు. 

ఇక వరుణ్ సందేశ్ పెట్టిన పరీక్షలో.. శ్రీముఖి, రాహుల్‌కి తప్పించి మిగతా అందరికి మంచి మార్కులు రావడం గమనార్హం. అయితే వితిక అడిగిన ప్రశ్నలకు.. ఎక్కువమంది ఆమె పైనే సెటైర్లు వేశారు. ఎందుకంటే గాసిప్స్ గురించి అడగగానే ఎక్కువమంది హౌస్ మేట్స్ వితిక, వరుణ్‌ల ప్రస్తావన తీసుకొచ్చారు. అలాగే వరుణ్ సందేశ్‌ను టార్గెట్ చేస్తూ గాసిప్స్ చెప్పసాగారు.

దీంతో అనవసరంగా ఈ టాపిక్ తీసుకొచ్చానన్న భావన కలిగి.. వితిక మొహం వాడిపోయింది. అయితే పునర్నవిని మాత్రం వితిక ఇరకాటంలో పెట్టింది. 'నీకు, రాహుల్‌కి మధ్య ఉంది ప్రేమనా లేదా స్నేహమా' అని ఆమెను అడిగింది. దానికి పునర్నవి బదులిస్తూ.. ' ఇది ప్రేమ కాదు.. అలా అని స్నేహం కూడా కాదు' అంటూ ఒక సస్పెన్స్ ఆన్సర్ ఇచ్చింది.

Bigg Boss Telugu 3: హౌస్‌లో శివజ్యోతి చేత.. కన్నీళ్ళు పెట్టించిన బాబా భాస్కర్!

ఈ టాస్క్ ముగిశాక జరిగిన రెగ్జోనా టాస్క్‌లో బాబా భాస్కర్, వితికలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అలాగే మిగతా ఇంటి సభ్యులు పార్టిసిపెంట్స్‌గా రెగ్జోనా యాడ్‌కి సంబంధించి స్కిట్స్ వేశారు. ఆ స్కిట్స్‌లో హౌస్ మేట్స్ పెయిర్స్‌గా నటించాల్సి ఉండగా.. శ్రీముఖి - రవికృష్ణ, పునర్నవి - మహేష్ విట్టా , శివజ్యోతి - మహేష్ విట్టా , హిమజ - రాహుల్ సిప్లిగంజ్‌లు జంటలుగా ఏర్పడ్డారు. అయితే  రాహుల్ సిప్లిగంజ్ & పునర్నవిలు కలిసి జంటగా నటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అందుకు గల కారణాలను కూడా టెలికాస్ట్ చేయలేదు.

ఈ టాస్క్‌లో హిమజ - రాహుల్ సిప్లిగంజ్ చేసిన యాడ్ బాగుండడంతో వారికే  'బెస్ట్ పెయిర్ అవార్డు' ఇచ్చారు. ఆ తరువాత వీరిద్దరూ ఒక పాటకి డ్యాన్స్ చేయాల్సి ఉండగా.. 'చెలి' చిత్రంలో 'మనోహర' పాటకి చేసిన నృత్యం అందరిని ఆకట్టుకుంది. ఈ నృత్యం చూస్తున్నంత సేపు కూడా.. ఇంటి సభ్యులు, షో చూస్తున్న వీక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. వీరు చేసిన నృత్యాన్ని.. వారాంతంలో నాగార్జున కచ్చితంగా మెచ్చుకుంటారనే చెప్పాలి.

మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ సరదాగా సాగిపోగా.. ఈరోజు ఎపిసోడ్ మాత్రం కాస్త ఎమోషనల్‌గా సాగేలా కనిపిస్తోంది. మరి చూడాలి... బిగ్ బాస్ ఇంటి సభ్యులు తమ కుటుంబసభ్యులని కలుస్తారో లేదో!!

Bigg Boss Telugu 3: కెప్టెన్స్ టాస్క్ వల్ల.. వితిక, శివజ్యోతి, హిమజ మధ్య విభేదాలు!