home / ఫ్యాషన్
కాలేజీ అమ్మాయిల‌కు ప్రత్యేకం.. రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాషన్స్..!

కాలేజీ అమ్మాయిల‌కు ప్రత్యేకం.. రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాషన్స్..!

ర‌కుల్ ప్రీత్ (Rakul Preet).. టాలీవుడ్ ఫిట్‌నెస్ ఫ్రీక్ బ్యూటీగా గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ సంద‌ర్భానుసారంగా చ‌క్క‌టి ఫ్యాష‌న్ సెన్స్‌తో అంద‌రినీ ఆక‌ట్ట‌కుంటోంది. ముఖ్యంగా ఆమె ధ‌రించిన కొన్ని అవుట్ ఫిట్స్ కాలేజీ అమ్మాయిల‌కు బాగా న‌ప్పుతాయి. ఎందుకంటే కాలేజ్ గ‌ర్ల్స్ తాము వేసుకునే దుస్తులు.. ఇటు ఫ్యాష‌న‌బుల్‌గా క‌నిపించ‌డంతో పాటు అటు సౌక‌ర్య‌వంతంగా కూడా క‌నిపించాల‌ని ఆశిస్తారు. అదే స‌మ‌యంలో త‌మ వ‌స్త్రధార‌ణలోనే త‌మ మార్క్ కూడా అంద‌రికీ క‌నిపించేలా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఈసారి రెగ్యుల‌ర్ అవుట్ ఫిట్స్‌కు బ‌దులుగా ర‌కుల్ ఫాలో అయిన కొన్ని ఫ్యాష‌న్స్‌ను ప్ర‌య‌త్నించి చూస్తే స‌రి..

ర‌కుల్ ప్రీత్ ధ‌రించిన ఎమ‌రాల్డ్ గ్రీన్ క‌ల‌ర్ జాగ‌ర్స్ చూశారా?? ఎంత బాగుందో క‌దూ! కాలేజీ అమ్మాయిలు ఫాలో అయ్యే రెగ్యుల‌ర్ ఫ్యాష‌న్స్‌కు ఇది చ‌క్క‌ని ఎంపిక‌. బాంద్ నీ ప్రింట్ ఉన్న ఈ అవుట్ ఫిట్‌కి ఓవ‌ర్ సైజ్డ్ ష‌ర్ట్ జ‌త చేసి సింపుల్ చిక్ లుక్‌లో ఎంత అందంగా క‌నిపిస్తుందో చూడండి.

కాలేజ్ గ‌ర్ల్స్ అన‌గానే జీన్స్ త‌ప్ప‌నిస‌రిగా వార్డ్ రోబ్‌లో భాగ‌మైపోతుంది. మ‌రి, ఓవ‌ర్ కోట్ సంగతేంటి?? ష‌్ర‌గ్స్ ఉన్నాయిగా అంటారా?? నిజ‌మే కానీ.. అవి అన్నింటికీ అంత‌గా న‌ప్ప‌క‌పోవ‌చ్చు క‌దా! అందుకే మ‌న ర‌కుల్ ప్రీత్ ఫాలో అయిన‌ట్లు ప్ర‌కాశ‌వంత‌మైన రంగులో ఉన్న ఓవ‌ర్ కోట్స్ రెండు కొనుక్కుంటే స‌రి! పూర్తిగా విరుద్ధ‌మైన క‌ల‌ర్ కాంబినేష‌న్‌లో ఈ కోట్‌ని ధ‌రిస్తే ఎంత ట్రెండీగా క‌నిపిస్తామో ర‌కుల్‌ని చూస్తే మ‌న‌కు ఇట్టే అర్థ‌మైపోతోంది క‌దూ!

వైట్ అండ్ బ్లూ.. చ‌క్క‌టి క్లాసీ కాంబినేష‌న్. సాధార‌ణంగా ఈ కాంబోని త‌లుచుకోగానే చాలామందికి తెలుపు రంగు టాప్ లేదా టీష‌ర్ట్, బ్లూ క‌ల‌ర్ జీన్ క‌ళ్ల ముందు మెదులుతూ ఉంటాయి. కానీ ఎప్పుడూ అవే వేసుకోవాలంటే బోర్ క‌దా! అందుకే ఈసారి ఈ కాంబినేష‌న్‌ని కాస్త భిన్నంగా ధ‌రించ‌డానికి ట్రై చేయండి. లేస్ వ‌ర్క్ ఉన్న తెలుపు రంగు టీష‌ర్ట్ లేదా ట్యాంక్ టాప్‌కు బ్లూ క‌ల‌ర్ ప్లెయిన్ బాట‌మ్ లేదా ప్యాంట్ జ‌త చేసి చూడండి. సింపుల్‌గా స్టైలిష్ లుక్‌తో మెరిసిపోవాల్సిందే! ఇక దీనికి జ‌త‌గా చిన్న స్ట‌డ్స్, ఆకర్ష‌ణీయ‌మైన స్నీక‌ర్స్ వేసుకున్నారంటే మీ లుక్ కంప్లీట్ అయిన‌ట్లే! మ‌న ర‌కుల్‌ని చూస్తే మీరు ఇది నిజ‌మే అంటారు మ‌రి!

కాలేజీ అమ్మాయిలు ఎక్కువ‌గా ఎంపిక చేసుకునే ట్రెండ్స్‌లో జంప్ సూట్ కూడా ఒక‌టి. ఇది కొన్ని సంవ‌త్స‌రాల క్రితం వ‌చ్చిన ట్రెండ్ అయిన‌ప్ప‌టికీ భిన్న‌మైన క‌ల‌ర్స్ ధ‌రించ‌డం ద్వారా ప్ర‌త్యేక‌మైన లుక్ సొంతం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు ఈత‌రం అమ్మాయిలు. ర‌కుల్ కూడా అదే సూత్రాన్ని ఫాలో అయింది. ప్లెయిన్ పింక్ క‌ల‌ర్ జంప్ సూట్‌లో ఎంత అందంగా క‌నిపిస్తుందో చూడండి.

రెగ్యుల‌ర్ ఫ్యాష‌న్స్ అన్నీ ఒక ఎత్తైతే; పార్టీలు, ఫంక్ష‌న్లు వంటి ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో కాలేజీ అమ్మాయిలు ధ‌రించే అవుట్ ఫిట్స్ మ‌రొక ఎత్తు. ముఖ్యంగా సాయంత్రం స‌మ‌యాల్లో జ‌రిగే ఇలాంటి వేడుక‌ల‌ప్పుడు మ‌న ర‌కుల్ ధ‌రించిన ఈవెనింగ్ గౌన్ చ‌క్క‌టి ఎంపిక‌. ఈ మెరూన్ క‌ల‌ర్ డ్రేప్డ్ క‌ట్ అవుట్ డీటైల్డ్ ఈవెనింగ్ గౌన్‌లో ర‌కుల్ స్టైల్ క్వీన్‌ని త‌ల‌పిస్తోంది క‌దూ!

ఇవి కూడా చ‌దవండి

ఆఫీసులో స్టైల్‌ గా మెరిసిపోవాలంటే .. ఈ ఫ్యాషన్ ఫాలో అవ్వాల్సిందే..!

స్టైలిష్‌గా క‌నిపించాలంటే.. ఈ బేసిక్ ఫ్యాష‌న్ రూల్స్ ఫాలో కావాల్సిందే!

స్టైలిష్‌గా క‌నిపించాలా?? అయితే ఈ టాలీవుడ్ హీరోయిన్స్‌ని ఫాలో అవ్వండి!

23 Jan 2019
good points

Read More

read more articles like this