సంక్రాంతి పండగ వస్తే తెలుగు లోగిళ్లన్నీ సంతోషంతో నిండిపోతాయి. ఆ ఆనందమంతా ఇంటి ముంగిట్లోనే తెలిసిపోతుంది. చక్కగా కల్లాపి జల్లి.. ముగ్గు వేసి అందులో రంగులు నింపి వాకిలిని అందంగా తయారుచేస్తారు అమ్మాయిలు. సంక్రాంతి పండగ సమయంలోనే కాదు.. అంతకు నెల రోజుల ముందు నుంచి ముగ్గుల హడావుడి మొదలవుతుంది. ఒకరితో ఒకరు పోటీపడి మరీ పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. వాటిలో గొబ్బెమ్మలు పెట్టి గుమ్మడి పూలతో అలంకరిస్తారు. నా చిన్నతనంలో అయితే దినపత్రికల్లో వచ్చే ముగ్గులను కత్తిరించి పుస్తకాల్లో దాచుకొనేవాళ్లం. ముగ్గుల పుస్తకాలు కొనుక్కొని మరీ ముగ్గులు వేసేవాళ్లం. పైగా సంక్రాంతి పండక్కి ముగ్గుల పోటీలు జరుగుతాయి. అందులోనూ నువ్వా నేనా అంటూ పోటీ పడతారు అతివలు.
రంగురంగుల ముగ్గులతో నిండిన వాకిలి ఎంత అందంగా ఉంటుంది. ఒకప్పుడు సంక్రాంతి నెలలో చుక్కల ముగ్గులు, ఆ నెలలో మాత్రమే పెట్టే ప్రత్యేకమైన ముగ్గులు వేసేవారు. ఇప్పుడు ఆ ముగ్గులు కూడా మోడ్రన్ హంగులు అద్దుకొన్నాయి. అద్భుతమైన డిజైన్లు.. రంగుల మేళవింపుతో లోగిలిని అందంగా మార్చేస్తున్నారు. అలాంటి కొన్ని విభిన్నమైన డిజైన్లు మీకోసం..
పూరెక్కల సోయగం..
Image: Rani’s Rangolis Facebook
ముగ్గులో ముద్ద బంతి పూలు పెడితే రంగులు లేకపోయినా.. నిండుగా కనిపిస్తుంది. అలాంటిది ముగ్గునే పూలతో తీర్చిదిద్దితే ఎంత అందంగా ఉందో మీరే చూడండి.
ఇది నెమలిసోయగం..
Image: KOLAM.Shanthi Sridharan Facebook
పురివిప్పి ఆడిన నెమలిని చూస్తే మనసు ఎంత పులకరించిపోతుందో..అదే నెమలిని మన ముంగిట్లో ముగ్గుగా వేస్తే అంతకు మించిన అనుభూతి కలుగుతుంది.
వర్ణ మిశ్రమం..
Image: Radiant Rangoli Facebook
రంగుల ముగ్గులతో వాకిలి నింపేస్తే ఎంతో నిండుగా ఉంటుంది. ఈ డిజైన్లు చూడండి.. మీ లోగిలికి సరికొత్త కళను తీసుకొస్తాయి.
లతల హరివిల్లు
Image: KOLAM.Shanthi Sridharan Facebook
అందమైన రంగు రంగుల పూలతలను ముంగిట్లో రంగవల్లికలా తీర్చిదిద్దితే ఎలా ఉంటుందో ఈ ముగ్గు మనకు చెప్పకనే చెబుతుంది కదా..!
రంగు రంగుల ఏనుగిది..
Image: Radiant Rangoli Facebook
ఈ ముగ్గు చూడండి.. ఎంత చూడముచ్చటగా ఉందో.. మధ్యలో ఏనుగు.. దాని చుట్టూ తీర్చిదిద్దిన ప్యాట్రన్స్ ఎంతో అందంగా ఉన్నాయి కదా
Feature Image: Shutterstock
ఇవి కూడా చదవండి
సంక్రాంతి ఫ్యాషన్: మీరు మెచ్చే 25 రకాల కుర్తా డిజైన్లు ఇవి..
సంబరాల సంక్రాంతి టాలీవుడ్ పరిశ్రమకు ఎలాంటి విజయాలు అందిస్తుంది..?
హైదరాబాద్ కీర్తిని జగద్విఖ్యాతం చేసే.. పతంగుల పండగ & మిఠాయిల వేడుక..!