ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఏమయ్యా వార్నర్.. మా తెలుగు వారి దోశ రుచి చూస్తావేంటి?

ఏమయ్యా వార్నర్.. మా తెలుగు వారి దోశ రుచి చూస్తావేంటి?

చక్కటి మాటతీరు, అందమైన చిరునవ్వు, ఆకట్టుకొనే సెన్సాఫ్ హ్యూమర్, అదిరిపోయే పంచ్‌లు.. బుల్లి తెర ద్వారా ప్రతి తెలుగింటి ఆడపడుచుగా మారిన వ్యాఖ్యాత సుమ కనకాల( Suma Kanakala). టీవీ షోలు, ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది సుమ.

డేవిడ్ వార్నర్ (David Warner) క్రీజులోకి అడుగుపెట్టాడంటే పరుగుల వరద పారాల్సిందే. బ్యాట్ ఝుళిపించాడంటే బంతి బౌండరీ దాటాల్సిందే. ఐపీఎల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా సగటు తెలుగు క్రికెట్ ప్రేమికుల అభిమానాన్ని చూరగొన్నాడు.

ఎప్పుడూ క్రికెట్.. క్రికెట్.. అంటూ తిరిగే వార్నర్.. తన మాటలతో అందరినీ కట్టిపడేసే సుమ.. ఇద్దరూ ఒక్క చోట చేరితే…? అసలు అలా జరగడం సాధ్యమేనా? ఆ ఆలోచనే వద్దు. ఎందుకంటే వీరిద్దరూ ఒకరినొకరు కలుసుకోవడం మాత్రమే కాదు.. కాసేపు సరదాగా కబుర్లు కూడా చెప్పుకొన్నారు. ఆ తర్వాత సుమ దోశలు వేసి ఆప్యాయంగా వార్నర్‌కి తినిపించారు. గారెలు చేసి పెట్టారు.

ఎక్కడి వార్నర్? ఎక్కడి సుమ? వీళ్లిద్దరికీ ఇలా సరదాగా కబుర్లు చెప్పుకొనేంత తీరిక ఎక్కడిది? అనుకొంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఇద్దరూ టీవీ కమర్షియల్ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. వీరితో పాటు బౌలర్ భువనేశ్వర్ కుమార్ సైతం ఈ ప్రకటనలో నటించారు. అప్పడు తీసినవే ఈ ఫొటోలు. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

ADVERTISEMENT

ఈ ఫొటోలు తెలుగు వారిని ఆకట్టుకోవడం మాత్రమే కాదు.. వారిలోని హాస్యచతురతని బయటకు తీశాయి. సోషల్ మీడియాలో తమదైన స్టైల్లో ఫన్నీ కామెంట్లు, మీమ్స్ పెడుతున్నారు. అవి కూడా సుమ పంచ్‌ల్లానే బాగా పేలాయి. వాటిలో కొన్ని మీకోసం..

తన ఫేస్బుక్ ఖాతాలో వార్నర్, భువీతో కలసి ఉన్న ఫొటోను సుమ పోస్ట్ చేశారు. దానికి సైతం కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పోస్ట్ చేశారు.

1-suma-warner-tvc

క్రికెటర్స్‌కి ఏం పంచ్ వేశారండీ.. అలా నవ్వుతున్నారు.

ADVERTISEMENT

వరల్డ్ కప్ కామెంటరీ.. ఛాన్స్ కొట్టేశావ్ అక్కా..

సుమక్క పంచ్‌లకు వార్నర్ అవుట్..

అక్కా ఏం చేస్తారో తెలీదు.. ఐపీఎల్ అయ్యేసరికి వీళ్లందరూ మీ అంత బాగా తెలుగు మాట్లాడాలి.

డేవిడ్ వార్నర్ సుమక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఇక మనకి తిరుగు లేదు.

ADVERTISEMENT

వేరెవర్ యు గో సుమ, ఫన్ ఫాలోస్ యు

అక్కడి సిచ్యువేషన్ చూస్తుంటే.. వార్నర్‌కి కౌంటర్ పడినట్లుంది.

Also Read: ఇలాంటి చిత్ర‌విచిత్ర‌మైన వ్యక్తులు.. మీకూ మార్కెట్లో ఎదుర‌య్యారా?

ఈ ఫన్నీ ఫీలింగ్స్.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక.. మీకూ వచ్చాయా..?

ADVERTISEMENT

బద్ధకస్తుల కోసం… బహు చక్కని జాబ్ ఆఫర్స్ ఇవే..!

20 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT