ADVERTISEMENT
home / DIY Life Hacks
ఇలా చేస్తే మీ ఫోన్.. చాలా తొందరగా ఛార్జింగ్ అవుతుంది..!

ఇలా చేస్తే మీ ఫోన్.. చాలా తొందరగా ఛార్జింగ్ అవుతుంది..!

మొబైల్ (mobile).. ప్రస్తుతం అన్ని పనులకు ఇది అత్యవసరంగా మారిపోయింది. ఒకప్పుడు కాల్స్ చేయడానికి మాత్రమే అవసరమైన ఫోన్ ఇప్పుడు కాంటాక్ట్స్, క్యాలెండర్, టార్చ్ వంటి బేసిక్ అవసరాలను తీర్చేస్తోంది.  స్మార్ట్ ఫోన్ యాప్స్ పుణ్యమా అని ప్రతి పనీ చిటికెలో అయిపోతోంది. నేడు వార్తలు చదవడం నుంచి బ్యాంకింగ్ వరకూ.. ఫుడ్ డెలివరీ నుంచి ఫిట్ నెస్ వరకూ ప్రతిఒక్కటీ ఫోన్లోనే అందుబాటులో ఉంటోంది. 

ఇక సోషల్ మీడియా కూడా యాప్స్ రూపంలో సేవలు అందివ్వడంతో.. దీని వాడకం రోజురోజుకీ పెరిగిపోతుంది. అందుకే ఇప్పుడు చేతిలో ఫోన్ లేనివారు ఎవరూ కనిపించడం లేదు. అయితే ఇలా ఫోన్ వాడకం పెరిగిపోవడం వల్ల బ్యాటరీ ఎక్కువ సమయం ఉండకపోవడం అనేది.. ప్రతిఒక్కరూ ఎదుర్కొనే సమస్యగా మారిపోతోంది.

పవర్ బ్యాంక్ వెంట తీసుకెళ్లడం.. కంప్యూటర్‌కి ఛార్జింగ్ పెట్టుకోవడం వంటివి చేస్తూ చాలామంది బ్యాటరీని ఎక్కువ సమయం పాటు కొనసాగిస్తారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. బ్యాటరీ ఛార్జింగ్ తక్కువ సమయంలోనే జరుగుతుంది. దీనివల్ల మొబైల్ ఛార్జింగ్ (Charging) ఎక్కువ సమయం పాటు ఉండే అవకాశం కూడా ఉంటుంది. 

charge3

1. ఫ్లైట్ మోడ్‌లో ..

ఛార్జింగ్ పెట్టినప్పుడు సాధారణంగా ఫోన్ ఉపయోగించం. అయితే రాత్రి సమయం లేదా మీకు అర్జంట్‌గా వచ్చే కాల్స్ ఏవీ లేవు అనుకుంటే మాత్రం.. ఫోన్‌ని ఫ్లైట్ మోడ్‌లో ఉంచడం మంచిది. దీని వల్ల ఇంటర్నెట్, జీపీఎస్, ఫోన్.. వంటివి మాత్రమే ఆఫ్ అవుతాయి. కావాలంటే వైఫై ఉపయోగించవచ్చు. ఫ్లైట్ మోడ్‌లో పెట్టడం వల్ల మామూలు వేగం కంటే రెట్టింపు స్పీడ్‌తో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

ADVERTISEMENT

2. స్క్రీన్ లాక్

సాధారణంగా ఫోన్ ఛార్జింగ్‌కి పెట్టిన తర్వాత కూడా.. చాలామంది దాన్ని అలా వదిలేస్తూ ఉంటారు. అయితే వెనుక బ్యాక్ గ్రౌండ్‌లో కొన్ని యాప్స్ రన్ అవుతూ ఉంటాయి. వీటిని ఆఫ్ చేయడం కోసం క్యాచీలు మొత్తం క్లియర్ చేసి.. ఫోన్‌ని స్క్రీన్ లాక్ చేయాలి. ఆ తర్వాత దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల ఫోన్ ఛార్జింగ్ వేగంగా అవుతుందని మొబైల్ ఎక్స్ పర్ట్స్ చెబుతుంటారు.

charge1

3. ఒరిజినల్ ఛార్జర్

చాలామంది మిగిలిన అన్ని రకాల టిప్స్ పాటిస్తున్నా ఫోన్ ఛార్జింగ్ వేగంగా కాకపోవడం గమనించవచ్చు. దీనికి కారణం వాళ్లు తమ ఫోన్‌తో పాటు వచ్చిన ఒరిజినల్ ఛార్జర్‌ని ఉపయోగించకపోవడమే. ఎందుకంటే మీ ఫోన్‌కి అన్ని రకాల ఛార్జర్లు సెట్ కాకపోవచ్చు.

మల్టీ టిప్ ఉంది కదా.. ఎక్కడికి వెళ్లినా ఉపయోగపడుతుంది కదా అని చాలామంది వేరే ఛార్జర్లతో ఛార్జ్ చేస్తుంటారు. కానీ ఫోన్‌తో పాటు వచ్చిన ఛార్జర్‌తో మాత్రమే మీ మొబైల్ వేగంగా ఛార్జ్ అవుతుంది. ఒకవేళ మీ ఫోన్‌తో పాటు వచ్చిన ఛార్జర్ పాడైతే మీ ఫోన్ ఏ కంపెనీదో.. ఆ కంపెనీకి చెందిన ఒరిజినల్ క్వాలిటీ ఛార్జర్ ఎంచుకోవడం వల్ల ఫోన్ త్వరగా ఛార్జ్ అయ్యే వీలుంటుంది.

4. స్విచ్ఛాఫ్ చేయండి.

ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్‌ని స్విచ్ఛాఫ్ చేసి పెట్టడం వల్ల.. మిగిలిన అన్ని పద్ధతుల కంటే వేగంగా ఛార్జింగ్ అవుతుంది. మీకు వచ్చే ముఖ్యమైన కాల్స్ ఏవీ లేకపోతే ఈ పద్ధతిని ప్రయత్నించడం మంచిది.

ADVERTISEMENT

charge2

5. యాప్స్‌ని మూసేయండి..

ఫోన్ వేగంగా ఛార్జింగ్ కావాలంటే ముందుగా అందులో ఉన్న యాప్స్ అన్నింటినీ క్లోజ్ చేసి అప్పుడు ఛార్జింగ్ పెట్టడం మంచిది. అంతేకాదు.. వైఫై, బ్లూటూత్, జీపీఎస్, గూగుల్ ప్లే వంటివన్నీ ఆన్‌లో ఉంటే వాటిని ఆఫ్ చేయడం మంచిది.

ఈ చిట్కాలన్నీ పాటిస్తే మీ ఫోన్ చాలా వేగంగా ఛార్జింగ్ అవుతుంది. చాలామంది ఫోన్‌ని ఛార్జింగ్ పెట్టి దాన్ని ఉపయోగిస్తుంటారు. కానీ అది సరికాదు. దీని వల్ల ఛార్జింగ్ చాలా నెమ్మదిగా అవ్వడంతో పాటు ఫోన్ పేలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. దీనిని మనం చాలాసార్లు మన చుట్టూ జరిగే సంఘటనలు లేదా వినిపించే వార్తల్లో గమనిస్తూనే ఉంటాం. కాబట్టి ఇలా చేయడం మానేస్తే మంచిది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ

కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి.

వాట్సాప్ సంభాషణలు.. స్క్రీన్ షాట్ తీసుకోవడం అలవాటా? అయితే ఇకపై కష్టమే ..!

టిక్ టాక్ (Tik Tok) వీడియోలతో ఆకట్టుకుంటోన్న కథానాయికలు వీరే..

మ‌నుషులు దూరంగా ఉన్నా.. ఈ యాప్స్ తో మీ బంధం దృఢంగా ఉంటుంది..

ADVERTISEMENT
02 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT