home / లైఫ్ స్టైల్
ముద్దులోనూ ఎన్నో ర‌కాలున్నాయి.. వాటి అర్థాలేంటో మీకు తెలుసా? (Types Of Kisses And Importance Of Kissing)

ముద్దులోనూ ఎన్నో ర‌కాలున్నాయి.. వాటి అర్థాలేంటో మీకు తెలుసా? (Types Of Kisses And Importance Of Kissing)

రొమాన్స్‌(Romance)లో అంద‌రికీ ఎంతో ఇష్ట‌మైనది న‌చ్చిన వారిని ముద్దు పెట్టుకోవ‌డం(Kissing). ముద్దంటే చిన్న‌పిల్ల‌ల నుంచి పెద్ద‌వారి వ‌ర‌కూ ప్ర‌తి ఒక్క‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. ఇక ప్రేమ‌లో ఉన్న‌వారు.. పెళ్ల‌యిన ఆలుమగలు ముద్దు(kiss)ని ఎంత‌గా ఇష్ట‌ప‌డ‌తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తొలిముద్దు, అంద‌రూ ఉన్న‌ప్పుడు ఎవ‌రికీ క‌నిపించ‌కుండా పెట్టుకున్న ముద్దు, మొద‌టి గాఢ‌మైన ముద్దు.. ఇలా ప్ర‌తి ఒక్క‌టీ ప్ర‌త్యేక‌మైందే. ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా.. మీ బంధాన్ని మ‌రింత ప్ర‌త్యేకంగా మార్చేదిగా ముద్దు ఉంటుదంటే అతిశ‌యోక్తి కాదు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రినీ ముద్దు పెట్టుకోని వారైనా.. లేక పెళ్ల‌యి బెడ్‌రూంలో మ‌రింత రొమాన్స్ కోసం వేచిచూస్తున్న వారైనా మీరు ట్రై చేయ‌డానికి వీలున్న వివిధ ర‌కాల ముద్దుల గురించి మేం చెబుతాం. ఈ ముద్దుల‌న్నీ మేం రిక‌మండ్ చేస్తున్న‌వే. జీవితంలో క‌నీసం ఒక్క‌సారైనా ప్ర‌య‌త్నించాల్సిన‌వే. వీటితో పాటు ముద్దు పెట్టుకునే స‌మ‌యంలో చేయాల్సిన‌వి, చేయకూడ‌నివి.. మీ భాగ‌స్వామి మ‌న‌సును దోచే ముద్దు గురించి అన్ని విశేషాలు తెలుసుకుంటే మీరూ “ముక్కుపై ముద్దు పెట్టు.. ముక్కెరైపోయేట్టు అంటూ పాడుకుంటూ..” ఒక‌రికొక‌రు ముద్దులు పెట్టుకుంటూ ఆనందంగా గ‌డిపే వీలుంటుంది.

ముద్దు మీ బంధానికి ఎందుకు ముఖ్యం  

ముద్దులోని ర‌కాలు  

ముద్దు పెట్టుకునేట‌ప్పుడు ఇవి గుర్తుంచుకోండి  

kiss3

ముద్దు మీ బంధానికి ఎందుకు ముఖ్యం (Why Kissing Is Important) 

ఎలాంటి బంధంలోనైనా ఎదుటివారికి ప్రేమ‌ను వెల్ల‌డించేందుకు ముద్దు చాలా ముఖ్య‌మైన‌ది. ఎదుటివ్య‌క్తిపై మ‌న‌కి ప్రేమ ఉంద‌ని.. వారు మ‌న‌కి ఎంతో అవ‌స‌రం అని చెప్పేందుకు ఇది చ‌క్క‌టి మార్గం. అయితే ఇది కేవ‌లం ఫీలింగ్స్ గురించో లేక వాటి వ్య‌క్తీక‌ర‌ణ గురించో మాత్ర‌మే కాదు. ఇలా ముద్దులు పెట్ట‌డం వ‌ల్ల మాన‌సికంగా, శారీర‌కంగా ఎన్నో ప్ర‌యోజ‌నాలు అంద‌డంతో పాటు మీ బంధం కూడా మరింత బ‌ల‌ప‌డుతుంది. అవేంటంటే..

లైంగిక ప‌టుత్వం పెరుగుతుంది (Sexuality Increases)

మంచి గాఢమైన ముద్దు కేవ‌లం ఆనందాన్ని అందించ‌డ‌మే కాదు.. అంత‌కుమించి ప్ర‌యోజ‌నాన్ని కూడా క‌లిగిస్తుంది. ముద్దు పెట్టుకున్న‌ప్పుడు టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ విడుద‌ల‌వుతుంది. ఇది మ‌న లైంగిక ప‌టుత్వాన్ని, కోరిక‌ల‌ను మ‌రింత పెంచుతుంది. అందుకే ముద్దు పెట్టుకోవ‌డం లైంగికంగా ద‌గ్గ‌ర‌య్యేందుకు కూడా చాలా ముఖ్య‌మ‌న్న‌మాట‌.

kiss7

శృంగార జీవితానికి ప్రతీక‌.. (Symbolize Romance)

చాలామంది అమ్మాయిలు.. ఒక అబ్బాయితో శృంగారంలో పాల్గొనాలా? వ‌ద్దా? అన్న విష‌యాన్ని నిర్ణ‌యించుకునేందుకు వారు ఎలా ముద్దు పెడుతున్నార‌న్న విష‌యాన్ని ఆధారంగా తీసుకుంటార‌ట‌. మీ ఇద్ద‌రి మ‌ధ్య లైంగికంగా ఒకే ర‌క‌మైన ఫీలింగ్స్ ఉన్నాయా? లేదా? అన్న విష‌యం దీని ఆధారంగానే తెలుస్తుంది. ఒక వ్య‌క్తిని మీరు ముద్దు పెట్టుకున్న‌ప్పుడు మీకు అది అంత‌గా న‌చ్చిన‌ట్లు అనిపించ‌క‌పోతే అత‌డితో మీ శృంగార జీవితం కూడా బాగోదు అన్న‌ట్లేన‌ని కొన్ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

క‌మ్యూనికేష‌న్ పెంచుతుంది.. (Improves Communication) 

ఒక్కోసారి మాట‌ల్లో చెప్ప‌లేని భావాల‌న్నింటినీ ముద్దు ద్వారా చెప్పే వీలుంటుంది. అందుకే మ‌న‌సులోని భావాల‌ను ముద్దు ద్వారా బ‌య‌ట‌పెట్టండి. మీ భాగ‌స్వామిపై చెప్ప‌లేనంత ప్రేమ‌ను వెల్ల‌డించాలా? ముద్దు పెట్టండి. గొడ‌వ త‌ర్వాత క‌లిసిపోవాలా? ఓ ముద్దుతో ప్రారంభించండి. సారీ చెప్పాలా? దాన్ని కూడా ముద్దుతో ప్రారంభించండి.

భావోద్వేగాలు పెంచుతుంది (Enhacnes Emotions)

ఆక్సిటోసిన్‌, డోప‌మైన్‌, సెరటోనిన్ వంటివి హార్మోన్లు మ‌న శ‌రీరంలో భావోద్వేగాల‌ను క‌లిగిస్తాయి. ఆనందాన్ని పెంచుతాయి. ముద్దు పెట్టుకున్న‌ప్పుడు ఈ హార్మోన్లు చాలా ఎక్కువ‌గా విడుద‌ల‌వుతాయి. అందుకే ఒక్క ముద్దు మ‌న‌కు ఎంతో సంతృప్తిని అందిస్తుంది. ముద్దు త‌ర్వాత ఇలాంటి హార్మోన్లు ఎక్కువ‌గా విడుద‌లయ్యేది శృంగారంలోనే..

ఒత్తిడిని త‌గ్గిస్తుంది (Reduce Stress)

మ‌న శ‌రీరం ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ విడుద‌ల చేస్తుంది. ఇది శ‌రీరంలో ఎన్నో స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంది. అయితే ముద్దు పెట్టుకునేటప్పుడు విడుద‌ల‌య్యే హ్యాపీ హార్మోన్లు కార్టిసాల్ విడుద‌ల‌ను త‌గ్గిస్తాయి. దీంతో ఒత్తిడి కూడా దూర‌మ‌వుతుంది. అందుకే రోజంతా ఆఫీస్‌లో ఎంతో క‌ష్ట‌ప‌డి, ఒత్తిడితో ప‌నిచేసి ఇంటికొచ్చాక భాగ‌స్వామిని ద‌గ్గ‌రకు తీసుకొని ఓ కౌగిలి, ముద్దు ఇచ్చేస్తే ఒత్తిడి ఆటోమేటిక్‌గా త‌గ్గిపోతుంది.

kiss4

ఇద్ద‌రినీ ద‌గ్గ‌ర‌ చేస్తుంది (Brings You Closer)

ఇంత‌కుముందే చెప్పుకున్న‌ట్లు.. ముద్దు పెట్టుకోవ‌డం వ‌ల్ల హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. ఈ హార్మోన్లు ఎదుటివారిపై ప్రేమ‌, ద‌గ్గ‌రిత‌నాన్ని పెంచుతాయి. అందుకే త‌ర‌చూ ముద్దు పెట్టుకునే జంట‌లు గొడ‌వ‌లు త‌క్కువ ప‌డుతుంటార‌ట‌.. ఎక్కువ కాలం బంధాన్ని కొన‌సాగించేందుకు కూడా ముద్దు ఓ మంచి మార్గం.

ఆత్మ‌విశ్వాసం పెంచుతుంది (Increases Confidence)

ఒత్తిడి వ‌ల్ల కార్టిసాల్ హార్మోన్ విడుద‌ల‌వుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే. కార్టిసాల్ ఎక్కువ‌గా విడుద‌ల‌వ‌డం వ‌ల్ల మ‌న‌పై మ‌న‌కు న‌మ్మ‌కం లేకుండా పోతుంది. మ‌న‌మేమీ చేయ‌లేనివాళ్ల‌మ‌ని భావించేలా చేస్తుంది. అయితే ముద్దు పెట్టుకోవ‌డం, శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల కార్టిసాల్ విడుద‌ల త‌గ్గ‌డం వ‌ల్ల మ‌న‌లో  ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది.

ర‌క్త‌పోటు త‌గ్గిస్తుంది.. (Reduces Blood Pressure)

ఒక‌రిని మ‌నం ఘాఢంగా ముద్దుపెట్టుకున్న‌ప్పుడు మ‌న గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంది. అయితే ఆశ్చ‌ర్యంగా గుండెవేగం పెరిగినా.. ఇది రక్తానాళాల‌ను వెడల్పుగా మార్చ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు త‌గ్గుతుంది. అంటే ముద్దు గుండెకు కూడా చాలా మంచిద‌న్న‌మాట‌.

స‌మ‌స్య‌లు మ‌ర్చిపోయేలా చేస్తుంది.. (Makes You Forget Your Problems)

రోజువారీ ప‌నుల ఒత్తిడిలో ప‌డిపోయి మ‌నం ఒక‌రితో ఒక‌రు స‌మ‌యం గ‌డిపేందుకు కూడా ఆలోచించం. కానీ రోజూ ముద్దు కోసం కొన్ని నిమిషాలైనా గ‌డ‌ప‌డం వ‌ల్ల రోజువారీ జీవితంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను కాసేపు మ‌ర్చిపోయే అవ‌కాశం ఉంటుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా రోజూ భాగ‌స్వామితో ఓ ప‌ది నిమిషాలు ప్రేమ‌గా మాట్లాడ‌డం ముద్దు పెట్టుకోవ‌డం మాత్రం మ‌ర్చిపోవ‌ద్దు.

త‌ల‌నొప్పి త‌గ్గిస్తుంది (Reduces Headaches)

ముద్దు వ‌ల్ల వ‌చ్చే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చెప్ప‌లేన‌న్ని. అందులో ఒక‌టి.. ముద్దు పెట్టుకోవ‌డం వ‌ల్ల ర‌క్తనాళాలు వెడ‌ల్పుగా మారి తిమ్మిర్లు త‌గ్గే వీలుంటుంది. అలాగే నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే నొప్పులు కూడా త‌గ్గుతాయి. ముద్దు వ‌ల్ల ఒత్తిడి త‌గ్గ‌డంతో పాటు విడుద‌ల‌య్యే హార్మోన్ల వ‌ల్ల త‌ల‌నొప్పి కూడా త‌గ్గుతుంద‌ట‌. అందుకే ఈసారి మీకు త‌ల‌నొప్పి వ‌స్తే వెంట‌నే మాత్ర వేసుకోకుండా మీ భాగ‌స్వామితో ఓ పది నిమిషాలు ముద్దుల్లో మునిగిపోండి. త‌ల‌నొప్పి హుష్‌కాకి అవుతుంది. నెల‌స‌రిలోనూ ముద్దుల‌తో నొప్పిని త‌గ్గించుకోండి.

kiss6

రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుతుంది (Improves Immunity)

చెబితే కాస్త చిరాగ్గా అనిపించ‌వ‌చ్చు కానీ ముద్దు పెట్టుకునే స‌మ‌యంలో ఒకరి నోట్లోని లాలాజలం మ‌రొక‌రి నోట్లోకి వెళ్ల‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలోకి కొత్త బ్యాక్టీరియా ప్ర‌వేశిస్తుంది. ఇది ఆయా బ్యాక్టీరియా నుంచి కాపాడేలా మ‌న శ‌రీరం యాంటీబాడీల‌ను సిద్ధం చేసుకునేలా చేసి మ‌న రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.

ముఖం కండ‌రాల‌కు వ్యాయామంలా ప‌నిచేస్తుంది (Good Workout For Face)

అదేదో సినిమాలో చెప్పిన‌ట్లు ముద్దు మ‌న‌కు నిజంగానే వ్యాయామంగా ప‌నిచేస్తుంది. ముద్దు పెట్టుకుంటున్న‌ప్పుడు మ‌నం ముఖంపై రెండు నుంచి 34 కండ‌రాలు క‌దులుతాయి. అందుకే ఇది మ‌న ముఖానికి మంచి వ్యాయామంగా ప‌నిచేస్తుంది.

క్యాల‌రీల‌ను క‌రిగిస్తుంది (Burns Calories)

చాలామంది ప్ర‌తి ప‌ని చేసేందుకు దానివ‌ల్ల క‌రిగే క్యాల‌రీల గురించి ఆలోచిస్తుంటారు. ఇలాంటివారు ముద్దును ప్ర‌య‌త్నించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ముద్దు పెట్టుకోవ‌డం వ‌ల్ల ముఖానికి మంచి వ్యాయామం అందుతుంది. కాబ‌ట్టి దీనివ‌ల్ల ఒక్క‌సారికి 26 క్యాల‌రీలు క‌రుగుతాయ‌ట‌.

పంటిపిప్పిని త‌గ్గిస్తుంది (Reduces Tooth Ache)

ముద్దు పెట్టుకోవ‌డం వ‌ల్ల మ‌న నోట్లోని లాలాజల గ్రంథులు ప్రేరేపిత‌మై ఎక్కువ‌గా లాలాజ‌లాన్ని విడుద‌ల చేస్తాయి. ఇది నోట్లో ఎక్కువ త‌డి ఉండేలా చేసి మ‌నం తినే ఆహారం ప‌ళ్ల‌కు అంటుకోకుండా చేస్తుంది. దీనివ‌ల్ల పిప్పి ప‌ళ్ల స‌మ‌స్య లేకుండా కాపాడుకోవ‌చ్చు.

ముద్దులోని ర‌కాలు (Types Of Kisses)

ప్ర‌పంచంలోని వివిధ ర‌కాల ప్ర‌జ‌లు విభిన్నంగా మాట్లాడ‌డ‌మే కాదు.. వారు ముద్దు పెట్టుకునే తీరు కూడా భిన్నంగా ఉంటుంద‌ట‌. ముద్దు పెట్టుకునే ర‌కాల్లో కొన్ని మ‌న‌కు తెలిసిన‌వి. మ‌రికొన్ని మ‌న‌కు తెలియ‌న‌వి. అయితే మీరు ముద్దు పెట్టుకునే ప‌ద్ధ‌తికి ఓ అర్థం ఉంద‌ని మీకు తెలుసా? అవును. ప్ర‌పంచంలో అంద‌రికీ తెలిసిన ముద్దు ర‌కాలు 21. వాటికి అర్థాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..

kiss8

ఎస్కిమో కిస్‌ (Eskimo Kiss)

మంచు ప్రాంతంలో ఉండే ఎస్కిమోల ద‌గ్గ‌ర్నుంచి పుట్టిన ముద్దు ఇది. ఇది నిజానికి ముద్దు కాదు. మీ భాగ‌స్వామి ముక్కుని, మీ ముక్కుకి ఆనించి అటు, ఇటు తిప్ప‌డ‌మే ఈ ముద్దు. ఇది గాఢమైన ముద్దుల్లో ఒక‌టి కాక‌పోయినా కొత్త‌ల్లో శృంగారాన్ని ప్రారంభించేందుకు, ఇద్ద‌రి మ‌ధ్యా ఉన్న బ‌ల‌మైన ప్రేమ‌ను, ఆనందాన్ని పంచుకునేందుకు ఇది చ‌క్క‌టి ఎంపిక‌.

ఫ్రెంచ్ కిస్‌ (French Kiss)

ముద్దు పెట్టేట‌ప్పుడు ఒక వ్య‌క్తి నాలుక మ‌రో వ్య‌క్తి నాలుక‌కి త‌గిలితే దాన్ని ఫ్రెంచ్ కిస్ అంటారు. అందుకే దీన్ని టంగ్ కిస్ అంటారు. ఇద్ద‌రూ ఇలాంటి ముద్దు పెట్టుకుంటున్నారంటే వారిద్ద‌రూ చాలా ద‌గ్గ‌రైపోయార‌ని అర్థం.

వాంపైర్ కిస్‌ (Vampire Kiss)

భాగ‌స్వామి మెడ‌పై గాఢంగా పెట్టే ముద్దు ఇది. కొద్దిగా కొర‌క‌డం వంటివి కూడా ఇందులో భాగం. మ‌న శ‌రీరంలోని సున్నిత‌మైన భాగాల‌లో మెడ ఒక‌టి. ఈ భాగంలో ముద్దు పెట్ట‌డం వ‌ల్ల సులువుగా మూడ్ వ‌స్తుంది. శృంగారం ప్రారంభించ‌డానికి ఇదో చ‌క్క‌టి మార్గం.

gifskey %2811%29

ఇయ‌ర్‌లోబ్ కిస్‌ (Kiss In The Ear)

మీ భాగ‌స్వామి చెవిని మీ పెదాల‌తో ప‌ట్టుకొని కాస్త లాగిన‌ట్లు చేస్తే దాన్నే ఇయ‌ర్‌లోబ్ కిస్ అంటారు. ఈ కిస్ మీకు తెలియ‌కుండా మీలో దాగి ఉన్న ఫీలింగ్స్‌ని త‌ట్టి లేపుతుంది. మీరు ఈ ముద్దు ప్ర‌య‌త్నిస్తున్నారంటే.. ఈపాటికే మీరు చాలా ర‌కాల ముద్దుల‌ను ప్ర‌య‌త్నించి ఉంటార‌ని అర్థం. శృంగారంలో చాలా దూరం వెళ్లిపోయార‌న్న‌మాట‌.

సింగిల్ లిప్ కిస్‌ (Single Lip Kiss)

ఈ ముద్దులో మీ భాగ‌స్వామి పై పెద‌వి లేదా కింది పెద‌విని ప‌ట్టుకొని మృదువుగా లాగుతార‌న్న‌మాట‌. మీ కోరిక‌ను వెల్ల‌డించేందుకు ఇది చ‌క్క‌టి ప‌ద్ధ‌తి. కేవ‌లం ఒక‌టే పెదవికి ఫిక్స్ అవ‌కుండా అప్పుడ‌ప్పుడూ మార్చుతూ పోవ‌డం మంచిది. దీనివ‌ల్ల మీ శ‌రీరంలో మీకే తెలియ‌ని ఫీలింగ్ ప్రారంభ‌మ‌వుతుంది.

అప్‌సైడ్ డౌన్ కిస్‌ (Kiss Upside Down)

దీనికోసం మీరు స్పైడ‌ర్ మ్యాన్‌లా మారిపోవాల్సిందే. అప్‌సైడ్ డౌన్ కిస్ అంటే మీరున్న పొజిష‌న్‌కి వ్య‌తిరేక దిశ‌లో ఉండాల్సింద‌న్న‌మాట‌. అలా ఉండి ముద్దు పెట్టుకోవ‌డ‌మే ఈ ముద్దులోని ప్ర‌త్యేక‌త‌. ఈ ముద్దు పెట్టుకున్నారంటే మీరు చాలా రొమాంటిక్ అన్న‌మాట‌. వ‌ర్షంలో ఇలాంటి ముద్దు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది.

ఏంజిల్ కిస్‌ (Angel Kiss)

మీ భాగ‌స్వామి క‌ళ్ల‌లో క‌ళ్లు పెట్టి.. పెదాల‌పై మృదువుగా పెట్టే ముద్దు ఈ ఏంజిల్ కిస్‌. ఇది ప్రేమ‌ను, ద‌గ్గ‌రిత‌నాన్ని చూపేందుకు చ‌క్క‌టి మార్గం. మీ స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌ను ఈ ముద్దు సాయంతో చూపండి.

బ్యాక్ ఆఫ్ ది నెక్ కిసెస్ (Back Of The Neck Kiss)

మెడ వెనుక జుట్టు కింద ముద్దు పెడితే చ‌క్క‌టి మూడ్ మీ సొంత‌మ‌వుతుంది. అలా పెట్టే ముద్దే ఇది. మెడ వెనుక నుంచి వీపుపై వ‌ర‌కూ ముద్దులు పెట్టుకుంటూ వెళ్ల‌డం వ‌ల్ల శృంగార‌భ‌రిత‌మైన మూడ్ మీ సొంత‌మ‌వుతుంది.

gifskey %286%29

టీజ‌ర్ కిస్‌ (Teaser Kiss)

నుదురు ద‌గ్గ‌ర ప్రారంభ‌మై అక్క‌డి నుంచి బుగ్గ‌లు, పెదాలు, చేతులు.. ఇలా కింద వ‌ర‌కూ ముద్దులు పెట్టుకుంటూ పోవ‌డ‌మే ఈ ముద్దు. బెడ్‌పై ప‌డుకొని పై నుంచి కింద వ‌ర‌కూ ఇలా ముద్దులు పెట్టుకోవ‌డం వ‌ల్ల శృంగారానికి సిద్ధం అని భాగ‌స్వామికి చెప్పిన‌ట్ల‌వుతుంది.

చేతిపై ముద్దు (Kiss On The Hand)

అంద‌రిలో ముద్దు పెట్టుకునేందుకు ఇది చ‌క్క‌టి ప‌ద్ధ‌తి. ఇలా కేవ‌లం మీ భాగ‌స్వామినే కాదు.. ద‌గ్గ‌రి వాళ్ల‌ను ముద్దు పెట్టుకోవ‌చ్చు. దీనికోసం ఎదుటివారి చేయి తీసుకొని అర‌చేతి వెనుక ముద్దు పెట్టుకోవాలి. ఈ స్వీట్ అండ్ సెన్సిటివ్ కిస్ ఎదుటివారిపై మీకున్న ప్రేమ‌ను చాటుతుంది.

ద బైట్ అండ్ నిబుల్ కిస్‌ (The Byte and Nibble Kiss)

ఇది చాలా సింపుల్ ముద్దు. సాధార‌ణ ముద్దుకే కాస్త భిన్నంగా ఉంటుదిది. ముద్దు పెట్టుకునేట‌ప్పుడు మీ భాగ‌స్వామి పెదాలు లేదా బుగ్గ‌ల‌ను కొద్దిగా కొర‌క‌డం ఈ ముద్దులోని ప్ర‌త్యేక‌త‌. రెగ్యుల‌ర్ రొటీన్‌కి భిన్నంగా మీ రొమాన్స్‌ని కాస్త మ‌సాలా జోడించాలంటే ఇది మంచి ఎంపిక‌

లిజ‌ర్డ్ కిస్ (Kiss The Lizard)

ముద్దు పెట్టుకుంటున్న‌ప్పుడు మీ భాగ‌స్వామి నోటి లోప‌లికి బ‌య‌ట‌కు మీ నాలుకను ఆడించాలి. బ‌ల్లి ఏదైనా కీట‌కాన్ని చూసిన‌ప్పుడు నాలుక చాచిన‌ట్లు అన్న‌మాట‌. మీకు బ‌ల్లంటే ఇష్టం లేక‌పోయినా ఈ ముద్దు మాత్రం న‌చ్చి తీరుతుంది. మీ రిలేష‌న్‌షిప్‌లో అడ్వెంచ‌ర్‌, ఎగ్జైట్‌మెంట్ పెంచేందుకు ఇది ప‌నిచేస్తుంది.

జా కిస్‌ (Kiss The Jigsaw)

మీ భాగ‌స్వామి ద‌వ‌డ భాగాన్ని ముద్దు పెట్టుకోవ‌డం ఇందులో ముఖ్య‌మైన భాగం. ఇందులో భాగంగా ద‌వ‌డ ద‌గ్గ‌ర ముద్దు పెట్టుకోవ‌డం వ‌ల్ల మంచి మూడ్ మీ సొంత‌మ‌వుతుంది. ముందు ఈ త‌ర‌హా ముద్దులు పెట్టుకుంటూ ఆ త‌ర్వాత ముఖ్య‌మైన ప‌నిలోకి వెళ్లొచ్చు.. ఇద్ద‌రూ మంచి రొమాంటిక్ మ‌నుషులైతే ఇలాంటి ముద్దుల‌ను ప్ర‌య‌త్నిస్తార‌ట‌.

చీక్ కిస్‌ (Cheek Kiss)

పేరులో ఉన్న‌ట్లే బుగ్గ‌ల‌పై పెట్టుకునే పెక్ కిస్ ఇది. ఇది కేవ‌లం భాగ‌స్వామికే ఇవ్వాల‌ని రూలేం లేదు. స్నేహితులు, అన్నాచెల్లెళ్లు ఇలా ఎవ‌రి మ‌ధ్య‌నైనా గాఢ‌మైన ప్రేమ‌ను చూపించేందుకు ఇది మార్గం.

gifskey %285%29

ఫోర్‌హెడ్ కిస్‌ (Forehead Kiss)

నుదుటిపై పెట్టే అంద‌మైన ముద్దు ఇది. మాట‌ల్లో చెప్ప‌లేని స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌ను ఈ ముద్దు ద్వారా వెల్ల‌డించే వీలుంటుంది. ఇది కూడా ఎలాంటి బంధాన్నైనా ద‌గ్గ‌ర చేస్తుంది.

సిప్పింగ్‌ (Sipping)

ఈ ముద్దు చాలా విభిన్న‌మైంది. మీ నోటితో జ్యూస్ లేదా ఇత‌ర‌త్రా డ్రింక్ ఏదైనా తీసుకొని బుగ్గ‌న ప‌ట్టుకొని దాన్ని మీ నోటితో భాగ‌స్వామికి అందించాలి. ఇది చెప్పేందుకే ఎంతో రొమాంటిక్‌గా ఉంది క‌దా.. మీ బంధంలో రొమాన్స్‌ని మ‌రో మెట్టు పెంచేందుకు దీన్ని ఉప‌యోగించ‌వచ్చు.

ఫుట్ కిస్‌ (Kiss The Foot)

ఇది మీ భాగ‌స్వామి అరికాళ్ల‌కు ఇచ్చే ముద్దు. కేవ‌లం ముద్దే కాదు.. చిన్న‌గా కొరికే వీలు కూడా ఉంటుంది. చాలామందికి అరికాళ్ల‌పై ముద్దు పెడుతుంటే కిత‌కిత‌లు వ‌చ్చిన‌ట్లుగా అనిపించి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంతేకాదు.. అరికాళ్ల‌లో చాలా న‌రాల కొస‌లు ఉండ‌డం వ‌ల్ల ఇలా ముద్దు పెడితే ఒళ్లంతా మ‌త్తెక్కిన‌ట్లుగా అనిపిస్తుంది కూడా.

బ‌ట‌ర్‌ఫ్లై కిస్‌ (Butterflies Kiss)

మీ భాగ‌స్వామికి మ‌రీ ద‌గ్గ‌ర‌గా నిల్చుని పెట్టే ముద్దు ఇది. మీ ఇద్ద‌రి మ‌ధ్యా గాలి కూడా చొర‌బ‌డ‌నంత ద‌గ్గ‌ర‌గా నిల్చొని లేదా ప‌డుకొని పెట్టే ముద్దు. ఇందులో భాగంగా క‌నుబొమ్మ‌లు కూడా ఒక‌రికొక‌రికి త‌గిలేలా ఉంటుంది. అవ‌త‌లి వ్య‌క్తి మీతో పిచ్చిగా ప్రేమ‌లో ఉన్నార‌ని ఈ ముద్దు వివ‌రిస్తుంది.

gifskey %284%29

ఎయిర్ కిస్‌ (Flying Kiss)

ఎదుటి వ్య‌క్తి మీకు దూరంగా ఉంటే… త‌న‌ని ముద్దు పెట్టుకోవాల‌ని మీకు అనిపిస్తే ఇచ్చే ముద్దే ఈ ఎయిర్ కిస్‌. ఉమ్మా.. అంటూ ఎదుటివారిని ప‌ల‌క‌రించ‌డానికి కూడా ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది మీ భాగ‌స్వామితో ప్ర‌య‌త్నించ‌డానికి మాత్రం ప‌నికిరాదు. ఎందుకంటే ఇది చాలా అన్‌రొమాంటిక్‌గా అనిపిస్తుంది.

లింగ‌రింగ్ కిస్‌ (Lingering Kiss)

ఇది లిప్ టు లిప్ కిస్సే.. కానీ మ‌ధ్య‌లో కాస్త గ్యాప్ ఇస్తూ పెట్టే ముద్దు ఇది.  మీరు ఆప‌లేనంత ఎక్కువ రొమాన్స్ చేయాల‌నుకున్న‌ప్పుడు ఈ ముద్దును ఉప‌యోగించ‌వ‌చ్చు. గాఢంగా ఎక్కువ సేపు ముద్దు పెట్టుకున్న‌ప్పుడు మ‌ధ్య‌లో ఊపిరి తీసుకోవ‌డానికి గ్యాప్ తీసుకోవ‌చ్చు.

ద హిక్కీ (The Hickey)

ఈ త‌ర‌హా ముద్దు మీ భాగ‌స్వామిని గ‌ట్టిగా ప‌ట్టుకొని ముద్దుపెట్ట‌డం అన్న‌మాట‌. ఎంత గ‌ట్టిగా అంటే ఒక్కోసారి గాట్లు కూడా ప‌డిపోయేంత గ‌ట్టిగా అన్న‌మాట‌. ఇది కావాల‌ని పెట్ట‌క‌పోయినా శృంగారంలో భాగంగా అనుకోకుండా జ‌రిగిపోయే గాఢ‌మైన ముద్దు. ఈ ముద్దు పెట్టుకున్నారంటే రాత్రంతా ఎంతో తృప్తి పొందార‌ని అర్థం.

ముద్దు పెట్టుకునేట‌ప్పుడు ఇవి గుర్తుంచుకోండి. (Rules To Follow For Kissing)

ఏ ప్ర‌క్రియ‌కైనా దాన్ని నిర్వ‌హించేందుకు కొన్ని నియ‌మాలుంటాయి. ముద్దు విష‌యంలోనూ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. మీ భాగ‌స్వామిని మీకు న‌చ్చేలా ముద్దు పెట్టుకునే వీలున్నా.. ఆ స‌మ‌యంలో చేయాల్సిన ప‌నులు, చేయ‌కూడ‌ని ప‌నులేంటో గుర్తుంచుకుంటే మంచిది.

gifskey %282%29

అనుమ‌తి తీసుకోండి (Take Permission)

ఎదుటివారు మీకు ఎంత ద‌గ్గ‌రివారైనా స‌రే.. మీ భాగ‌స్వామి అయినా స‌రే.. ముద్దు పెట్టే ముందు ఒక‌సారి వారి అనుమ‌తి తీసుకోవ‌డం మంచిది. అయితే ఎదుటివారు అన్ని వేళ‌లా నోటితోనే ఒకే చెప్పాల‌ని రూలేం లేదు. వారి చేత‌ల‌ను బ‌ట్టి కూడా వారిని ముద్దు పెట్టుకోవ‌డం ఇష్ట‌మే అని తెలుసుకునే వీలుంటుంది. అయితే ఎదుటివారికి మీరంటే ఇష్ట‌మే క‌దా అని ముద్దు పెట్టేందుకు ముంద‌డుగు వేయ‌డం స‌రికాదు.

దుర్వాస‌న రాకుండా చూడండి (Keeps Breath Fresh)

సాధార‌ణ స‌మ‌యాల్లోనే నోటి నుంచి చెడు వాస‌న వ‌స్తే అస‌హ్యంగా ఉంటుంది. అలాంటిది ముద్దు పెట్టే స‌మ‌యంలో ఇలాంటి వాస‌న వ‌స్తే ఇంకా చిరాగ్గా ఉంటుంది. అందుకే ముద్దు పెట్ట‌డానికి ముందే మీ నోటి నుంచి వాస‌న రాకుండా చూసుకోండి. బ్ర‌ష్‌, ఫ్లాస్‌, మౌత్ వాష్ ఇలా ఏదైనా ఉప‌యోగించి వాస‌న‌ను అరిక‌ట్టండి. అంతేకాదు.. ముద్దు పెట్ట‌డానికి ముందు ఎలాంటి వాస‌న వ‌చ్చే ఆహారం తీసుకోకుండా ఉండ‌డం మంచిది.

చూయింగ్ గ‌మ్ వ‌ద్దు (Don’t Chew Gum During Kiss)

మీ నోరు వాస‌న రాకుండా ఉండేందుకు చూయింగ్ గమ్ లేదా మింట్ వేసుకోవ‌డం మంచిదే కానీ ముద్దు పెట్ట‌డానికి ముందు దాన్ని ఊసేయ‌డం మంచిది. లేదంటే మీ నోట్లో ఉన్న ఈ గ‌మ్ వ‌ల్ల మీ ముద్దు చిరాగ్గా మారే అవ‌కాశాలుంటాయి.

kiss5

పెదాల‌పై శ్ర‌ద్ధ పెట్టండి (Take Care Of Your Lips)

మీ పెదాలు ప‌గిలి తెల్ల‌ని పొర‌ం చిరగడం లేదా ర‌క్తం కారడం గానీ జరిగితే వాటిని ముద్దు పెట్ట‌డానికే కాదు.. క‌నీసం చూడ‌డానికి కూడా ఎవ‌రికీ ఇష్టం అనిపించ‌దు. అందుకే పెదాల‌పై ఎక్కువ‌గా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు మీ పెదాల‌ను ఎక్స్‌ఫోలియేట్ చేసుకుంటూ.. బామ్ రుద్దుకుంటూ వాటిని అందంగా ఉండేలా చూసుకోండి. దీంతో అవ‌త‌లి వారికి మీ పెదాల‌ను చూడ‌గానే ముద్దివ్వాల‌న్న కోరిక పుడుతుంది.

చేతులు ఎక్క‌డ పెడుతున్నారు? (Where To Put Hands While Kissing)

ఇది చాలామందికి వ‌చ్చే సందేహ‌మే. ముద్దు పెడుతున్న‌ప్పుడు చేతులు ఎక్క‌డ ఉంచాలి అని.. ఎదుటివ్య‌క్తిని ముట్టుకోకుండా ఉంటే అది ముద్దు పెట్టిన‌ట్లుగానే ఉండ‌దు. అందుకే మీరు ముద్దు పెడుతున్న‌ప్పుడు మీ చేతుల‌ను ఎదుటివారి త‌ల‌లో ఉంచి నిమ‌ర‌డం వ‌ల్ల మ‌రింత ఎక్కువ మూడ్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. మీరు కాస్త పొట్టిగా ఉండి త‌ల‌లో చేయి పెట్ట‌డం కుద‌ర‌క‌పోతే.. భుజాల‌పై లేదా న‌డుముపై చేతులు ఉంచి అవ‌త‌లి మ‌నిషిని చుట్టేస్తే స‌రి.

వాతావ‌ర‌ణం కూడా ముఖ్య‌మే (Atmosphere Is Also Important)

ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ‌.. ఎలా ప‌డితే అలా ముద్దు పెట్ట‌డం స‌రికాదు. అలాగే మీకు జ‌లుబు వంటి స‌మ‌స్య‌లున్న‌ప్పుడు కూడా ముద్దు పెట్ట‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మంచిది. ముద్దు పెడుతున్న‌ప్పుడు చుట్టూ వాతావ‌ర‌ణంతో పాటు మీ మూడ్ కూడా కాస్త రొమాంటిక్‌గా ఉండేలా చూసుకోవాలి. ముద్దు పెడుతున్న‌ప్పుడు ఇత‌రులు చూడ‌డం కూడా అంత‌గా బాగోదు కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మంచిది.

gifskey %287%29

అవ‌త‌లివారి ఫీలింగ్స్ అర్థం చేసుకోండి (Understand Each Other’s Feelings)

మీరు ముద్దుపెట్ట‌డం మీ భాగ‌స్వామికి ఇష్ట‌మా? కాదా? అన్న‌ది త‌న ప్ర‌తిస్పంద‌న‌, ఫీలింగ్స్ ద్వారా సులువుగా అర్థ‌మ‌వుతుంది. ఎదుటివారు కూడా సంతోషంతో మూలుగుతూ మీతో ఆనందంగా ముద్దుల్లో మునిగిపోతుంటే అలాగే కొన‌సాగించండి. వాళ్లు కాస్త త‌ట‌ప‌టాయించిన‌ట్లు అనిపించినా లేక ఇబ్బందిప‌డుతూ వెనక్కి త‌గ్గుతున్నా.. వెంటనే దాన్ని ఆపేయ‌డం మంచిది.

ప‌ళ్లు వాడ‌కండి (Do not Use Teeth)

సాధార‌ణంగా గాఢ‌మైన ముద్దు పెట్టుకున్న త‌ర్వాత పెద‌వుల‌కు చిన్న చిన్న గాట్ల‌తో ఉన్న‌వారిని మ‌నం చాలామందిని చూస్తాం. అయితే ప‌ళ్ల‌తో కొరికేవారికి అది రొమాంటిక్‌గానే అనిపించినా.. నొప్పి స‌హించేవారికి అది త‌గ్గేవ‌ర‌కూ తిరిగి ముద్దు పెట్టుకోవాల‌నే ఆలోచ‌నే రాదు. అందుకే ముద్దు పెట్టుకునేట‌ప్పుడు ప‌ళ్లను ఉప‌యోగించ‌కూడ‌దు. మీ ఇద్ద‌రి బంధం చాలా బ‌ల‌మైన‌ది.. మీ ఇద్ద‌రికీ ఇలాంటివి ఇష్ట‌మే అయితే అప్పుడ‌ప్పుడూ చిన్న పంటిగాట్లు పెట్టినా అవ‌త‌లివారు పెద్ద‌గా బాధ‌ప‌డ‌రు.

అవ‌త‌లివారిపై ప‌డిపోకండి (Don’t Fall On Them)

చాలామంది ఒక్క‌సారిగా త‌మ భాగ‌స్వామిపై ప‌డిపోయి గాఢంగా ముద్దులు పెడుతుంటారు. ఇది స‌రికాదు. ముద్దులు పెట్టుకోవ‌డానికి చాలా స‌మ‌యం ఉంది. అందుకే నెమ్మ‌దిగా ప్రారంభించి గాఢంగా పెడుతూ పోవాలే త‌ప్ప‌.. ఒకేసారి వారిపై ప‌డిపోయి గాఢంగా ఊపిరి ఆడ‌కుండా ముద్దు పెట్టేస్తే మొద‌టికే మోసం వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంది. నెమ్మ‌దిగా ప్రారంభించ‌డం వ‌ల్ల అవ‌త‌లివారి ఫీలింగ్స్ ఆధారంగా మీరూ ముందుకెళ్లే వీలు క‌లుగుతుంది.

భాగ‌స్వామిని ఫాలో అవ్వండి (Follow With Their Moves)

ముద్దంటే.. మీ భాగ‌స్వామి ముద్దు పెడుతుంటే మీరు అలా నిల‌బ‌డిపోవ‌డం కాదు.. ఇద్ద‌రూ ఎంజాయ్ చేయ‌గ‌లిగితేనే అది మంచి ముద్దు అవుతుంది. అందుకే ముద్దు పెట్టేట‌ప్పుడు.. ఒక‌రు ముందుంటే మ‌రొక‌రు వారి ఇష్టాల‌ను ఫాలో అవ్వాలి. దీనివ‌ల్ల మీకు అవ‌త‌లివారి ఇష్టాయిష్టాలు తెలియ‌డంతో పాటు ఒక‌రినొక‌రు డామినేట్ చేసుకోవ‌డం కంటే మ‌రింత ఎక్కువ ఆనందం ద‌క్కుతుంది.

gifskey %289%29

పెదాల వ‌ర‌కే కాదు.. (Not Only Lips)

ముద్దులో చాలా ర‌కాలుంటాయని ముందే చెప్పుకున్నాం క‌దా.. అందుకే కేవ‌లం పెదాల‌కే ప‌రిమిత‌మైపోకుండా ద‌వ‌డ‌లు, మెడ‌, చెవులు.. ఇలా మీకు న‌చ్చిన ప్రాంతాల్లో ముద్దులు పెడుతూ ముందుకెళ్లండి. అప్పుడ‌ప్పుడు నొప్పి పుట్ట‌ని విధంగా కొద్దిగా కొరుకుతూ చేతుల‌ను త‌న ఒంటిపై, త‌ల‌పై రుద్దుతూ ఉంటే ముద్దు మ‌రింత గాఢంగా మారి ఎంతో ఆనందాన్ని పంచుతుంది.

లాలాజ‌లం కంట్రోల్ చేయండి (Keep The Saliva In Control) 

ముద్దు పెట్టుకునేట‌ప్పుడు లాలాజ‌లం కంట్రోల్ చేసుకోవాలి. సాధార‌ణంగా ముద్దు పెట్టేట‌ప్పుడు లాలాజ‌లం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. అయితే దాన్ని బ‌య‌ట‌కు రానివ్వ‌కూడ‌దు. మీ పెదాల‌ను త‌డిచేసుకోండి కానీ మ‌రీ లాలాజ‌లం కారేలా ఉండ‌డం చిరాకు పుట్టిస్తుంది.

అవ‌త‌లివారికి స‌పోర్ట్ ఇవ్వండి (Give To Each Other)

ముద్దు పెట్టేట‌ప్పుడు అవ‌త‌లివారిపై వాల‌డం స‌రికాదు. మీ బరువు అవ‌త‌లివారిపై ప‌డ‌డం వ‌ల్ల వారికి ముద్దు మ‌ధురంగా కాకుండా ఇబ్బందిక‌రంగా మారే వీలుంటుంది. అందుకే వారి బ‌రువును మీరు స‌పోర్ట్ చేస్తూ ముద్దు పెట్టుకోవ‌డం మంచిది. లేదంటే గోడ‌కు ఆని, మంచంపై ప‌డుకొని లేదా కింద కూర్చొని ఇలా వివిధ పొజిష‌న్ల‌లో ముద్దును ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

sex4

ఫీడ్‌బ్యాక్ మ‌ర్చిపోవ‌ద్దు (Don’t Forget The Feedback)

ఎవ‌రికీ ఏ ప‌ని మొద‌టిసారే రాదు. మీరు ముద్దు పెట్ట‌డంలో మొద‌టిసారే ప్రావీణ్యులు కాలేరు. అందుకే ఒక‌వేళ మీ భాగ‌స్వామి ముద్దు ఇలా కాదు అని.. వేరేలా పెట్ట‌డం మీకు నేర్పుతుంటే త‌ప్పుగా అనుకోకండి. మీకంటే త‌న‌కు ఎక్కువ‌గా తెలుస‌ని.. దీనివ‌ల్ల మీ బంధం మ‌రింత రొమాంటిక్‌గా మార‌బోతోంద‌ని గ‌మ‌నించండి. మ‌ధ్య‌లో ఈగోలు, కోపాలు లేకుండా ఉంటే మంచి వైన్‌లా పాత‌ద‌వుతున్న కొద్దీ మీ బంధం మ‌రింత అందంగా మారుతుంది.

క‌ళ్లు మూసుకోండి (Close The Eyes)

ముద్దు పెడుతున్న వేళ.. మీరు క‌ళ్లు తెరిస్తే.. మీ భాగ‌స్వామి కూడా మిమ్మ‌ల్నే చూస్తుందనుకోండి…. ఏదోలా అనిపిస్తుంది క‌దూ.. అందుకే పెద్ద‌లు ముద్దు పెట్టేట‌ప్పుడు క‌ళ్లు మూసుకోవాల‌ని చెప్పార‌నుకుంటా. కావాలంటే మ‌ధ్య‌లో అప్పుడ‌ప్పుడు తెరిచే వీలుంటుంది. అయినా మాములు ముద్దు వ‌ర‌కూ ఫ‌ర్వాలేదు.. కానీ గాఢ‌మైన ముద్దు కోసం క‌ళ్లు మూసుకుంటేనే ఆ ఫీలింగ్ మ‌రింత బాగా అర్థ‌మ‌వుతుంది. మీరేమంటారు?

ఇవి కూడా చ‌ద‌వండి..

ఈ తొలి వార్షికోత్స‌వ రొమాన్స్ ముచ్చ‌ట్లు.. ఆలుమ‌గ‌ల‌కు ప్ర‌త్యేకం..!

ఈ ట్రావెల్ రొమాన్స్ స్టోరీలు.. ప్రేమికులకు, ఆలుమగలకు ప్రత్యేకం..!

ఈ రెసిపీల‌తో మీ వాలెంటైన్‌కి.. రొమాంటిక్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వండి..

13 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this