ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
బిడ్డ‌ను ఎయిర్‌పోర్ట్‌లో మ‌ర్చిపోయి ఫ్లైట్ ఎక్కిందో త‌ల్లి.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..!

బిడ్డ‌ను ఎయిర్‌పోర్ట్‌లో మ‌ర్చిపోయి ఫ్లైట్ ఎక్కిందో త‌ల్లి.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..!

సాధార‌ణంగా మ‌నం రైళ్ల‌లో లేదా విమానాల్లో(flight) ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు స్టేష‌న్‌లో మ‌న బ్యాగులు మ‌ర్చిపోయి ఎక్కేయ‌డం జ‌రుగుతుంది.

కొన్నిసార్లు ఎయిర్‌పోర్టుల్లో షాపింగ్ చేసిన త‌ర్వాత ఆ షాపింగ్ బ్యాగులు కూడా మ‌ర్చిపోతుంటాం. కానీ ఎప్పుడైనా మీతో పాటు ప్ర‌యాణించేవాళ్ల‌ని మ‌ర్చిపోయి ఫ్లైట్ ఎక్కారా? ముఖ్యంగా మీ పిల్ల‌ల‌ని? ఇలాంటిదే ఓ విచిత్ర‌మైన ఘ‌ట‌న(Bizarre incident) అంద‌రినీ షాక్‌కి గురి చేస్తోంది.

సౌదీ అరేబియాలోని జెడ్డా ఎయిర్‌పోర్ట్ నుంచి మ‌లేషియాలోని కౌలాలంపూర్‌కి వెళ్లే ఫ్లైట్‌లో ఎక్కిన ఓ మ‌హిళ ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన త‌ర్వాత కంగారు ప‌డిపోతూ ఎయిర్ హోస్టెస్‌ని పిలిచింద‌ట‌. “నేను ఎయిర్‌పోర్ట్‌లో నా బిడ్డ‌ను మ‌ర్చిపోయి ఫ్లైట్ ఎక్కేశాను. ప్లీజ్ న‌న్ను కింద‌కి దింపేయండి. నేను ఈ ప్ర‌యాణం చేయ‌లేను” అంటూ ఆమెను వేడుకోవ‌డం ప్రారంభించింది. మ‌రీ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప సాధార‌ణంగా ఫ్లైట్‌ని కింద‌కు దింప‌లేరు. కానీ ఇలా ఓ బిడ్డ కోసం ఫ్లైట్‌ని తిరిగి వెన‌క్కి తిప్పాలా? వ‌ద్దా? అర్థం కాని పైలెట్ ఏటీసీ అనుమ‌తి కోరాడు.

దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. 

ADVERTISEMENT

వెంటనే పైలట్ తన అధికారులకు సమాచారం అందిస్తూ “మేము తిరిగి వెన‌క్కి రావాల‌నుకుంటున్నాం. ఒక ప్యాసెంజ‌ర్ వెయిటింగ్ ఏరియాలో త‌న బిడ్డ‌ను మ‌ర్చిపోయింది. త‌న ప్ర‌యాణం కొన‌సాగించేందుకు ఒప్పుకోవ‌డం లేదు. పాపం.. చిన్న బిడ్డ‌..” అని పైలెట్ రెండు సార్లు చెప్పిన త‌ర్వాత ఏటీసీ వాళ్లు “స‌రే.. మీరు తిరిగి రావ‌చ్చు. ఇలాంటివి మేం ఎప్పుడూ చూల్లేదు..” అంటూ స‌మాధానం ఇచ్చారు. ఆ త‌ర్వాత ఫ్లైట్ తిరిగి జెడ్డా ఎయిర్‌పోర్ట్ వ‌చ్చింది.

అస‌లు ఆ త‌ల్లి బిడ్డ‌ను ఎలా మర్చిపోయిందో.. లేక ఆ త‌ర్వాత బిడ్డ‌ను తీసుకొని తిరిగి ఫ్లైట్ ఎక్కిందా? లేదా? అన్న విష‌యాలు మాత్రం తెలియ‌రాలేదు.

చాలా విచిత్రంగా అనిపిస్తోంది క‌దా.. అయితే ఇదొక్క‌టే కాదు.. ఫ్లైట్ల‌లో ఇలాంటి విచిత్ర‌మైన సంఘ‌ట‌న‌లు అప్పుడ‌ప్పుడూ జ‌రుగుతూనే ఉంటాయి. అందులో మ‌చ్చుకు కొన్ని చూస్తే..

1. ఫ్లైట్ హైజాక్ చేసిన బిలియ‌నీర్ బ్రిజు స‌ల్లా..

త‌ను ప్రేమించిన అమ్మాయి కోసం ఫ్లైట్‌ని హైజాక్ చేసి జెట్ ఎయిర్‌వేస్‌ని మూయించాల‌ని భావించాడు బిలియ‌నీర్ బ్రిజు స‌ల్లా. ఫ్లైట్ హైజాక్ అయితే ఆ సంస్థ  విమానాల్లో ఎక్కేందుకు ఎక్కువ మంది ఆస‌క్తి చూపించ‌ర‌ని.. దాంతో సంస్థ‌కి న‌ష్టాలొచ్చి మూసేస్తార‌ని ఆశించాడ‌ట ఈ బిలియ‌నీర్‌.

ADVERTISEMENT

అలా జ‌రిగితే ఆ అమ్మాయి జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగం మానేస్తుంద‌ని భావించాడ‌ట‌. అంత‌కుముందు కూడా త‌న భోజ‌నంలో బొద్దింక‌లు వ‌చ్చాయ‌ని సంస్థ వారితో గొడ‌వ పెట్టుకున్నాడు బ్రిజు. ఈ గొడ‌వ వ‌ల్ల ముంబై నుంచి దిల్లీ వెళ్తున్న విమానం అహ్మ‌దాబాద్‌కి మ‌ళ్లించాల్సి వ‌చ్చింది. దీంతో ఈ ప్రేమికుడిని ఖైదీగా మార్చేశారు అధికారులు.

2. ఫ్లైట్‌లో అండ‌ర్‌వేర్ ఆర‌బెట్టుకున్న యువ‌తి..

అంటాల్యా నుంచి ర‌ష్యా రాజ‌ధాని అయిన మాస్కోకి వెళ్తున్న ఫ్లైట్‌లో ఓ యువ‌తి త‌న అండ‌ర్‌వేర్‌ని అంద‌రికీ క‌నిపించేలా ఆర‌బెట్టుకోవ‌డం ఫ్లైట్‌లో ఉన్న‌వారిని విస్తుపోయేలా చేసింది. ఫ్లైట్‌లోని ఓవ‌ర్ హెడ్ ఎయిర్‌కండిష‌న‌ర్‌కి ద‌గ్గ‌ర‌గా ఆ అండ‌ర్‌వేర్‌ని ఉంచి దాని నుంచి వ‌చ్చే గాలితో అండ‌ర్‌వేర్‌ని ఆర‌బెట్టిందా యువ‌తి. ఈ సంఘ‌ట‌న‌ను ఆమె వెనకున్న ప్యాసెంజ‌ర్ల‌లో ఒక‌రు ఫోన్లో చిత్రీక‌రించ‌డంతో ఈ సంఘ‌ట‌న గురించి బ‌య‌ట‌కు తెలిసింది. ఈ వీడియో కొన్ని గంట‌ల్లోనే నెట్‌లో వైర‌ల్‌గా మారింది.

3. న‌వ్వించేలా సూచ‌న‌లు చెబుతూ..

మీరు విమానాల్లో త‌ర‌చూ ప్ర‌యాణించేవారైతే సేఫ్టీకి సంబంధించి చెప్పే సూచ‌న‌లు వినాలంటే చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఎప్పుడూ చెప్పిన సూచ‌న‌లే మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతుంటే అదేదో పాఠం విన్న‌ట్లు విని మ‌ర్చిపోవ‌డం త‌ప్ప మ‌రేదీ చేయ‌లేం. కానీ ఈ ఫ్లైట్ అటెండెంట్ మాత్రం “ఒక‌వేళ ఈ ఫ్లైట్ క్రూజ్‌గా మారితే మీరు దీన్ని దిగేందుకు మీకో చ‌క్క‌టి పోల్కాడాట్ బికినీ అందుబాటులో ఉంది. దీన్ని ఎలా ఉప‌యోగించాలంటే..” అంటూ త‌న‌దైన శైలిలో ఫ‌న్నీగా సేఫ్టీ సూచ‌న‌లు అందించడం కాస్త గమ్మత్తుగా లేదూ.

panda

4. పాండాతో ప్ర‌యాణం చేస్తే ఎలా ఉంటుంది..

ఫ్లైట్‌లో త‌మ ప‌క్క సీట్లో అంద‌మైన అమ్మాయి కూర్చుంటే బాగుండున‌ని కోరుకునే అబ్బాయిలు ఎంద‌రో.. అయితే మీ ప‌క్క‌సీట్లో పాండా కూర్చొని ప్ర‌యాణిస్తే ఎలా ఉంటుందంటారు.. అదేంటి? జ‌ంతువుల‌ను ఫ్లైట్‌లో మ‌నుషుల‌తో పాటు కూర్చోనివ్వ‌రుగా.. అంటారా? ఎప్పుడు జ‌రిగేది అదే. కానీ అనుకోనిది జ‌రిగితేనేగా అది విచిత్రం అవుతుంది. చైనా నుంచి అమెరికా వెళ్లే ఓ ఫ్లైట్‌లో చైనా జూ నుంచి అమెరికా జూకి పంపే ఆ పాండాని మ‌నుషుల‌తో పాటే బిజినెస్ క్లాస్‌లో కూర్చోబెట్టార‌ట‌. స్క్వీ స్క్వీ అని పిలిచే ఈ పాండా ఫ్లైట్‌లో ఉన్న‌ప్పుడు ప‌క్క‌వాళ్ల‌కి ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చేశార‌ట‌. ఈ పాండాకి ప్లాస్టిక్ డైప‌ర్ కూడా వేయ‌డం విశేషం.

ADVERTISEMENT

Images: Pixabay

ఇవి కూడా చ‌ద‌వండి.

మ‌గాళ్ల‌కు నెల‌స‌రి వ‌స్తే. . ఎలా ఉంటుందో మీకు తెలుసా??

ఈ ఫన్నీ ఫీలింగ్స్.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక.. మీకూ వచ్చాయా..?

ADVERTISEMENT

మీరూ లేట్ ల‌లిత‌లేనా? అయితే మీ జీవితంలోనూ ఇవి జ‌రుగుతూ ఉంటాయి..

Featured image : Unsplash.

13 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT