ADVERTISEMENT
home / Celebrity gossip
ఒక ప్లే బాయ్.. వరల్డ్ ఫేమస్ లవర్‌గా ఎలా మారాడు? అదే ఈ సినిమా

ఒక ప్లే బాయ్.. వరల్డ్ ఫేమస్ లవర్‌గా ఎలా మారాడు? అదే ఈ సినిమా

‘World Famous Lover’ Teaser Talk

వరల్డ్ ఫేమస్ లవర్ (World Famous Lover).. టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రమిది. నలుగురు కథానాయికలు నటించిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఇప్పటికే విజయ్ అభిమానులంతా వేచి చూస్తున్నారు. గత నెలలో ఈ చిత్రానికి సంబంధించి నలుగురు హీరోయిన్ల స్టిల్స్‌తో కూడిన నాలుగు పోస్టర్లను విడుదల చేసిన  చిత్ర యూనిట్.. ఇప్పుడు సినిమా టీజర్‌ని కూడా విడుదల చేసింది.

ఇందులో విజయ్ నలుగురు అమ్మాయిలతో ప్రేమలో పడినట్లుగా చూపించారు. ఐశ్వర్యా రాజేష్, కేథరీన్ ట్రెసా, ఇజబెల్లె లాటే, రాశీ ఖన్నాలు ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించారు. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్‌లో.. చాలామంది అమ్మాయిలతో అఫైర్ నడిపే ఓ ప్లే బాయ్‌గా కనిపించాడు విజయ్.

ఈ టీజర్‌లో రాశీ ఖన్నా వాయిస్ ఓవర్ కూడా వినిపిస్తుంది. ప్రేమను గురించి చెబుతూ.. ‘దాన్ని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవని’ ఆమె హీరోతో అంటుంది. దీనిని బట్టి కథను కూడా మనం ఊహించవచ్చు. విజయ్ ఈ సినిమాలో మొదట ప్లే బాయ్‌గా ఉండి.. ఆ తర్వాత నిజమైన ప్రేమను గురించి తెలుసుకొనే వ్యక్తిగా మారతాడని అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రేమలో పడినా అవతలి వ్యక్తి అర్థం చేసుకోకపోతే పడే వేదనను కూడా కొన్ని సన్నివేశాల్లో చూపించారు. ఈ సన్నివేశాలను చూశాక.. ఈ సినిమా మరో ‘అర్జున్ రెడ్డి’ అయ్యే అవకాశం ఉందని ఇప్పటికే నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

ADVERTISEMENT

“లేడీ రౌడీ”గా రష్మిక.. విజయ్ దేవరకొండ కొత్త ప్లాన్..?

‘ప్రేమంటే రాజీ పడడం కాదు.. ప్రేమంటే ఓ త్యాగం.. ప్రేమలో దైవత్వం ఉంటుంది. అవేవీ నీకు అర్థం కావు’ అంటూ రాశీ ఖన్నా చెప్పే మాటలతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఈ మాటలు చెబుతుండగానే.. షవర్ చేస్తూ బ్యాక్ లెస్‌గా ఓ హీరోయిన్ కనిపిస్తుంది. మరి, ఆమె నలుగురు కథానాయికల్లో ఎవరనేది వేచి చూడాలి. ఈ టీజర్‌లో విజయ్.. ఇటు సింగరేణి బొగ్గు గనిలో పని చేస్తూ.. అటు ఆకాశంలో డైవ్ చేస్తూ కూడా కనిపిస్తాడు. మరి, ఈ ఇద్దరూ ఒక్కరేనా? లేక గౌతమ్, శ్రీను.. రెండూ వేర్వేరు పాత్రలా? అన్న విషయం సినిమా విడుదల తర్వాతే తెలుస్తుంది.

టీజర్ చివరిలో ‘నేను నీతో సమయం మాత్రమే గడపలేదు యామిని.. నిన్ను నిజంగానే ప్రేమించాను..’ అంటూ విజయ్ ఏడుస్తూ అరవడం చూస్తుంటే.. రాశీ ఖన్నా పాత్ర ఈ సినిమాలో ప్రధానమైందని తెలుస్తుంది. టీజర్‌లోనే వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూపించేందుకు లిప్ లాక్‌ని కూడా జోడించారు. ఈ సినిమాలో కేథరీన్ బొగ్గు గనిలో పనిచేసే ఆఫీసర్‌గా, ఇజబెల్లె పైలట్‌గా, ఐశ్వర్య హౌజ్ వైఫ్‌గా కనిపించనున్నట్లు టీజర్‌ని బట్టి తెలుస్తోంది.

ADVERTISEMENT

డియర్ కామ్రేడ్ మూవీ రివ్యూ – ప్రతి అమ్మాయికి ఒక ‘కామ్రేడ్’ అవసరం

‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమా దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిందీ చిత్రం. ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె. ఎస్ రామారావు,  వల్లభలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14 తేదిన ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం ఖమ్మం జిల్లాలోని ఇల్లందులోని బొగ్గు గనులతో పాటు.. ఓ షెడ్యూల్‌ని ఫ్రాన్స్‌లో కూడా పూర్తి చేశారు. 

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల హిట్ తర్వాత.. మంచి పేరు సాధించాడు విజయ్. అయితే ఆ తర్వాత భారీ బడ్జెట్‌తో తీసిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ఫ్లాప్ కావడంతో.. అతడి కెరీర్ కాస్త నెమ్మదించిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితేనే.. విజయ్ కెరీర్ మళ్లీ దూసుకుపోతుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకుడిగా రూపొందించనున్న సినిమాలో నటించనున్నాడు విజయ్.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

ADVERTISEMENT
03 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT