Arpita Khan delivers a baby girl on Salman Khan’s birthday
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మామయ్య అయ్యాడు. ఆయన సోదరి అర్పితా ఖాన్ ఈ రోజు మధ్యాహ్నం ఓ ఆడబిడ్డకు జన్మనివ్వడంతో.. ఖాన్ కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. చిత్రమేంటంటే.. సల్మాన్ పుట్టినరోజు నాడే.. ఈ శుభవార్త వెలువడడంతో సోషల్ మీడియాలో అభిమానులు విశేష రీతిలో అభినందనలు తెలియజేస్తున్నారు. సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ సినీ నటి హెలెన్‌ను రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి పిల్లలు కలగకపోవడంతో.. ఓ అనాథ బాలికను దత్తత తీసుకొని పెంచుకున్నారు. ఆమే అర్పితా ఖాన్.
‘సాహో’లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ పై.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..!
సల్మాన్ తన సోదరి అర్పిత వివాహాన్ని.. హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలెస్‌లో అంగరంగవైభవంగా జరిపించిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుఖ్ రామ్ మనవడైన ఆయుష్ శర్మను పెళ్లాడిందామె. ‘లవ్ యాత్రి’ చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమకు హీరోగా కూడా పరిచయమయ్యాడు ఆయుష్. ఈ చిత్రానికి సల్మాన్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. వరీనా హుస్సేన్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది.
సల్మాన్ ఖాన్‌తో.. మెగా కోడలు ఉపాసన కొణిదెల ప్రత్యేక ఇంటర్వ్యూ..!
ఇక అర్పితా ఖాన్ విషయానికి వస్తే.. ఇంతకు క్రితమే ఓ మగబిడ్డకు జన్మనిచ్చిందామె. తన పేరు అహిల్ శర్మ. లండన్‌లో చదువుకున్న అర్పిత ఫ్యాషన్ డిజైనర్‌గానే కాకుండా.. ఇంటీరియర్ డిజైనర్‌గా కూడా ఆమె సుపరిచితురాలు. ఆమె పెళ్లికి సల్మాన్ ఖాన్ ఎంతో ఖరీదైన రోల్స్ రాయిస్ కారును తన చెల్లెలికి బహుమతిగా ఇచ్చి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే ఆమె పెళ్లిని.. తను కోరిన మీదట హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిపించారు సల్మాన్. ఈ పెళ్లికి బాలీవుడ్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
అర్పిత దంపతులు ఈ రోజు తమకు జన్మించిన బిడ్డకు అయత్ శర్మ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అందరితోనూ పంచుకున్నారు. ప్రతీ సంవత్సరం సల్మాన్ తన పుట్టినరోజు వేడుకలను పాన్వెల్‌లోని తన ఫార్మ్ హౌస్‌లో జరుపుకుంటారు. కానీ ఈసారి ఆయన ముంబయిలో తన సోదరుడు సొహైల్ ఖాన్ ఇంట్లోనే బర్త్ డే జరుపుకున్నారు. దీనికి కారణం మరో రెండు రోజులలో అర్పితకు పుట్టబోయే బిడ్డను దగ్గరుండి చూడాలన్న కోరికేనని ఆయన తెలిపారు. కానీ చిత్రంగా.. ఆయన పుట్టినరోజు నాడే అర్పిత బిడ్డకు జన్మనివ్వడంతో తన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
సల్మాన్ ఖాన్ ఆమెను పెళ్లి చేసుకుంటున్నారట.. నిజమేనా..?
గత నెల వరకు అర్పిత దంపతులు మారిషస్‌లో ఆనందంగా గడిపారు. తమకు పుట్టబోయే బిడ్డ కోసం ఆ బేబీ మూన్ ట్రిప్ ప్రత్యేకమని కూడా తెలిపారు. ఒకప్పుడు తన ఫ్యామిలీ బిజినెస్ కార్యక్రమాలతో బిజీగా గడిపిన ఆయుష్.. ఆ తర్వాత నటుడిగా మారాలన్న కోరికతో ముంబయికి వచ్చారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా తనకు పరిచయమైన అర్పితతో ఆయనకు ఏర్పడిన స్నేహం.. ఆ తర్వాత ప్రేమగానూ మారింది. అదే ప్రేమ.. ఆ తర్వాత పెళ్లికి కూడా దారి తీసింది. నవంబరు 18, 2014 తేదిన వీరి వివాహం హైదరాబాద్‌లో జరిగింది.
మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.