Class of 80’s Renunion (Tenth Anniversary) in Megastar Chiranjeevi’s house, Hyderabad
ఈమధ్య కాలంలో మనం చాలాసార్లు.. పూర్వ విద్యార్థుల రీ-యూనియన్ పార్టీల గురించి వింటున్నాం. ఈ రీ-యూనియన్స్ ఒకప్పుడు కలిసి చదువుకున్న వారిని మరల కలుసుకునే అవకాశాన్ని మాత్రం కాదు.. ఆనాటి ముచ్చట్లను మళ్లీ షేర్ చేసుకొనే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఈ రీ-యూనియన్స్ కాన్సెప్ట్ మన సినీ తరాలకి కూడా బాగా నచ్చేసిందట. అందుకనే ఒకప్పుడు సినీ రంగంలో హీరో, హీరోయిన్లుగా వెలుగొందిన తారలందరూ కలిసి.. ఇలా సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటే బాగుంటుందని నిర్ణయించుకోవడం విశేషం. ఇదే క్రమంలో వారు తమ రీయూనియన్ మీట్‌కి “Class of 80’s ” అంటూ నామకరణం కూడా చేసేసుకున్నారు.
కామెడీ షో ‘జబర్దస్త్’ నుండి.. ‘నాగబాబు’ ఔట్ : అభిప్రాయ భేదాలే కారణమా..?
ఇంతకీ ఈ “Class of 80’s ” అంటే ఏమిటో తెలుసా? 80వ దశకంలో మన చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన వారంతా కూడా.. మళ్లీ ఒక చోట చేరి వారి జ్ఞాపకాలను, స్నేహాలని నెమరు వేసుకోవడమే ఇందులోని స్పెషాలిటీ. ఈ పద్ధతికి వీరందరూ సరిగ్గా 10 ఏళ్ళ క్రితమే శ్రీకారం చుట్టారు. దీనికి అంకురార్పణ చేసింది.. నటి సుహాసిని కాగా.. గత పదేళ్ళలో ప్రతి సంవత్సరం.. ఒక్కొక్క ప్రముఖ నటుడు లేదా నటీమణి ఇళ్లల్లో ఈ మీట్ జరుగుతూ వస్తోంది. మొదటి సంవత్సరం ఈ రీ-యూనియన్ పార్టీ సుహాసిని నేతృత్వంలో చెన్నైలో జరగగా.. ఈ ఏడాది ఈ పార్టీని నిర్వహించే అవకాశం మెగాస్టార్ చిరంజీవికి దక్కింది.
అలాగే ఈ రీ-యూనియన్ పార్టీకి.. ఈ ఏడాదితో 10వ సంవత్సరాలు పూర్తి కావడం విశేషం. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరిగే రీ-యూనియన్‌కి ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్‌ని పెట్టుకోవడం కూడా సంప్రదాయంగా వస్తోంది. ఈ సంవత్సరానికి వీరు ఎంపిక చేసుకున్న రంగు గోల్డ్ & బ్లాక్ కలర్. నటీనటులు కూడా.. ఈ రెండు రంగుల్లో డిజైన్ చేసుకున్న దుస్తుల్లోనే వేడుకకు రావడం గమనార్హం.
ఇక ఈ పార్టీ నిన్న హైదరాబాద్ ప్రాంతంలో చిరంజీవి నివాసంలో జరిగింది. దాదాపు 40 మంది నటీనటులు ఈ వేడుకలకు హాజరయ్యారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులందరూ ఈ పార్టీకి వచ్చి సందడి చేశారు. ఈ పార్టీ సందర్భంగా నటులంతా రకరకాల స్కిట్స్ వేసి.. అందరినీ ఎంటర్టైన్ చేశారు.
ఒకప్పటి బాల నటులు… నేడు స్టార్ హీరో హీరోయిన్లు.. వారెవరంటే..?
చిరంజీవి, మోహన్ లాల్, ప్రభు , జయరామ్, జగపతి బాబు, నాగార్జున, వెంకటేష్, అమల, జయప్రద, జయసుధ, శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్ , నదియా , సుమలత, లిజీ , నరేష్, సుహాసిని, రెహమాన్, జాకీ ష్రాఫ్, రాధ, శోభన, రాధిక, భాగ్యరాజ్‌లు ఈ వేడుకకు హాజరయ్యారు.
ఇక వేడుకలకి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రావాల్సి ఉండగా.. ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినట్లు సమాచారం. అలాగే ప్రతి సంవత్సరం సుమలతతో పాటుగా.. ఆయన భర్త అంబరీష్ కూడా ఈ పార్టీకి హాజరయ్యేవారు. అయితే ఆయన పోయిన ఏడాది గతించడంతో.. ఆయన కూడా ఈ జాబితాలో లేరు.
మనం ఎంతగానో ఆదరించే నటీనటులు ఇలా చిన్నపిల్లలుగా మారిపోయి.. తమ తరం వారితో కలిసి ఇలా సంవత్సరానికి ఒకసారైనా ఒకచోట కలిసి.. ఆ రోజంతా కూడా సంతోషంగా గడపడమనేది నిజంగానే మంచి సంప్రదాయం అనే చెప్పాలి. వీరు చేస్తున్న దానిని స్ఫూర్తిగా తీసుకున్నాయి.. Class 90’s అంటూ కొందరు నటీనటులు కూడా ఇటీవలి కాలంలో కలవడం ప్రారంభించారు.
ఒక రకంగా చెప్పాలంటే.. ఈ నటీ నటులు ఈ విధంగా చేస్తూ.. తమ తరువాతి తరానికి కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఆమె తొలి చిత్రమే “స్వలింగ సంపర్కం”పై : హైదరాబాద్ నటి శ్రీదేవి చౌదరి డేరింగ్ నిర్ణయం