తన డ్యాన్స్‌తో అందరికి షాక్ ఇచ్చిన.. ఐశ్వర్యారాయ్ ముద్దుల కూతురు ఆరాధ్య ..!

తన డ్యాన్స్‌తో అందరికి షాక్ ఇచ్చిన.. ఐశ్వర్యారాయ్ ముద్దుల కూతురు ఆరాధ్య ..!

సాధారణంగా సెలబ్రిటీ లైఫ్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం.. అందరికీ ఉండడం సహజమే. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకి దక్కుతున్న అదే పాపులారిటీని.. సెలబ్రిటీ కిడ్స్ కూడా సొంతం చేసుకుంటున్నారు. ఈ జాబితాలో ఇప్పటికే ఎంతోమంది చేరగా.. అందాల తార ఐశ్వర్యారాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) తనయ ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) మాత్రం కొంత ప్రత్యేకమనే చెప్పాలి. అమ్మతో కలిసి ఎక్కువగా కనిపించే ఈ క్యూట్ గర్ల్‌కి సంబంధించిన ఓ వార్త ... తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


అయితే తల్లి ఐశ్వర్యని ట్రాల్ చేశారనో లేదా తాను ప్రత్యేకంగా దిగిన ఫొటో వైరల్ అయ్యిందనో ఆమె వార్తల్లో నిలిచిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆరాధ్య ఈసారి.. పాపులరైంది ఒక డ్యాన్స్ వీడియో ద్వారా అంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఈ వీడియో కథాకమామీషు ఏంటంటే..ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ షమైక్ ధావర్.. ఏటా వేసవిలో నిర్వహించే స్పెషల్ షో- 'సమ్మర్ ఫంక్' (Summer Funk). ఈ ఏడాది ఈ షోలో భాగంగా ఆరాధ్య బచ్చన్ ఒక గ్రూప్ పెర్ఫార్మెన్స్‌లో పాల్గొంది. ఇంతకీ ఆమె డ్యాన్స్ చేసింది ఏ పాటకో తెలుసా?? ఆ గీతం పేరు "మేరే గల్లీ మే". రణ్ వీర్ సింగ్ నటించిన గల్లీబాయ్ చిత్రంలోని ఆ పాటకు ఆరాధ్య ఉత్సాహంగా ఆడిపాడింది. పాట ప్రారంభం నుండి చివరి వరకు.. ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన ఆరాధ్య తన క్యూట్ మూవ్స్‌తో అందరినీ ఆకట్టుకుంది.


 
 

 

 


View this post on Instagram


#aradhyabachchan cool entry today for @shiamakofficial #summerfunk25years @viralbhayani


A post shared by Viral Bhayani (@viralbhayani) on
వాస్తవానికి ఆ పాటకు డ్యాన్స్ చేయడానికి చాలా జోష్ ఉండాలి. కానీ ఆరాధ్య మాత్రం మంచినీళ్లు తాగినంత సులభంగా డ్యాన్స్ చేసేసింది. తద్వారా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తమ గారాల పట్టి డ్యాన్స్‌ను చూసేందుకు తల్లిదండ్రులు అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యారాయ్‌లతో పాటు నాన్నమ్మ జయా బచ్చన్, అత్త శ్వేతా బచ్చన్ కూడా హాజరయ్యారట


బిడ్డకు ఎలాంటి స్వేచ్ఛను ఇవ్వకుండా తల్లి ప్రేమ, సంరక్షణ అనే నెపంతో ఐశ్వర్యా‌రాయ్ ఆరాధ్యను.. కంట్రోల్‌లో పెడుతుందని ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఆమెను అనేకమంది ట్రాల్ చేశారు. ఇప్పుడు తాజాగా వైరల్ అయిన ఆరాధ్య వీడియోను చూసి ..ఐశ్వర్యను ట్రాల్ చేసిన వారు కూడా ఆమెను ప్రశంసల్లో ముంచెత్తడం విశేషం.


ఆరాధ్య డ్యాన్స్ వైరల్ అయ్యాక.. నటన, డ్యాన్స్.. తన రక్తంలోనే ఉందని, అందుకే ఇంత చక్కగా ఆమె డ్యాన్స్ చేస్తోందని కొందరు పోస్టులు పెట్టారు. ఇప్పటికైనా తల్లి ప్రేమను అర్థం చేసుకొని ఐష్‌ని ట్రాల్ చేయడం ఆపేయాలని పలువురు హితవు పలికారు. అలాగే ఐశ్వర్య చూపే తల్లిప్రేమ కారణంగా ఆరాధ్య స్వేచ్ఛకు ఎలాంటి భంగం వాటిల్లడం లేదని.. ఈ విషయాన్ని గుర్తించాలని ఇంకొందరు కామెంట్ చేశారు.


 
 

 

 


View this post on Instagram


#aradhyabachchan performance today for summerfunk show


A post shared by Viral Bhayani (@viralbhayani) on
ఇటీవల కేన్స్ వేడుకల్లో పాల్గొన్న ఐష్ తన.. ముద్దుల కుమార్తె ఆరాధ్యను సైతం అక్కడికి తీసుకెళ్లింది. సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రాలింగ్ గురించి ఆమెను ప్రశ్నించగా - ఒక తల్లిగా నా కూతురిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తనకు తెలుసని, ఎవరో, ఏవో విమర్శలు చేసినంత మాత్రాన తాను కూతురిపై చూపే ప్రేమలో ఇసుమంతైనా మార్పు ఉండదని స్పష్టం చేసింది ఐష్.


కేన్స్ వేడుకల్లో "ఆఫ్ షోల్డర్ ఫిగర్ హగ్గింగ్ గోల్డెన్ గౌన్"తో రెడ్ కార్పెట్ పై మెరిసిన ఐశ్వర్య.. సింపుల్ మేకప్‌తో అందరి చూపుని తనవైపు తిప్పుకున్న విషయం విదితమే. ఆమెతో పాటు లైట్ యెల్లో కలర్ ఫ్రాక్‌లో ఆరాధ్య కూడా కనిపించి అందరినీ ఆకర్షించింది.


అయితే డ్యాన్స్ విషయంలో తల్లి ప్రతిభను పుణికిపుచ్చుకుందంటూ ప్రశంసలు అందుకుంటున్న ఆరాధ్య.. భవిష్యత్తులో నటన విషయంలోనూ తల్లి అడుగుజాడల్లో నడుస్తుందా? లేదా?? అనేది తెలియాలంటే.. ఇంకా చాలా కాలంపాటు మనం వేచి చూడాల్సిందే.


Image Source: Instagram


ఇవి కూడా చదవండి


మాస్ మసాలా... పూరి జగన్నాధ్ - రామ్‌ల "ఇస్మార్ట్ శంకర్" టీజర్..!


ముగింపు లేకుండా 'సాగే' కథ (మహేష్ బాబు 'మహర్షి' మూవీ రివ్యూ)


కొనసాగుతున్న RRR టైటిల్ వేట.. ఆసక్తికరమైన ఎక్స్‌ప్యాన్షన్స్‌తో సినీ అభిమానుల ట్వీట్స్..!