'చంద్రయాన్ 2' ఓ 'బాహుబలి' : ప్రభాస్‌తో పాటు సెలబ్రిటీల ఆసక్తికర ట్వీట్స్

 'చంద్రయాన్ 2' ఓ 'బాహుబలి' : ప్రభాస్‌తో పాటు సెలబ్రిటీల ఆసక్తికర ట్వీట్స్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ రోజు చంద్రుడిపై అదనపు పరిశోధనల నిమిత్తం పంపించిన చంద్రయాన్ 2  (Chandrayaan 2) ఉపగ్రహం.. విజయవంతంగా లాంచ్ అయ్యింది. శ్రీహరికోట నుండి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దాదాపు 3.84 లక్షల కిలో మీటర్ల దూరం ఈ ఉపగ్రహం ప్రయాణించనుంది. సెప్టెంబరు 7వ తేదిన ఇది చంద్రుడిపై కాలు మోపనుంది. ఈ ప్రతిష్టాత్మకమైన ఘటనను పురస్కరించుకొని.. ఎందరో చలనచిత్ర ప్రముఖులు ప్రస్తుతం ఇస్రోపై తమ అభినందనలను కురిపిస్తున్నారు. 

చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చాలా కష్టపడి, శ్రమకోర్చి చేయడం జరిగింది.  ఇస్రోకు శుభాకాంక్షలు. నమ్మకంతో విజయాన్ని పొందారు - షారుఖ్ ఖాన్ 

మనం నిజంగానే అదృష్టవంతులం. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా జరిగిన  చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చూసే అవకాశం మనకు దక్కింది. ఇస్రో నుంచి ప్రయోగించిన ఈ తొలి ఉపగ్రహంలో ఇద్దరు మహిళలు ప్రధాన పాత్ర పోషించారు. ఈ ప్రపంచాన్ని మహిళలు ఏలుతున్నారు. ఇస్రోకి శుభాకాంక్షలు - కరణ్ జోహార్

 

ఇస్రో మరో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రయాన్‌-2 విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ఆ బృందానికి నా సెల్యూట్ - అక్షయ్ కుమార్ 

 చాలా గర్వంగా ఉంది ఇస్రో. ఇది నిజంగానే ఓ అద్భుతమైన ప్రారంభం. చాలా ఆనందంగా ఉంది - మాధవన్ 

చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రోకు ఆల్ ది బెస్ట్‌. భారత్ వెలిగిపోతోంది - రకుల్ ప్రీత్ సింగ్

చంద్రయాన్‌-2ను విజయవంతంగా ప్రయోగించారు. అందుకు భారత పౌరులుగా మనం ఎంతో గర్వపడాలి. ఎన్నో సాంకేతిక సవాళ్లను అధిగమించి.. 300 టన్నుల బరువుతో ఉపగ్రహాన్ని రూపొందించడం మాటలు కాదు. ఈ ఉపగ్రహాన్ని ‘బాహుబలి’తో పోల్చడం.. మా ‘బాహుబలి’ చిత్ర బృందానికే ఓ గౌరవం. మోర్‌ పవర్‌ టు ఇండియా - ప్రభాస్

ఇస్రో నిజంగానే చరిత్రను తిరగరాసింది.. చంద్రయాన్‌-2ను విజయవంతంగా ప్రయోగించినందుకు శుభాకాంక్షలు.. జై హింద్‌ - ఎస్‌.ఎస్‌. రాజమౌళి

భారత్‌ మరో గొప్ప ఘనతను  సాధించింది. చంద్రయాన్‌-2ను విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రోకు శుభాకాంక్షలు - అక్కినేని నాగార్జున

ఇవి కూడా చదవండి

ఇస్రో శాస్త్రవేత్త నంబి పాత్ర‌లో మాధ‌వ‌న్ లుక్ ఎలా ఉందో మీరు చూశారా

మిషన్ మంగళ్ చిత్రం కోసం.. "ఇస్రో శాస్త్రవేత్తలు"గా మారిన స్టార్ హీరోయిన్స్

గణితంలో భారతీయుల సత్తాని ప్రపంచానికి చాటిన .. "హ్యూమ‌న్ కంప్యూట‌ర్" శ‌కుంత‌లా దేవి

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.