యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అరుదైన ఫోటోలు (ఫ్యాన్స్‌కు ప్రత్యేకం)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అరుదైన ఫోటోలు (ఫ్యాన్స్‌కు ప్రత్యేకం)

బాహుబలి సినిమాతో.. దేశమంతా లెక్కలేనంత మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న తెలుగు నటుడు ప్రభాస్ (Prabhas). రెబల్ స్టార్ క్రిష్ణంరాజుకి స్వయానా సోదరుడి కుమారుడైన ప్రభాస్..ఈశ్వర్ చిత్రంతో తన నటనా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.


ఆ తర్వాత రాఘవేంద్ర, వర్షం, అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, యోగి, మున్నా.. మొదలైన చిత్రాలతో తనకంటూ ఒక సరికొత్త పంథాను ఏర్పాటు చేసుకున్నాడు ప్రభాస్. మనం కూడా ఈ యంగ్ రెబర్ స్టార్ జీవితంలోని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామా..!


23 అక్టోబర్, 1979 తేదిన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించాడు ప్రభాస్. హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీ నుండి తను బీటెక్ చేశాడు.


ప్రభాస్‌కి ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ప్రబోధ్, ప్రగతి వారి పేర్లు. అల్లు అర్జున్, గోపీచంద్, రానా దగ్గుబాటి వంటి ఇండస్ట్రీ మిత్రులతో ప్రభాస్‌కు మంచి సత్సంబంధాలు ఉన్నాయి.


prabhas-1


ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. బాహుబలి చిత్రంలో నటించక ముందే.. ప్రభాస్ ఓ బాలీవుడ్ చిత్రంలో అతిథి పాత్రలో నటించారు. ఆ చిత్రం పేరే యాక్షన్ జాక్సన్.


prabhas-7


ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో.. తన మైనపు విగ్రహానికి చోటు దక్కించుకున్న తొలి దక్షిణాది నటుడు ప్రభాస్ కావడం గమనార్హం. సినిమాల్లోకి రాక ముందు.. హోటల్స్ వ్యాపార రంగంలోకి రావాలని తొలుత భావించారట ప్రభాస్.


prabhas-5


ప్రభాస్‌కు నచ్చిన ఫేవరెట్ వంటకాలు ఏమిటో తెలుసా? బటర్ చికెన్, చికెన్ బిర్యానీ. ఇంకో విషయం ఏమిటంటే ప్రభాస్ బాలీవుడ్ సినిమాలు తెగ చూస్తుంటారట. రాజ్ కుమార్ హిరాణీకి ఆయన పెద్ద ఫ్యాన్. మున్నాభాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్ సినిమాలను ప్రభాస్ లెక్కలేనన్నిసార్లు చూశారట.


prabhas-8


బాహుబలి సినిమా కోసం తన నాలుగేళ్ల కెరీర్‌ని సైతం పణంగా పెట్టారు ప్రభాస్. ఆ సినిమా కోసం తన ఫిట్‌నెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి.. ఇంట్లోనే ఓ వాలీబాల్ కోర్టు నిర్మించుకున్నారట. హాలీవుడ్ లెజెండ్ రాబర్ట్ డీ నీరో అంటే ప్రభాస్‌కి ఎంతో ఇష్టం.


prabhas-6


ప్రభాస్‌ని ప్రేమగా అనేక నిక్ నేమ్స్‌తో తన అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. ప్రభా, పబ్సీ, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ అనే పేర్లతో తనను అభిమానులు ఎక్కువగా పిలుస్తుంటారు.


prabhas-9


ఇటీవలే ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తన ఖాతా ప్రారంభించారని.. పోస్టులేవీ లేకపోయినా.. ఇప్పటికే 7 లక్షలమంది తనను ఫాలో అయ్యారని వార్తలు వస్తున్నాయి.


prabhas-10


ఇవి కూడా చదవండి


ప్రభాస్ కోసం.. హైదరాబాద్‌కి తరలి వస్తున్న రోమ్ నగరం..!


ప్రభాస్ అభిమానులకు పండగే.. సాహో రిలీజ్ డేట్ తెలిసిపోయిందిగా..?


ఆ హాలీవుడ్ యాక్షన్ స్టార్‌కి.. "బాహుబలి 3"లో ఛాన్స్ కావాలట..!