ADVERTISEMENT
home / Bollywood
మెగా పవర్‌స్టార్  రామ్‌చరణ్.. తన చిన్ననాటి స్కూల్‌ని సందర్శించిన వేళ…!

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్.. తన చిన్ననాటి స్కూల్‌ని సందర్శించిన వేళ…!

గుర్తుకొస్తున్నాయి… గుర్తుకొస్తున్నాయి… నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ (Naa Autograph Sweet Memories) చిత్రంలోని ఈ పాట అనేకమందికి తమ ఫేవరెట్ సాంగ్స్‌లో ఒకటి. ఈ పాట మనం బాల్య స్నేహితులతో గడిపిన క్షణాలను, చిన్నప్పుడు  స్కూల్లో జరిగిన సంఘటనలను, సరదాలను మరల మరల గుర్తుచేస్తుంది. మనలో ప్రతిఒక్కరికీ పాఠశాల రోజులు మిగిల్చిన ఎన్నో మధుర జ్ఞాపకాలు అప్పుడప్పుడు గుర్తుకురావడం సహజమే కదా. ముఖ్యంగా మనం చేసిన అల్లరి పనులు, చదువుకున్న తరగతి గది, ఆటలాడుకున్న స్థలం .. ఇలా అనేక విషయాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి.

ప్రతీ ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా తమ పాఠశాలను సందర్శించాలనుకోవడం సహజమే. ఇలాంటి ఆలోచనే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి (Ramcharan) కూడా వచ్చింది . వివరాల్లోకి వెళితే.. చిరంజీవి తనయుడు, టాలీవుడ్ మేటి హీరోల్లో ఒకరైన రామ్‌చరణ్ తాను చిన్నతనంలో తమిళనాడులో చదివిన లారెన్స్ స్కూల్‌ను (Lawrence School) నిన్న సందర్శించారు. ఈ క్రమంలో తన గత జ్ఞాపకాలను కొద్ది గంటలు.. ఆ పాఠశాల ప్రాంతంలో కలియతిరుగుతూ నెమరువేసుకున్నారు కూడా.  ఈ స్కూలు ఊటీకి 5 కిలోమీటర్ల దూరంలోని లవ్ డేల్ (Lovedale)  గ్రామంలో ఉంది. చరణ్, తన సతీమణి ఉపాసనతో కలిసి ఈ పాఠశాలను సందర్శించారు. 

రామ్ చరణ్ తన ప్రాధమిక విద్యాభ్యాసాన్ని ఈ స్కూల్‌లోనే పూర్తి చేశారు. నిన్న ఈ స్కూల్‌ని సందర్శించడానికి వెళ్లినప్పుడు అక్కడున్న భవనాలు, తరగతి గదులు, క్యాంటీన్.. వంటి ప్రదేశాల్లో చెర్రీ కలియతిరిగారు. అలాగే టీచర్లతో ముచ్చటించారు. అంతేనా.. ప్రస్తుతం అక్కడ చదువుతున్న విద్యార్థులతో కలిసి సరదాగా సమయం గడిపి వారితో ఫొటోలు కూడా దిగారు. అడిగిన విద్యార్థులకు ఆటోగ్రాఫ్స్ కూడా ఇచ్చి.. వారితో ఆ స్కూల్‌తో తనకున్న జ్ఞాపకాలను కూడా పంచుకున్నారు.

 

ADVERTISEMENT

ఈ క్రమంలో చెర్రీ పిల్లలతో కలిసి దిగిన సెల్ఫీలను, లారెన్స్ స్కూల్‌ని సందర్శించినప్పుడు తీసిన ఫొటోలను ఆయన సతీమణి ఉపాసన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలను పంచుకుంటూ- “తన స్కూల్‌ని సందర్శించిన Mr.C. ఈ స్కూల్‌తో ఆయనకి ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నిన్న అక్కడికి వెళ్లాక చరణ్‌లోని చిన్న పిల్లాడు బయటకి వచ్చాడు. ఇలాంటి జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉండిపోతాయి” అని ట్వీట్ కూడా చేశారు ఉపాసన.

అయితే చెర్రీ చదువుకున్న ఈ లారెన్స్ లవ్ డేల్ స్కూల్‌కి చాలా పెద్ద చరిత్రే ఉంది. దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు మీకోసం.. 

బ్రిటిష్ జనరల్ సర్ హెన్రీ మోంట్గోమేరీ లారెన్స్కి (Sir Henry Montogomery Lawrence) వచ్చిన ఒక ఆలోచనకి రూపమే ఈ లారెన్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. భారతదేశంలో ఉంటున్న బ్రిటిష్ సైన్యానికి చెందిన పిల్లల కోసం ఈ దేశంలో ఒక గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌ని ప్రారంభించి నాణ్యమైన విద్యని అందించాలని ఆయన అనుకున్నారు. ఆ ఆలోచన నుండి ఉద్భవించిన స్కూలే ఈ లారెన్స్ స్కూల్. అందుకే ఈ పాఠశాల ఆయన పేరుతోనే ప్రారంభమైంది. ఇక స్వాతంత్య్రం వచ్చాక ఈ పాఠశాల నిర్వహణ బాధ్యతను భారత ప్రభుత్వం తీసుకోగా.. ప్రస్తుతం ఈ పాఠశాలలో సుమారు 700 మంది విద్యార్థులు చదువుతున్నారు.

ramcharan-1

ADVERTISEMENT

సుమారు 750 ఎకరాల విస్తీర్ణంలో బాలబాలికల కోసం ఈ పాఠశాలను నిర్మించారు. కేజీ నుంచి 12వ తరగతి వరకు ఇందులో విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. ఇక ఈ పాఠశాలలో చదివి వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖులు ఎందరో ఉన్నారు. రామ్ చరణ్‌తో పాటుగా మహీంద్రా సంస్థల యజమాని ఆనంద్ మహీంద్రా (Anand Mahindra), రచయిత్రి అరుంధతీ రాయ్ (Arundhati Roy), నటుడు అక్షయ్ ఖన్నా (Akshay Khanna) మొదలైన వారిని ఈ స్కూలు పూర్వ విద్యార్థులుగా చెప్పుకోవచ్చు.

ఈ కథనం చదివాక మీకు కూడా ఒకసారి మీరు చదువుకున్న స్కూల్‌కి వెళ్లి రావాలనిపిస్తోంది కదూ! మరింకెందుకు ఆలస్యం.. త్వరలోనే మీరు చదువుకున్న స్కూల్‌ని & చిన్ననాటి స్నేహితులని ఈ వేసవి సెలవుల్లో ఒకసారి కలిసేందుకు ప్లాన్ చేయండి. అంతవరకు ‘గుర్తుకొస్తున్నాయి’ అనే పాట వింటూ.. మీ మది అంతరాల్లో నిక్షిప్తమై ఉన్న ఆ జ్ఞాపకాలని ఒకసారి నెమరువేసుకునే ప్రయత్నం చేయండి.

Featured Image: https://www.instagram.com/upasanakaminenikonidela/

ఇవి కూడా చదవండి

ADVERTISEMENT

కొనసాగుతున్న RRR టైటిల్ వేట.. ఆసక్తికరమైన ఎక్స్‌ప్యాన్షన్స్‌తో సినీ అభిమానుల ట్వీట్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’.. ట్రైలర్ టాక్ ప్రత్యేకతలివే..!

సల్మాన్ ఖాన్ కోసం.. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక నిర్ణయం..!

06 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT