హాలిడే కి వెళ్లిన ఆ ఇద్దరి జీవితం ఎలా మారింది..? ఆకట్టుకుంటోన్న నిశ్శబ్దం టీజర్..

హాలిడే కి వెళ్లిన ఆ ఇద్దరి జీవితం ఎలా మారింది..? ఆకట్టుకుంటోన్న నిశ్శబ్దం టీజర్..

అందం & అభినయం కలగలిపిన నటి అనుష్క (anushka). ఈమె తెలుగు తెరపైన తెరంగేట్రం చేసినప్పుడు చాలా మంది ఒక సాధారణ నటిగానే పరిగణించారు. అయితే ఆమె ఎప్పుడైతే జేజమ్మగా అరుంధతి చిత్రంలో నటించిందో అప్పటి నుండి నేటి వరకు తిరిగి చూసుకోకుండా ఉండేంత స్టార్ డమ్ ఆమె సొంతమైంది. అదే విధంగా ప్రేక్షకుల్లో కూడా ఆమెకి ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోగలిగింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 షో పైన సామాన్య ప్రజలు ఇచ్చిన రివ్యూ ఏంటంటే

ఇదిలావుండగా బాహుబలి రెండు చిత్రాలు విడుదలయ్యాక, 2018లో భాగమతి చిత్రం తర్వాత ఇప్పటి వరకూ అనుష్క చిత్రం మరొకటి విడుదల కాలేదు. ఇప్పుడు భాగమతి విడుదలైన దాదాపు సంవత్సరం తర్వాత నిశ్శబ్దం (nishabdham) అనే ఒక చిత్రం కి సంబందించిన టీజర్ (nishabdham teaser) విడుదలైంది. రేపు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ విడుదల చేయడం విశేషం.

మరి దాదాపు సంవత్సరం కాలం సమయం తీసుకుని మరి చేసిన ఈ నిశ్శబ్దం (హిందీ & ఇంగ్లిష్ లో సైలెన్స్ పేరిట విడుదలవుతుంది) సినిమాని ఒక హాలీవుడ్ క్రాస్ ఓవర్ చిత్రంగా పరిగణిస్తున్నారు, కారణం ఇందులో ప్రధాన పాత్రలో ఇంగ్లిష్ నటుడు ఉండడం.. ఈ సినిమా ఇంగ్లీష్ భాషలో కూడా తెరకెక్కిస్తుండడమే కారణం. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదలబోతోంది. 

ఇంతకి కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ నిశ్శబ్దం టీజర్ ఎలా ఉందంటే -

మ్యూట్ ఆర్టిస్ట్ అయిన అనుష్క తన భాగస్వామి మాధవన్ తో కలిసి ఒక ప్రాంతానికి వెళుతుంది. ఇక మాధవన్ ఒక పెద్ద సెలబ్రిటీ మ్యుజిషియన్ అయిన కారణంగా ఎక్కువగా జనారణ్యం లేని చోటుకి వెళతారు. అక్కడ వీరు ఉంటున్న ఒక ఇంటిలో జరిగే కొన్ని అనుకోని సంఘటనలు వీరిరువురి జీవితాలని తారుమారు చేస్తాయి. ఆ అనుకోని సంఘటనల ఎందుకు జరిగాయి? వాటి వెనుక ఉన్న బలమైన కారణాలు ఏంటి? అనేవాటి పైన విచారణ జరిపేందుకు అక్కడి లోకల్ పోలీస్ ఆఫీసర్ మైఖేల్ మ్యాడ్ సేన్ రావడం జరుగుతుంది. మరి టీజర్ లో చూపెట్టినట్టుగా ఆ ఇంటిలో ఏం జరిగింది అని అన్నది మనం సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

నా భర్తని చంపింది నేనే అంటోన్న ఈషా రెబ్బ .. అసలు ఏం జరిగింది? - రాగల 24 గంటల్లో ట్రైలర్ టాక్

ఈ టీజర్ చూస్తుంటే మనకి ఇందులో చాలామంది తెలుగు నటీనటులు కనిపిస్తున్నారు. వారిలో ప్రధానంగా డిటెక్టివ్ పాత్రలో నటి అంజలి, అవసరాల శ్రీనివాస్, షాలిని పాండే, సుబ్బరాజు వంటి తదితరులు ఈ చిత్ర తారాగణంలో ఉన్నారు. దాదాపు వీరందరివి కూడా కీలక పాత్రలు అయి ఉండొచ్చు అని ఈ టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది.

 

ఇక ఇంతటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని చాలా అత్యద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు హేమంత్ మధుకర్. అలాగే దర్శకుడి దృష్టికోణాన్ని తన అసాధారణమైన కెమెరా ప్రతిభతో మన కళ్ళముందు ఉంచాడు ఛాయాగ్రాహకుడు షానియేల్ డియో. హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రానికి టెక్నకల్ గా మెరుగులద్దినట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. అలాగే వీరికి అన్నిరకాలుగా ఈ చిత్ర నిర్మాతలు - కోన వెంకట్ & విశ్వప్రసాద్ లు తోడ్పాటుని అందించగలిగారు.

నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. బహుశా నిశ్శబ్దం ఈ ఏడాది చివరిలో భాగంలో లేదా వచ్చే సంవత్సరం తొలి భాగంలో విడుదల అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకేసారి నాలుగు భాషల్లో తెరకెక్కిన ఈ నిశ్శబ్దం (nishabdham) చిత్రం అంతే భారీ స్థాయిలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాలని కోరుకుందాం.

ఇవ్వని పక్కకి పెడితే, మన అనుష్క రేపు జరుపుకోబోయే 38వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆమెకి ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె ఇలాగె మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా ఆశిద్దాం.

యాడ్ షూట్ లో కలిసి జీవితాంతం ఒకరికి ఒకరై.. విరాట్ - అనుష్క ల అద్బుత ప్రేమ కథ..