ADVERTISEMENT
home / Bollywood
కబీర్ సింగ్ మూవీ రివ్యూ – హిందీలోనూ తన సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగ ..!

కబీర్ సింగ్ మూవీ రివ్యూ – హిందీలోనూ తన సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగ ..!

తెలుగు సినీపరిశ్రమలో విభిన్నమైన కథాంశాలతో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు పలకరిస్తూనే ఉన్నాయి. అలా 2017లో ఓ దర్శకుడు చేసిన ప్రయత్నమే అర్జున్ రెడ్డి (Arjun Reddy). ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అందులో ఎలాంటి సందేహం లేదు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాదు.. ఈతరానికి సంబంధించిన సినిమాల్లో ఓ కొత్త ఒరవడిని సైతం సృష్టించింది.

రీమేక్ ట్రెండ్ బాగా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సినిమాను సైతం పలు భాషల్లో తెరకెక్కించేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారు. హిందీలో ఇదే చిత్రం కబీర్ సింగ్ (Kabir Singh) పేరుతో రీమేకైంది. అర్జున్ రెడ్డి హిందీలో రీమేక్ అవుతుందనే వార్తలు వచ్చినప్పటి నుండీ..  ఈ రెండు చిత్రాలనూ ఎప్పటికప్పుడు పోల్చి చూడసాగారు సినీ అభిమానులు.

కబీర్ సింగ్ చిత్రానికి మాతృక అయిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. హిందీ వెర్షన్‌కి కూడా దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో తెలుగు సినిమానే యథావిథిగా హిందీలోనూ తెరకెక్కిస్తున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఉత్తరాది ప్రేక్షకులకు తగినట్లుగా కథలో మార్పులు చేశామని.. సినిమా విడుదలయ్యాక ఆ విషయం ప్రేక్షకులకే అర్థమవుతుందని తెలిపారు సందీప్ రెడ్డి. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వాణీ హీరోహీరోయిన్లుగా నటించారు. మరి, తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందంటే..

ADVERTISEMENT

Kabir Singh Review

https://twitter.com/shahidkapoor

అర్జున్ రెడ్డి సినిమాలో కనిపించిన పాత్రలే ఈ చిత్రంలోనూ మనకు ప్రధానంగా కనిపిస్తాయి. కబీర్ రాజ్ బీర్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్, ప్రీతీ పాత్రలో కియారా కనిపించగా.. తెలుగు చిత్రంలో చూపించిన విధంగానే.. దాదాపు ప్రతీ సీన్‌ను తెరకెక్కించారు. కబీర్, ప్రీతి కాలేజీలో ఒకరినొకరు ప్రేమించుకోవడం, విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసి తనకు వేరే పెళ్లి చేయడం.. వంటి సన్నివేశాలే హిందీ వెర్షన్‌లోనూ కనిపిస్తాయి.

అయితే ప్రేమలో విఫలమైన కబీర్ సింగ్ జీవితం చివరకు ఏమైందన్నదే ఈ చిత్ర కథ. ఆ కథను ఉత్తరాది ప్రేక్షకుల నెటివిటీకి తగినట్లు మార్పులు  చేశారు సందీప్ రెడ్డి. హీరో తల్లి పాత్రకు ప్రాధాన్యమివ్వడంతో పాటు, హీరో – హీరోయిన్ల పెళ్లికి కులాన్ని ప్రధాన కారణంగా చూపకుండా.. వేరే కారణాన్ని చూపిస్తూ దాన్ని వివాహానికి అడ్డంకిగా మార్చారు. ఇవన్నీ ఉదాహరణలే.

 

ADVERTISEMENT

కబీర్ సింగ్ కథ విషయానికి వస్తే..

కబీర్ సింగ్ గా షాహిద్ కపూర్ నటన

నిజం చెప్పాలంటే.. అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ ప్రదర్శించిన అభినయం చాలా ఏళ్ల పాటు ఎవ్వరూ మరిచిపోలేరన్నది సత్యం. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకునే సాహసం కూడా చాలామంది చేయరు. అంతగా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు తన నటనతో ప్రాణం పోశాడు విజయ్. ఇలాంటి పాత్ర మరొకరు చేయాలంటే అందుకు ఎంతో ధైర్య, సాహసాలు ఉండాల్సిందే. అందుకే ఇప్పుడంతా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ పెద్ద సాహసమే చేశాడని అంటున్నారు.

షాహిద్ తన నటనతో కబీర్ సింగ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లారంటే అది అతిశయోక్తి అస్సలు కాదు. ఈ సినిమా చూస్తున్నంత సేపూ.. ఎక్కడా విజయ్ దేవరకొండ అసలు గుర్తు రారంటే అతిశయోక్తి కాదు. షాహిద్ నటన ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుందని మనం అర్థం చేసుకోవచ్చు. షాహిద్ కెరీర్‌లో అందుకే ఈ చిత్రం.. ఒక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహాలు లేవు.

ADVERTISEMENT

https://twitter.com/shahidkapoor

ప్రీతీ గా కియారా అద్వాని

అర్జున్ రెడ్డి సినిమాలో హీరో పాత్ర ఎంత ముఖ్యమో.. హీరోయిన్ పాత్ర కూడా అంతే ముఖ్యం. అటువంటి పాత్రలో నటించే అవకాశం వస్తే దానిని తమ లక్‌గానే భావిస్తారు యంగ్ హీరోయిన్స్. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ కూడా తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకొంది. ప్రీతి పాత్రలో చక్కని ప్రతిభను కనబరిచింది. ఈ పాత్ర తనకు కూడా మంచి పేరు తీసుకొస్తుందని చెప్పచ్చు.

మరోవైపు హీరో స్నేహితుల పాత్రలు కూడా ఈ కథకు కీలకమే. వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక తెలుగులో హీరో నాన్నమ్మగా నటించిన కాంచన పాత్రలో.. బాలీవుడ్ వెటరన్ నటి కామినీ కౌశల్ నటించడం విశేషం. అలాగే హీరో అన్నగా భద్ర మూవీ ఫేమ్ అర్జున్ భజ్వా ఆ పాత్రకు ప్రాణం పోశారు. వీరంతా వారి వారి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయి కథకు మరింత బలాన్ని చేకూర్చారు.

ADVERTISEMENT

https://twitter.com/Advani_Kiara

‘కబీర్ సింగ్’ ని సందీప్ రెడ్డి వంగ ఎలా తీసాడంటే –

తెలుగు చిత్రసీమలో తన మార్క్ దర్శకత్వంతో.. అందరి మైండ్ బ్లాక్ చేసిన డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారనగానే..  అందరికీ ఆసక్తి మరింత పెరిగింది . ముఖ్యంగా సందీప్ టేకింగ్ బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకోనుందనే ప్రశ్న కూడా చాలామందిలో తలెత్తింది. 

కబీర్ సింగ్ చిత్రాన్ని చూస్తే తెలుగులో మాదిరిగానే.. హిందీలోనూ కథను 95% బోల్డ్ అండ్ రెబల్‌గా తెరకెక్కించారు సందీప్ రెడ్డి. అంతేకాదు.. తెలుగులో చాలా సీన్స్ హద్దులు దాటాయంటూ విమర్శలు ఎదుర్కోగా.. హిందీలో అంతకు మించిన బోల్డ్ సీన్స్‌కు రూపకల్పన చేశారు. తెలుగులో కనుక ఇవే సన్నివేశాలు ఉంటే.. కచ్చితంగా సెన్సార్ కత్తెరని దాటి బయటకు వచ్చేవి కావేమో. అలాగే హిందీలో కథను బట్టి.. నేటివిటీ కోసం అక్కడక్కడా పంజాబీ కూడా మనకు వినిపిస్తుంది. 

ADVERTISEMENT

https://twitter.com/imvangasandeep

తెలుగులో అర్జున్ రెడ్డి ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలవడానికి గల ప్రధాన కారణాల్లో సౌండ్ & విజువల్స్ కూడా ఒకటి. ఈ రెండు విభాగాలు అర్జున్ రెడ్డి‌ని ఒక కల్ట్ సినిమా‌గా మార్చేశాయి. ఇక కబీర్ సింగ్ విషయానికి వస్తే; ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవి కె చంద్రన్ తన కెమెరా పనితనంతో ఈ చిత్రాన్ని చక్కగా తీర్చిదిద్దారు. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే.. తెలుగు వెర్షన్‌కి పనిచేసిన హర్షవర్ధన్ రామేశ్వర్.. కబీర్ సింగ్‌కి కూడా పనిచేశాడు. తెలుగు వెర్షన్‌లో లేని కొన్ని సౌండ్ వెర్షన్స్ కూడా ఇందులో మనకు వినిపిస్తాయి. ఇక పాటలు కూడా సినిమా కథ, సన్నివేశాలకు తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణం విషయానికి వస్తే.. ఈ సినిమాను కేవలం ఇండియాలోనే తెరకెక్కించడం జరిగింది. టీ -సిరీస్ & సినీ స్టుడియోస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి.

ఆఖరుగా కబీర్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్‌ని చూస్తున్నంత సేపు మనకి విజయ్ దేవరకొండ గుర్తుకి రాడు. ఆ స్థాయిలో షాహిద్ కపూర్ అభినయం ఉంటుంది. ఈ కబీర్ సింగ్‌కి బలం షాహిద్ కపూర్ & సందీప్ రెడ్డి వంగ.

ఇవి కూడా చదవండి

మల్లేశం మూవీ రివ్యూ – ఇది ఓ సామాన్యుడి అసామాన్య ప్రయాణం

ADVERTISEMENT

మరోసారి ప్రేక్షకులని ‘ఫిదా’ చేస్తామంటున్న సాయి పల్లవి – శేఖర్ కమ్ముల

‘రాజు గారి గది 3’ చిత్రంలో హీరోయిన్‌గా.. మిల్కీ బ్యూటీ తమన్నా

సాంకేతికంగా కబీర్ సింగ్ ని చూస్తే –

21 Jun 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT