Bigg Boss Telugu 3: హౌస్‌లో శివజ్యోతి చేత.. కన్నీళ్ళు పెట్టించిన బాబా భాస్కర్ !

Bigg Boss Telugu 3:  హౌస్‌లో శివజ్యోతి చేత.. కన్నీళ్ళు పెట్టించిన బాబా భాస్కర్ !

బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) 'సీజన్ 3'లో భాగంగా.. నిన్నటి ఎపిసోడ్‌లో శివజ్యోతి కన్నీటిపర్యంతమైంది. అయితే ఈసారి ఆమె కంటతడి పెట్టడానికి కారణం.. బాబా భాస్కర్ (Baba Bhaskar) ఆమెని గురించి చేసిన వ్యాఖ్యలే! ఇంతకీ అసలు ఏం జరిగిందంటే - శివజ్యోతి ఇంట్లో ఎవరో ఒకరితో అనుబంధం పెంచుకుని.. వారు హౌస్ విడిచిపెట్టినప్పుడు చాలా బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మరొకసారి అటువంటి తప్పు చేయకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో.. ఆమెతో నిన్న జరిగిన ఒక టాస్క్‌లో భాగంగా బాబా భాస్కర్ తన అభిప్రాయాన్ని తెలిపారు. 

Bigg Boss Telugu 3: డబుల్ ఎలిమినేషన్‌కి ప్లాన్ చేసిన బిగ్‌బాస్?

దానికి శివజ్యోతి (shivajyothi) సమాధానమిస్తూ.. 'రోహిణి, అషురెడ్డిలతో తాను ఎంతో ఇష్టపడి స్నేహం చేశానని... అయితే అందులో ఒకరు తన కారణంగా ఎలిమినేట్ కావడం వల్ల' ఎక్కువగా బాధపడ్డానని ఆమె తెలిపింది. రోహిణి, అషులు హౌస్ నుండి బయటకు వెళ్లాక.. ఆ బాధ నుండి కోలుకుంటున్న క్రమంలో.. అలీ రెజా ఎలిమినేట్ అవ్వడం తనను బాగా బాధించిందని శివజ్యోతి తెలిపింది. 

తనకి, అలీ రెజాకి మధ్యనున్న అనుబంధం అన్న, చెల్లెళ్ల బంధమని... అలాంటిది అలీ కూడా అనూహ్యంగా ఎలిమినేట్ కావడం వల్ల తాను ఇంకా బాధపడ్డానని.. ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడింది. ప్రస్తుతం తనకు తోడుగా ఉన్న రవికృష్ణ కూడా  ఎలిమినేట్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే.. తాను త్యాగం చేశానని ఆమె స్పష్టం చేసింది. అయితే ఇంతమంది బయటకి వెళ్ళినప్పుడు బాధపడిన తాను.. మళ్ళీ ఆ బాధ నుండి తనంతట తానే బయటపడుతున్నానని తెలిపింది.

కాకపోతే ఇంతలా వివరణ ఇచ్చిన తరువాత.. ఆమె తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. బాబా భాస్కర్ మాస్టర్ ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదని ఆమె బాధపడింది. అలాగే బాబా భాస్కర్ ఇలా తనని ప్రశ్నిస్తాడని అనుకోలేదని ఆమె పేర్కొంది. ఇక ఈ అంశానికి సంబంధించిన ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కానుంది.

Bigg Boss Telugu 3: హిమజ చేసిన పొరపాటుకు.. మహేష్ విట్టా బలయ్యాడు..!

ఇదిలావుండగా నిన్నటి ఎపిసోడ్‌లో నామినేషన్స్‌కి సంబంధించి రవికృష్ణ, రాహుల్ సిప్లిగంజ్‌లకు బిగ్ బాస్ సూచించిన టాస్క్ పూర్తయింది. రవికృష్ణ నామినేషన్స్‌లో ఉండకూడదందటే.. శివజ్యోతి తన జుట్టుని కత్తిరించుకోవాలని చెప్పగా.. ఆమె వెంటనే తన జుట్టుని కత్తిరించుకుంది. ఆ తరువాత రాహుల్ సిప్లిగంజ్.. ఈ వారం నామినేషన్స్‌లో ఉండకూడదని భావిస్తే.. పునర్నవి ఓ త్యాగం చేయాలని.. ఈవారం తప్పించి మిగిలిన అన్ని వారాలకి ఆమె నామినేట్ అవుతూనే ఉండాలని బిగ్ బాస్ (Bigg Boss) చెప్పడం జరిగింది.

అయితే ప్రాక్టికల్‌గా ఆలోచించి చూస్తే ఇది సాధ్యం కాదని.. పునర్నవి వచ్చే వారం నుండి ప్రతి వారం నామినేషన్స్‌లో ఉండడం కరెక్ట్ కాదని..  అందుచేత తనే ఈ వారం నామినేషన్స్‌లో ఉంటే మేలని రాహుల్ అభిప్రాయపడ్డారు. తానే నామినేట్ అయ్యారు.

ఈ ఘట్టం ముగిసాక, ఇంటి కెప్టెన్ వితిక తనకున్న స్పెషల్ పవర్‌ని ఉపయోగించి.. ఎవరో ఒకరిని నామినేట్ చేయవచ్యని బిగ్ బాస్ తెలిపారు. ఈ క్రమంలో ఆమె హిమజ పేరు చెప్పింది. దీనితో ఈ వారం నామినేషన్స్‌లో మహేష్ విట్టా, రాహుల్ సిప్లిగంజ్, హిమజలు చోటు దక్కించుకున్నారు. మరి ఈ ముగ్గురిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవాలంటే.. మనం వేచి చూడాల్సిందే.

ఆ తరువాత జరిగిన బిగ్ బాస్ కాలేజీ టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగింది. లెక్చరర్స్‌గా బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, వితికలు వినోదాన్ని పంచారు.  మిగిలిన ఇంటి సభ్యులు కూడా స్టూడెంట్స్‌గా రెచ్చిపోయారు. ఇదే క్రమంలో బాబా భాస్కర్ లవ్వాలజి, వితిక గాసిపాలజీ, వరుణ్ సందేశ్ చిల్లాలజి సబ్జెక్ట్స్‌గా లెక్చరర్స్‌గా అందరిని అలరిస్తూ.. అందరిచేత నవ్వులు పూయించారు. ఈ టాస్క్‌లో భాగంగానే బాబా భాస్కర్ తన స్టూడెంట్ శివజ్యోతిని అడిగిన ప్రశ్నలకి.. ఆమె కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది.

Bigg Boss Telugu 3: టాస్క్ వల్ల.. వితిక, శివజ్యోతి, హిమజ మధ్య విభేదాలు!

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.