Bigg Boss Telugu 3: కెప్టెన్స్ టాస్క్ వల్ల.. వితిక, శివజ్యోతి, హిమజ మధ్య విభేదాలు!

Bigg Boss Telugu 3: కెప్టెన్స్ టాస్క్ వల్ల.. వితిక, శివజ్యోతి, హిమజ మధ్య విభేదాలు!

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3'లో ఎనిమిదవ వారం రేపటితో ముగియనుంది. ఇక మొన్ననే వితిక కెప్టెన్సీ టాస్క్‌లో గెలుపొంది.. కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించింది. అయితే ఆ  టాస్క్‌కి సంబంధించి.. ఇంట్లో రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అందులో మొదటిది.. టాస్క్ చేసే ముందు ఎవరిని ఎవరు ఎత్తుకుంటే టాస్క్ సులువుగా చేయవచ్చనే డిస్కషన్ వచ్చినప్పుడు.. శివజ్యోతి (Shivajyothi) చేసిన కామెంట్స్‌ని ఇంట్లో చర్చనీయాంశంగా మార్చారు వితిక.

Bigg Boss Telugu 3: హోరాహోరీ పోరులో.. శ్రీముఖి, మహేష్‌లను ఓడించి కెప్టెన్ అయిన వితిక

టాస్క్ ముగిసిన తరువాత ఓ రోజు వితిక (Vithika) శ్రీముఖితో మాట్లాడుతూ "వరుణ్, నేను ఒక టీమ్‌గా ఏర్పడే కన్నా.. రాహుల్, నేను ఒక టీమ్‌గా పార్టిసిపేట్ చేసుంటే బెటరని శివజ్యోతి అంటోంది. ఆ కామెంట్స్ చాలా అర్థరహితంగా ఉన్నాయి. తను తప్ప మరొకరు లేడి కెప్టెన్ అవ్వకూడదని ఆమె మనసులో అనుకుందేమో. అందుకే అలా చెప్పిందని భావిస్తున్నా" అని తెలిపింది.

అదే సమయంలో "నువ్వు కూడా శివజ్యోతితో కలిసి ఒక టీమ్‌గా పార్టిసిపేట్ చేద్దామన్నావు. కానీ రవికృష్ణతో కలిసి పార్టిసిపేట్ చేయమని చెప్పింది కదా" అంటూ శ్రీముఖితో వాదించింది వితిక. ఇదంతా సావధానంగా విన్న శ్రీముఖి... తరువాత ఇదే విషయాన్ని శివజ్యోతికి తెలిపింది. "అనవసరంగా  ఎవ్వరికీ సలహాలు ఇవ్వద్దు. నీ సలహాలు అర్ధం చేసుకోలేని వారికైతే అసలే ఇవ్వకు" అని తనదైన శైలిలో మ్యాటర్ లీక్ చేసింది. దానితో వితిక తన పై చేసిన కామెంట్స్‌కి శివజ్యోతి బాధపడింది.

అలాగే కెప్టెన్సీ టాస్క్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు... తనకెందుకు మద్దతు తెలపలేదని బాబా భాస్కర్, వరుణ్ సందేశ్‌లని హిమజ (Himaja) ప్రశ్నించడం గమనార్హం. వారిద్దరూ మద్దతు తెలపలేదు కాబట్టి.. 'ఈ విషయం గుర్తుపెట్టుకుంటాను' అని హిమజ చేసిన కామెంట్స్ కూడా హౌస్‌లో చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి ఒక కెప్టెన్సీ టాస్క్ ముగిశాక.. దాని పరిణామాలు ఇంటి సభ్యుల మధ్య విబేధాలు సృష్టిస్తున్నాయనే చెప్పాలి.

Bigg Boss Telugu 3: బాబా భాస్కర్, శ్రీముఖిల మధ్య విభేదాలు మొదలయ్యాయా?

ఇదిలావుండగా నిన్న హౌస్‌లో 'సీక్రెట్స్ & లైస్' టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌లో భాగంగా కొందరు ఇంటి సభ్యులని ఎంపిక చేసి.. వారిని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. తర్వాత వారి చేత కొన్ని ఫన్నీ టాస్క్‌లు చేయించి పంపించారు.

తర్వాత టాస్క్ చేసిన వారు.. ఆ టాస్క్ వివరాలను ఇంటి సభ్యులకు చెప్పాల్సిందిగా బిగ్ బాస్ తెలిపారు.  వారు చెప్పేది నిజామా? కాదా? అనేది హౌస్ మేట్స్ పసిగట్టి చెప్పాలి. వారు సరిగ్గా సమాధానమిస్తే.. బిగ్ బాస్ వారికి స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేస్తానని కూడా తెలిపారు.

ఈ టాస్క్‌లో ఎన్నో ఫన్నీ ఫన్నీ సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా బాబా భాస్కర్‌తో A,B,C,D లు చెప్పించడం ఈ టాస్క్‌లకే హైలెట్. అలాగే రాహుల్ సిప్లిగంజ్ చేసిన టాస్క్ విషయంలో... శ్రీముఖి, వరుణ్ సందేశ్‌ల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. శ్రీముఖి ఉపయోగించిన పద జాలం అభ్యంతరకరంగా ఉందని వరుణ్ అనడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.

దాంతో కొద్దిసేపు ఇంటిలో అందరూ సైలెంట్ అయ్యారు. చివరికి ఈ ఇద్దరు కూడా.. ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఇద్దరి గొడవలో బాబా భాస్కర్.. వరుణ్‌కి మద్దతు తెలపడంతో శ్రీముఖి కన్నీటిపర్యంతమైంది.

మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌లో అటు కెప్టెన్సీ టాస్క్.. ఇటు డైలీ టాస్క్ వల్ల ఏర్పడిన పరిణామాలతో ఇంటి సభ్యుల మధ్య విభేదాలు రావడం కొసమెరుపు.                                                                       

నేను తప్పు చేయలేదు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ నేను చేయను : పునర్నవి