ADVERTISEMENT
home / Celebrity Life
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకి బంపర్ ఆఫర్.. ‘నాగ్’  చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కార్..!

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకి బంపర్ ఆఫర్.. ‘నాగ్’ చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కార్..!

బ్యాడ్మింటన్ క్రీడలో అనేకమార్లు రికార్డులు తిరగరాయడంతో పాటు.. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన స్టార్ క్రీడాకారిణి పీవీ సింధుని (PV Sindhu)  ఇప్పటికే భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా అభినందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు పారిశ్రామికవేత్తలు సింధుకు ఎన్నో బహుమతులు, కానుకలు అందజేశారు. ఈ క్రమంలో ఈ రోజు ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ సహ యాజమాని చాముండేశ్వరీ నాథ్ బీఎండబ్ల్యూ కారుని బహుకరించారు. ఆ కారు తాళాలను సినీ నటుడు అక్కినేని నాగార్జున చేతుల మీదుగా అందించారు.

సైనా నెహ్వాల్ పాత్ర పోషించేది శ్ర‌ద్ధాక‌పూర్ కాదు.. ప‌రిణీతి చోప్రా..!

ఈ సందర్భంగా నాగార్జున (Akkineni Nagarjuna) మాట్లాడుతూ, తాను పీవీ సింధుకి పెద్ద ఫ్యాన్‌‌ని అని తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌ను తాను అమెరికా నుండి తిలకించానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. క్రీడలలో రాణించే వ్యక్తులకు చాముండేశ్వరీనాథ్ గత అనేక సంవత్సరాలుగా కార్లను బహుమతులుగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు 22 కార్లను ఆయన బహుకరించారు. అయితే అందులో 4 కార్లను సింధు కైవసం చేసుకోవడం విశేషం. తాజాగా సింధుకి కారును బహుమతిగా ఇస్తున్న సందర్భంగా.. తనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కూడా పాల్గొన్నారు. 

బీడబ్ల్యూఎఫ్ టూర్‌లో.. దుమ్మురేపిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

ADVERTISEMENT

సింధుకి జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ యాజమాన్యం తరఫున తనకు కారును బహుమతిగా అందించారు. ఈ లీగ్‌కి చాముండేశ్వరీనాథ్, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌తో పాటు సినీ నటులు అక్కినేని నాగార్జున కూడా పార్టనర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సింధు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడారు. విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని మంజూరు చేయాల్సిందిగా కోరారు.

తేజ‌స్‌లో గ‌గ‌న‌విహారం చేసిన తెలుగు తేజం.. పీవీ సింధు..!

హైదరాబాదులో జన్మించిన పీవీ సింధు.. ఎనిమిదేళ్ల నుండే బ్యాడ్మింటన్ క్రీడను అభ్యసిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ వాలీబాల్ క్రీడాకారులు. ఆమె తండ్రి రమణ స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగం సంపాదించారు. అయితే తండ్రి వాలీబాల్ క్రీడాకారుడైనా.. సింధు బ్యాడ్మింటన్ క్రీడనే తన కెరీర్‌గా ఎంచుకున్నారు. 2016లో రియో డి జెనిరోలో జరిగిన ఒలింపిక్స్‌లో రజత పతకం కైవసం చేసుకున్న సింధు.. 2018లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో.. అలాగే 2019లో జరిగన ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు.                                                                                                                          

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

ADVERTISEMENT

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

 

14 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT