నేను తప్పు చేయలేదు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ నేను చేయను : పునర్నవి

నేను తప్పు చేయలేదు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ నేను చేయను : పునర్నవి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో (Bigg Boss Telugu) కంటెస్టెంట్‌గా ఉన్న పునర్నవికి ఒక వైవిధ్యమైన శైలి ఉంది. అలా నలుగురిలో కాస్త వైవిధ్యంగా ఉండడమే.. ఆమెని అప్పుడప్పుడు బిగ్ బాస్ ఇంటి సభ్యులందరిలోనూ కాస్త వెరైటీగా కనిపించేలా చేస్తుంటుంది. అయితే మొన్న జరిగిన వీక్లి టాస్క్ - 'ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం' సందర్భంగా.. ఇంటి సభ్యులు తనతో ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయంగా ఉందని.. అలాగే బిగ్ బాస్ కూడా అర్థరహితమైన రూల్స్ పెట్టడం జరిగిందంటూ విమర్శలు చేసింది పునర్నవి భూపాళం.

Bigg Boss Telugu 3: బిగ్ బాస్‌ని నిందించారు.. అందుకే పునర్నవి, శ్రీముఖిలకి శిక్ష పడిందా?

ఇక నిన్నటి ఎపిసోడ్లో వీక్లి టాస్క్ రెండవ రోజుకి చేరిన సమయంలో.. మనుషుల నుండి దెయ్యాలుగా మారిన శ్రీముఖి, పునర్నవి, మహేష్ విట్టాలు టాస్క్‌లో పాల్గొనలేదు. ఇటువంటి నియమాలు ఉన్న టాస్క్‌లో తాము పాల్గొనలేమని వారు బిగ్ బాస్‌కి తెలియచేశారు. అలాగే తమవంతు ప్రయత్నం చేశామని.. ఇంతకు మించి చేయడం తమ వల్ల కాదని కూడా చేతులెత్తేశారు.

పునర్నవి (Punarnavi) ఈ టాస్క్‌ని ముందునుండి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఈ టాస్క్ అర్థరహితమని, దెయ్యాలకి ఒక రూల్, మనుషులకి ఒక రూల్ పెట్టి.. టాస్క్‌ని నడిపించడం కరెక్ట్ కాదని ఆమె వాదించారు. ఈ క్రమంలో పునర్నవి మాట్లాడుతూ " బిగ్ బాస్ మీరు కరెక్ట్ కాదు, మీరు కూడా తప్పులు చేస్తారు" అంటూ బిగ్ బాస్ పైన తన అసహనం వ్యక్తం చేసింది. 

వీరు టాస్క్‌లో  పాల్గొనకపోవడంతో.. కొద్దిసేపటికి 'ఈ టాస్క్ పూర్తయింది' అని బిగ్ బాస్ ప్రకటించడం జరిగింది. అలా ప్రకటించిన తరువాత.. ఇంటి సభ్యులందరిని ఉద్దేశిస్తూ.. 'ఒక టాస్క్ ఇచ్చినప్పుడు.. దానిలో అందరూ సహకరిస్తూ పాల్గొనాలి.. అంతేతప్ప టాస్క్‌‌లని విమర్శిస్తూ అందులో పాల్గొనకపోవడం చాలా తప్పు' అంటూ చెప్పడం జరిగింది.

ఇక ఈ వీక్లి టాస్క్‌లో భాగంగా వరస్ట్ పెర్ఫార్మర్స్‌ని ముగ్గురిని స్వయంగా బిగ్ బాస్  ఎంపిక చేయడం జరిగింది. ఆ ముగ్గురే - పునర్నవి, శ్రీముఖి, మహేష్ విట్టా. ఈ ముగ్గురూ  టాస్క్ నియమాలు ఉల్లంఘించడంతో పాటుగా.. టాస్క్‌లో పాల్గొనకుండా ఉండడం వంటివి చేయడంతో.. ఈ ముగ్గురిని వరస్ట్ పెర్ఫార్మర్స్‌గా ప్రకటించారు.

Bigg Boss Telugu 3: డబుల్ ఎలిమినేషన్‌కి ప్లాన్ చేసిన బిగ్‌బాస్?

అయితే ఇలా టాస్క్‌లలో సరిగా పాల్గొనకుండా.. టాస్క్ సరిగా లేదంటూ విమర్శలు చేయడం సరికాదని.. అలా వారు టాస్క్ పూర్తి చేయని కారణంగా.. వారికి ఒక స్పెషల్ టాస్క్ ఇవ్వడం జరుగుతుందని బిగ్‌బాస్ ప్రకటించారు. ఆ టాస్క్ ఏంటంటే - బ్లాక్ షూస్‌కి పాలిష్ వేయడం.

బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్‌‌ని చేయడానికి శ్రీముఖి వెంటనే ఒప్పుకోగా... మహేష్ విట్టా, పునర్నవిలు మాత్రం ఖరాఖండిగా తాము చేయమని చెప్పేశారు. బిగ్‌‌బాస్ హౌస్‌కి వచ్చింది షూ పాలిష్ చేయడానికా..? అంటూ ఎదురు ప్రశ్నించారు. అయితే ఆ తరువాత ఇంటి సభ్యులు నచ్చజెప్పడంతో.. మహేష్ విట్టా షూ పాలిష్ టాస్క్ చేయడానికి ఒప్పుకోవడం జరిగింది.

కాని పునర్నవి మాత్రం 'నేను ఎటువంటి తప్పు చేయలేదు. టాస్క్ విషయంలో మిగతా ఇంటి సభ్యులతో పాటు బిగ్‌బాస్ తప్పు ఉంది. కాబట్టి నేను ఆ పనిష్మెంట్ రూపంలో ఇస్తున్న టాస్క్ చేయను' అని తెగేసి చెప్పింది. ఇంట్లో ఎంతమంది నచ్చజెప్పినా సరే.. తాను బిగ్ బాస్ ఇంటి నుండి వెళ్లిపోవడానికైనా సిద్ధమే కాని.. ఇటువంటి టాస్క్ మాత్రం చేయనని ఆమె చెప్పేసింది. ఈ టాస్క్ చేయకపోతే 'వచ్చే వారం నామినేషన్స్‌లోకి నేరుగా పంపిస్తామని బిగ్ బాస్ ప్రకటించినా' కూడా పునర్నవి షూ పాలిష్ టాస్క్ చేయడానికి ముందుకి రాలేదు. ఈ తరుణంలో పునర్నవి .. రాబోయే రోజుల్లో బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ప్రవర్తించబోతుందనేది ఇప్పుడు టాక్ అఫ్ ది టౌ‌న్‌‌గా మారింది.

ఇదిలావుండగా... ఈ వీక్లి టాస్క్‌లో బాబా భాస్కర్, వితిక, రాహుల్ సిప్లిగంజ్‌లు చాలా కష్టపడి టాస్క్ పూర్తి చేసినట్టుగా బిగ్ బాస్ ప్రకటించారు.

Bigg Boss Telugu 3: బాబా భాస్కర్, శ్రీముఖిల మధ్య విభేదాలు మొదలయ్యాయా?